లారెన్స్‌తో విబేధాల వల్లే ప్రభాస్ డుమ్మా కొట్టాడా?
హైదరాబాద్ : ప్రభాస్ నటించిన 'రెబెల్' చిత్రం టీజర్ నిన్న హైదరాబాద్‌లో విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి దర్శకుడు లారెన్స్, హీరోయిన్లు తమన్నా, దీక్షాసేథ్, నిర్మాతలు అంతా హాజరయ్యారు. అయితే అందరికంటే ముఖ్యమైన పర్సనాలిటీ హీరో ప్రభాస్ మాత్రం హాజరు కాలేదు.
అయితే ప్రభాస్ ఈకార్యక్రమానికి డుమ్మా కొట్టడం వెనక అనేక కారణాలు వినిపిస్తున్నాయి. దర్శకుడు లారెన్స్‌తో విబేధాల వల్లనే అతను ఈ కార్యక్రమానికి హాజరు కాలేదని అంటున్నారు. లారెన్స్ తన అన్ ప్రొఫెషనల్ బిహేవియర్ వల్ల సినిమాను చాలా లేట్ చేశాడని, అతని వల్ల నా డేట్స్ అన్నీ చిందర వందర అయ్యాయని, నా ప్రాజెక్ట్స్ అన్నీ డిలే అవుతున్నాయని ప్రభాస్ కోపంగా ఉన్నాడట.
అయితే రెబెల్ యూనిట్ వర్గాలు మాత్రం ఈ వార్తలు ఖండిస్తున్నాయి. ప్రభాస్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న 'వారధి' చిత్రం షూటింగులో భాగంగా రామోజీ ఫిల్మ్ సిటీలో ఉన్నారని, లారెన్స్ కి ప్రభాస్‌కి మధ్య ఎలాంటి విబేధాలు లేవని అంటున్నారు.
కానీ ఫిల్మ్ నగర్లో మాత్రం ఇద్దరి మధ్య విబేధాలు ముదిరాయనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. విబేధాలు లేకుండా ఎందుకు హాజరు కాలేదు? రామోజ ఫిల్మ్ సిటీ నుంచి వచ్చి టీజర్ రిలీజ్ వేడుకలో పాల్గొనడం ఏమైనా కష్టమా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
కాగా...వారధి షూటింగ్ దాదాపు 75 శాతం పూర్తయింది. ఇందులో ప్రభాస్ సరసన అనుష్క, రీచా నటిస్తున్నారు. వంశీ కృష్ణారెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి యువి క్రియేషన్స్ బ్యానర్ పై ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు. కొరటాల శివ దర్శకుడిగా పరిచయం అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











