Kalki 2898AD ఆసియాలో ఒకే ఒక్కడు ప్రభాస్.. 'కల్కి'తో సంచలన రికార్డ్.. ఫస్ట్ డేనే రూ.500 కోట్లు!
నెక్స్ట్ సమ్మర్‌లో రానున్న భారీ పాన్ ఇండియా సినిమా 'కల్కి'. సలార్ వంటి భారీ గ్రాండ్ హిట్ తర్వాత పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నుంచి రాబోతున్న చిత్రమిది. దీనిపై మొదటి నుంచి ఊహకుమించిన భారీ అంచనాలు నెలకొన్నాయి. మూవీటీమ్ ఆ రేంజ్లో ఎక్స్‌పెక్టేషన్స్‌ను పెంచుతోంది. ఇంకా చెప్పాలంటే పాన్ ఇండియా కాదు అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో పాన్ వరల్డ్‌గా రాబోతుందని అంటోంది. అయితే ఇప్పుడీ సినిమా రిలీజ్‌కు సంబంధించి మరో సూపర్ అప్డేట్ వచ్చింది. ఆసియాలోనే ఆ రికార్డ్ సాధించిన తొలి చిత్రంగా నిలవనుంది. అదేంటో తెలుసుకుందాం..
గతేడాది సలార్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు రెబల్ స్టార్ హీరో ప్రభాస్. నెక్ట్స్ ఈ హీరో కాంపౌండ్ నుంచి రాబోతున్న సినిమా 'కల్కి 2898 ఏడి'. ప్రభాస్ టైటిల్ రోల్‌లో నటిస్తున్న మోస్ట్ ఎవెయిటెడ్ ప్రాజెక్ట్ ఇది కల్కి 2898 ఏడీ. మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నారు. సైన్స్ ఫిక్షన్ జోనర్‌లో ఇది రాబోతుంది. ఇప్పటికే రిలీజ్ చేసిన గ్లింప్స్ నెట్టింట వ్యూస్‌ను అందుకుని టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచింది.

అయితే ఈ చిత్రం మొదటి నుంచే పురాణాలను టచ్ చేస్తూ తెరకెక్కుతోందని ప్రచారం సాగుతున్న సంగతి తెలిసిందే. ప్రభాస్ కల్కి అవతారంలో కనిపించనున్నారని అన్నారు. బిగ్ బీ అమితాబ్ బచ్చన్ పాత్రను అశ్వథ్థామను రిఫరెన్స్‌గా తీసుకొని డిజైన్ చేసినట్లు చెప్పారు. యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ విలన్‌గా నటిస్తున్నారు. బాలీవుడ్ హాట్ భామలు దీపికా పదుకొణె, దిశా పటానీ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.
ఇకపోతే ఈ చిత్రాన్ని ఏకంగా మూడు భాగాలుగా తెరకెక్కిస్తున్నట్లుగా కూడా రూమర్స్ వచ్చాయి. మొదటి భాగాన్ని 'కల్కి 2898 AD' పేరుతో ఈ వేసవి మే 9న గ్రాండ్‌గా రిలీజ్ చేయనున్నట్లు ఆ మధ్య మేకర్స్ అనౌన్స్ చేశారు. అయితే ఇప్పుడీ సినిమా ఓ అరుదైన రికార్డును అందుకోనుందని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని దాదాపు 25కుపైగా భాషల్లో రిలీజ్ చేస్తున్నారట. ఒకవేళ ఇదే కనుక జరిగితే ఆసియాలోనే ఇన్ని భాషల్లో రిలీజైన తొలి చిత్రంగా నిలుస్తుంది.

ఈ సినిమాను వైజయంతీ మూవీస్ భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తోంది. దాదాపు రూ.500కోట్ల వరకు ఖర్చు చేస్తోందని తెలిసింది. ఎలాగో ప్రభాస్ సినిమా కాబట్టి కలెక్షన్ల విషయంలో టెన్షన్ అక్కర్లేదు. పెట్టిన పెట్టుబడి ఈజీగా వచ్చేస్తాయి. ఓపెనింగ్స్ కూడా ఆయన సినిమాలకు భారీగా ఉంటాయి. ఈ లెక్కన ఇప్పుడు కల్కి కూడా 25కు పైగా భాషల్లో రిలీజ్ అంటున్నారు కాబట్టి కనీసం తొలి రోజే ఓపెనింగ్స్ రూ.500కోట్లకు పైగా వసూళ్లను అందుకుంటుందని ట్రేడ్ వర్గాలు అంచనాలు వేస్తున్నాయి.


Click it and Unblock the Notifications











