twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    గోపీచంద్ కోసం ప్రభాస్ మరో కీలక నిర్ణయం.. ఆ కాంబో సెట్టవ్వడానికి అసలు కారణం ఇదన్నమాట!

    |

    సినిమా ఇండస్ట్రీలో నిత్యం సక్సెస్ లో కొనసాగడం అంత ఈజీ కాదు. ఎంత పెద్ద హిట్ లాభిస్తే అంత ఒత్తిడి కూడా పెరుగుతుంది. సినిమా సినిమాకు హీరోలపై అంచనాలు ఏ రేంజ్ లో పెరుగుతుంటాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇక మాస్ హీరో గోపీచంద్ పై కూడా చాలా సార్లు అలాంటి అంచనాలు కెరీర్ పై చాలా ఒత్తిడి తెచ్చాయు. గోపి హిట్టు చూసి చాలా కాలమైంది. అయితే ప్రభాస్ అతని కోసం ఒక ప్రాజెక్ట్ సెట్ చేసినట్లు తెలుస్తోంది.

     సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వకముందే..

    సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వకముందే..

    గోపిచంద్, ప్రభాస్ ఇద్దరు కూడా మంచి స్నేహితులని స్పెషల్ గా చెప్పనవసరం లేదు. సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వకముందే అవకాశాల కోసం చర్చలు జరుపుతున్నప్పుడు ఇద్దరికి పరిచయం ఏర్పడింది. ఇక వర్షం సినిమాతో గోపి విలన్ గా చేసినప్పటికీ ఎలాంటి బేధం లేకుండా ప్రభాస్ అతనికి ఇంకా దగ్గరయ్యాడు. సినిమా సినిమాకు ఇద్దరి మార్కెట్ లో వ్యత్యాసం చాలానే వచ్చింది.

    సందిగ్ధంలో పడిన గోపిచంద్

    సందిగ్ధంలో పడిన గోపిచంద్

    ప్రభాస్ ఎలా ఉన్నా కూడా తన స్నేహితులను మాత్రం మిస్ చేసుకోడని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక గోపిచంద్ తో కూడా అలానే ఉంటాడు. బయటకు కనిపించకపోయినా కూడా వీరిద్దరూ రెగ్యులర్ గా టచ్ లో ఉంటారు. ఇక భవిష్యత్తుపై కాస్త సందిగ్ధంలో పడిన గోపిచంద్ కోసం రెబల్ స్టార్ ఫైనల్ గా రెండు కథలను సెట్ చేయించిన్నట్లు రూమర్స్ అయితే వస్తున్నాయి. అందులో ఒకటి త్వరలోనే సెట్స్ పైకి రానుంది.

    అసలు మ్యాటర్ ఇదన్నమాట

    అసలు మ్యాటర్ ఇదన్నమాట

    సాహో సినిమా అంచనాలను అందుకోకపోయినప్పటికి దర్శకుడు సుజిత్ అంటే ప్రభాస్ కు కాస్త నమ్మకమే. ఇక అతన్ని గోపీచంద్ ని ఇటీవల కలిపేసినట్లు టాక్ వస్తోంది. గత కొంత కాలంగా ఈ కాంబినేషన్ పై అనేక రకాల కథనాలు వస్తున్న విషయం తెలిసిందే. అయితే అందుకు మొదటి కారణం మాత్రం ప్రభాస్ అని తెలుస్తోంది. పూర్తి కథను సిద్ధం చేసిన తరువాత మరొకసారి తనకు కూడా చెప్పాలని ప్రభాస్ ఒక కండిషన్ కూడా పెట్టాడట.

    ఎలాగైనా గోపీచంద్ సక్సెస్ లోకి రావాలని..

    ఎలాగైనా గోపీచంద్ సక్సెస్ లోకి రావాలని..

    ఎలాగైనా గోపిచంద్ కి తన ద్వారా ఒక మంచి సక్సెస్ రావాలని ప్రభాస్ తాపత్రయ పడుతున్నాడు. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. గతంలో యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో గోపిచంద్ చేసిన జిల్ సినిమా రూపొందడానికి ముఖ్య కారణం కూడా ప్రభాసే.. ఇక ఇప్పుడు సెకండ్ టైమ్ గోపి కెరీర్ పై కాస్త దృష్టి పెట్టిన రెబల్ స్టార్ ఎలాంటి ఫలితాన్ని అందిస్తాడో చూడాలి.

    English summary
    Needless to say, Prabhas' craze, which entered Tollywood as the successor of Rebel star Krishna Raju, is now at a special level. Prabhas, who rose to be the king of the box office with the film Bahubali, is celebrating his 41st birthday today. And millions of fans are offering him his best birthday wishes. Celebrities are also wishing Prabhas a happy birthday.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X