పాన్ ఇండియా దర్శకుడి కోసం పోటీ పడుతున్న ఎన్టీఆర్, ప్రభాస్.. ?

పాన్ ఇండియా సినిమా అనగానే ఇప్పుడు ఎక్కువగా మన హీరోలే గుర్తుకు వస్తున్నారు. మొన్నటివరకు 100కోట్ల బడ్జెట్ అనగానే బాలీవుడ్ హీరోలు మాత్రమే గుర్తుకు వచ్చే వారు. కానీ ఎప్పుడైతే బాహుబలి వచ్చిందో అప్పటి నుంచి బాలీవుడ్ కి ధీటుగా మన హీరోలు అడుగులు వేస్తున్నారు. ఇక ప్రభాస్ తరువాత టాలీవుడ్ నుంచి జూనియర్ ఎన్టీఆర్ కూడా ఎక్కువగా పాన్ ఇండియా కథలపైనే ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు.

ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో RRR సినిమా చేస్తున్న తారక్ తప్పకుండా బాలీవుడ్ లో ఒక బలమైన ముద్ర వేస్తాడని చెప్పవచ్చు. త్రివిక్రమ్ తో చేస్తున్న సినిమాను కూడా పాన్ ఇండియా సినిమాగా రూపొందిస్తున్నారు అనే రూమర్స్ అయితే వచ్చాయి. కానీ అఫీషియల్ ఎనౌన్స్మెంట్ వచ్చే వరకు కూడా ఆ విషయాన్ని నమ్మలేము. ఇక మరోవైపు ప్రశాంత్ నీల్ తో కూడా తారక్ గత కొన్ని నెలలుగా చర్చలు జరుపుతున్నాడు.

Prabhas jr ntr special target on kgf director prashanth neel

ఇక మరోవైపు ప్రభాస్ కూడా ప్రశాంత్ తో రెగ్యులర్ గా టచ్ లో ఉంటున్నట్లు టాక్. అతను డైరెక్ట్ చేస్తున్న KGF 2 అయిపోగానే సినిమాను ఎనౌన్స్ చేయించాలని చూస్తున్నారు. ప్రశాంత్ అయితే ఇద్దరు స్టార్ హీరోలను లైన్ లో పెట్టాడు గాని ముందు ఎవరితో వర్క్ చేస్తాడు అనే విషయంలో బిగ్ కన్ఫ్యూజన్ ఏర్పడింది. ప్రభాస్ ప్రస్తుతం రాధే శ్యామ్ ని పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నాడు. ఆ తరువాత నాగ్ అశ్విన్ సైన్స్ ఫిక్షన్ కథతో పాటు రామాయణ బ్యాక్ డ్రాప్ లో రానున్న ఆది పురుష్ సినిమాను చేయనున్నాడు. మరి ప్రశాంత్ సినిమాను ఎప్పుడు లైన్ లోకి తెస్తాడో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X