ఆ సినిమా కోసం రాబోతున్న ప్రభాస్.. రాధే శ్యామ్ తరువాత మొదటిసారి ఇలా..

రాధే శ్యామ్ సినిమా తీవ్రంగా నిరాశపరచడంతో ప్రభాస్ ఆ సినిమా విడుదల తర్వాత మళ్లీ బయట ఎక్కడ కూడా కనిపించలేదు. అప్పుడప్పుడు కొన్ని సినిమాలకు సంబంధించిన ప్రమోషన్స్ కోసం ట్రైలర్ టీజర్స్ సోషల్ మీడియాలో విడుదల చేస్తున్నప్పటికీ కూడా ప్రభాస్ డైరెక్ట్ గా ఇంతవరకు ప్రేక్షకుల ముందు కనిపించింది లేదు. మధ్యలో సర్జరీ అంటూ విదేశాలకు వెళ్లిన విషయం తెలిసిందే. ఇక తర్వాత స్వదేశానికి రాగానే ప్రాజెక్టు K తో పాటు సలార్ సినిమా షూటింగ్స్ ను మొదలుపెట్టాడు.

ఇక ప్రస్తుతం తీరికలేకుండా బిజీగా గడుపుతున్న ప్రభాస్ మళ్లీ ప్రేక్షకుల ముందుకు ఎప్పుడు వస్తాడు అనేది అందరిలోనూ ఎంతో ఆసక్తిని కలిగిస్తుంది. అయితే సల్మాన్ నటించిన సీతారామం సినిమా ద్వారా ప్రభాస్ అభిమానులకు కనిపించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఆ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కోసం ప్రభాస్ ప్రత్యేకంగా రాబోతున్నట్లుగా ఒక టాక్ అయితే వస్తోంది. ముందుగా చెబితే భారీ సంఖ్యలో అభిమానులు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఆయనను సర్ ప్రైజింగ్ గానే స్టేజి పైకి తీసుకువచ్చే అవకాశం ఉన్నట్లు మరొక టాక్ వినిపిస్తోంది.

Prabhas invited by Sita Ramam unit for pre release event

వైజయంతి మూవీస్ నిర్మించిన సీతారామం సినిమా పై అంచనాలు ఇప్పుడిప్పుడే పెరుగుతున్నాయి. ఇక ప్రభాస్ వైజయంతి మూవీస్ లోనే ప్రాజెక్టు కే సినిమా చేస్తున్నాడు. కాబట్టి వారితో ఉన్న అనుబంధంతో ఈ సినిమా ఈవెంట్ కు వచ్చే అవకాశం అయితే ఉంది. నిర్మాత అశ్వినీదత్ అయితే ప్రత్యేకంగా ఇన్వైట్ చేసినట్లు సమాచారం. కానీ ఇంకా ప్రభాస్ నుంచి గ్రీన్ సిగ్నల్ అయితే రాలేదని తెలుస్తోంది. ఏదేమైనా ప్రభాస్ వస్తే మాత్రం ఈ సినిమాకు మరో రేంజ్ లో క్రేజ్ అయితే ఏర్పడుతుంది. సీతారామం సినిమా ఆగస్టు 5వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది. ఇక ప్రాజెక్ట్ K సినిమా వచ్చే ఏడాది దసరా సమయంలో విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు అశ్వినీదత్ క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. అప్పుడు కుదరకపోతే 2024 జనవరిలో రిలీజ్ చేస్తారని తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X