Kalki 2898AD: ప్రభాస్ ఫ్యాన్స్‌కు చేదు వార్త.. నిర్మాత అశ్వనీదత్ బ్లాక్ బస్టర్ మార్పు
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కు తెలుగు రాష్ట్రాల్లో ఎంతటి క్రేజ్ ఉందో తెలిసిందే. ఆయన పేరు చెబితే చాలు విజిల్స్ పడతాయి. అరుపుల కేకలతో థియేటర్లు మారు దద్దరిల్లి పోతాయి. ఈశ్వర్ సినిమా నుంచి ఆదిపురుష్ వరకు తన క్రేజ్ పెంచుకుంటూ పోతున్న ప్రభాస్ సినిమాల ఫలితం ఎలా ఉన్నా క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ ఏమాత్రం తగ్గడం లేదు. ప్రస్తుత ఐదారు సినిమాలతో అభిమానులను సందడి చేసేందుకు రెడీగా ఉన్నాడు ప్రభాస్. ఇక డార్లింగ్ సినిమా కోసం ఎంతగా ఎదురుచూస్తుంటారో కూడా తెలిసిందే. అలాంటిది కల్కి 2898 ఏడీ (Kalki 2898AD) నిర్మాత అశ్వనీదత్ పెద్ద ట్విస్ట్ ఇచ్చారు.
అగ్ర తారలు:గ్లోబల్ స్టార్ ప్రభాస్, హిందీ భామ దీపికా పదుకొణె జత కట్టిన సినిమా కల్కి 2898 ఏడీ. మహానటి సినిమా దర్శకుడు నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను అతిపెద్ద నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ బ్యానర్ పై స్టార్ ప్రోడ్యూసర్ అశ్వినీదత్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దిశా పటానీ వంటి అగ్ర తారాగణం నటిస్తోంది.

టైటిల్ గ్లింప్స్:కల్కి 2898 ఏడీ సినిమాలో లోక నాయకుడు కమల్ హాసన్ విలన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. విష్ణువు చివరి అవతారమైన కల్కిగా ప్రభాస్ కనిపించనున్నాడు. దీనికి సంబంధించిన పోస్టర్స్, గ్లింప్స్ కు సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇటీవల శాన్ డియాగో కామిక్ కాన్ వేదికగా చేసిన టైటిల్ అనౌన్స్ గ్లింప్స్ కు భారీ స్పందన వచ్చింది.
తెలుగులో మొదటగా:కల్కి 2898 ఏడీ అనే టైటిల్ గ్లింప్స్ లో ప్రజలను కాపాడే కల్కిగా ప్రభాస్ గెటప్ అదిరిపోయింది. పాపాలు ఎక్కువై కలి రాక్షసుడు జన్మించినప్పుడు అతన్ని అంతమొందించడానికి కల్కి వస్తాడన్న కాన్సెప్ట్ తో ఈ సినిమా తెరకెక్కింది. అయితే ఇప్పటివరకు తెలుగులో ఫ్యూచర్ కు సంబంధించిన సినిమాలను పూర్తి స్థాయిలో చూపించలేదు. ఇలా తొలిసారిగా 2898 నాటి కాలాన్ని ఊహాజనితంగా చూపించనున్నారు డైరెక్టర్ నాగ్ అశ్విన్.

జనవరి 12న:కల్కి 2898 ఏడీ అనే టైటిల్ గ్లింప్స్ చూసిన ప్రతి ఒక్కరూ సినిమా ఎప్పుడెప్పుడూ విడుదల అవుతుందా అని ఎదురుచూస్తున్నారు. ఈ సమయంలో ప్రభాస్ ఫ్యాన్స్ కు చేదు వార్త వినిపిస్తోంది. కల్కి సినిమాను ముందుగా జనవరి 12, 2024లో విడుదల చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు. కానీ, ఇప్పుడు ఈ సినిమాను వాయిదా వేసే ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది.

బ్లాక్ బస్టర్ హిట్స్:ప్రభాస్ కల్కి సినిమాను అనుకున్న డేట్ కంటే మే 9, 2024న విడుదల చేయాలని మేకర్స్ అనుకుంటున్నారట. మూవీ ప్రొడ్యూసర్ అశ్వనీదత్ స్వయంగా రిలీజ్ డేట్ మార్చారని టాక్ వినిపిస్తోంది. ఎందుకంటే వైజయంతీ బ్యానర్ లో ఆ తేదిన విడుదలైన చిత్రాలన్నీ బ్లాక్ బ్లస్టర్ హిట్ గా నిలిచాయి. నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేసిన మహానటి, జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమాలు కూడా అదే తేదిన విడుదలయ్యాయి.

గ్రాఫిక్స్ కూడా:మే 9న గురువారం కావడంతో వీకెండ్ కలిసిరావడం, పైగా సమ్మర్ కూడా ఉండటంతో కల్కి సినిమాకు కలెక్షన్ల పరంగా హెల్ప్ అవుతుందని ఆలోచిస్తున్నాట మేకర్స్. ఇదే కాకుండా రిలీజ్ డేట్ మార్చడానికి మూవీ గ్రాఫికల్ వర్క్ కూడా ఒక కారణం అని టాక్ వినిపిస్తోంది. అయితే ఈ విషయాలపై ఎలాంటి అధికారిక ప్రకటన అయితే రాలేదు. మరి చూడాలి కల్కి 2898 ఏడీ రిలీజ్ డేట్ మారుతుందా? లేదా? అని.


Click it and Unblock the Notifications











