Just In
- 51 min ago
ప్రియుడితో జ్వాలా గుత్తా కెమిస్ట్రీతో కేక.. బికినీలో ఆమె.. సిక్స్‌ప్యాక్‌తో అతను.. హాట్ హాట్‌గా
- 1 hr ago
విదేశీ భామతో రాంచరణ్ రొమాన్స్.. అదరగొట్టేలా శంకర్ ప్యాన్ వరల్డ్ మూవీ ప్లానింగ్
- 2 hrs ago
డెలివరీ సమయంలో అలాంటి పరిస్థితి.. కన్నీరు పెట్టించిన మధుమిత-శివ బాలాజీ
- 2 hrs ago
రాజేంద్రప్రసాద్ నటించిన క్లైమాక్స్ సెన్సార్ పూర్తి... మార్చి 5న రిలీజ్!
Don't Miss!
- News
స్నేహితుడి తల్లిపై కన్ను.. కోరిక తీర్చమని వేధింపులు, తిరగబడటంతో దాడి
- Sports
నాలుగు నగరాల్లో ఐపీఎల్ 2021.. హైదరాబాద్‌లో కూడా మ్యాచులు!!
- Finance
ఏడాదిన్నరలో రూపాయి దారుణ పతనం, ఏకంగా 104 పైసలు డౌన్
- Automobiles
సన్నీలియోన్ భర్త కార్ నెంబర్ ఉపయోగిస్తూ పట్టుబడ్డ వ్యక్తి, పోలీసులకు ఏం చెప్పాడంటే?
- Lifestyle
అందమైన మెరిసే జుట్టు పొందాలనుకుంటున్నారా? కాబట్టి ఈ ఆహారాలలో కొంచెం ఎక్కువ తినండి ...
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ప్రేయసి లేకుండా షూటింగ్.. ప్రభాస్‌పై ఆ సీన్లు తెరకెక్కించేందుకు సిద్దం
బాహుబలి 1- బాహుబలి 2- సాహో లాంటి సినిమాలు ప్రభాస్ ఇమేజ్‌ను అమాంతం పెంచేశాయి. బాహుబలి సినిమాలతో ప్యాన్ ఇండియా హీరోగా ఎదిగిన ప్రభాస్.. సాహో లాంటి డబ్బింగ్ సినిమాతో బాలీవుడ్ బాక్సాఫీస్‌ను ఊపేశాడు. ప్రస్తుతం ప్రభాస్ చేసే చిత్రాలన్నీ ప్యాన్ ఇండియన్ మూవీస్‌గానే చిత్రీకరిస్తున్నారు. జాన్ చిత్రాన్ని కూడా జాతీయ స్థాయిలోని తెరకెక్కిస్తున్నారు.

బిజీ బిజీగా మారిన ప్రభాస్..
సాహో చిత్ర ప్రమోషన్స్ తరువాత వెకేషన్స్, బాహుబలి స్పెషల్ స్క్రీనింగ్ కొరకు లండన్ వెళ్లడం ఇలా బిజీ బిజీగా గడిపాడు ప్రభాస్. దీంతో కావాల్సిన విశ్రాంతి దొరికింది. తాజాగా మళ్లీ పనిలో నిమగ్నమయ్యేందుకు రెడీ అవుతున్నాడు. జాన్ సినిమా షూటింగ్‌లో పాల్గొనబోతోన్నాడు.

వాయిదాలు పడుతూ..
ప్రభాస్ బిజీగా ఉండటం వలన జాన్ మూవీ షూటింగ్ షెడ్యూలు దాదాపు నాలుగు నెలలుగా వాయిదా పడింది. దీనితో దర్శకుడు రాధా కృష్ణ ఈమూవీ నెక్స్ట్ షెడ్యూల్ పట్టాలెక్కించే పనిలో బిజీగా ఉన్నారు. ఇప్పటికే ఓ షెడ్యూల్‌ను కంప్లీట్ చేసిన చిత్రబృందం.. త్వరగా షూటింగ్‌ను పూర్తి చేసేందుకు సన్నాహాలు చేస్తోంది.

ప్రేమకథా చిత్రం..
యూరఫ్ నేపథ్యంలో సాగే పీరియాడిక్ లవ్ స్టోరీగా ఈ మూవీని దర్శకుడు ఆసక్తికరంగా మలచనున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీలో పూజా హెగ్డే ప్రభాస్ సరసన హీరోయిన్ గా నటిస్తుంది. వీరిద్దరిపై వచ్చే సన్నివేశాలు కొత్తగా ఉంటాయని సమచారం.

హైదరాబాద్‌లో సెట్..
హైదరాబాద్ లో వేసిన ప్రత్యేక సెట్ లో ఈ మూవీ షూటింగ్ నిర్వహించనున్నారు. మొదట్లో మూవీ మొత్తం యూరోప్ లో షూట్ చేయాలని భావించినా, బడ్జెట్ పరిమితుల రీత్యా సెట్స్ తో మేనేజ్ చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు.

ప్రేయసి లేకుండానే..
ఈ షెడ్యుల్‌లో ఆసక్తికర విషయం ఏమిటంటే ప్రభాస్ ప్రేయసి పూజా హెగ్డే లేకుండానే దర్శకుడు రాధా కృష్ణ షూట్ చేయనున్నారట. ప్రభాస్ పై వచ్చే కొన్ని సన్నివేశాలు ఈ షెడ్యూల్‌లో చిత్రీకరించనున్నారు. యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్నారు.