ఏంటిది నిజమా? ప్రభాస్ కీలక నిర్ణయం!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమాల కోసం ప్రస్తుతం అభిమానులు ఈగర్ గా వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇప్పటికే ప్రభాస్ సలార్, కల్కి 2898 ఏడీ వంటి చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఆ చిత్రాలకు ప్రేక్షకుల నుంచి భారీ రెస్పాన్స్ సొంతమైంది. ఏకంగా బాక్సాఫీస్ వద్ద కూడా ఊహించని ఫలితాలను అందుకుంది. కాసుల వర్షాన్ని కురిపించాయి. సలార్ చిత్రం రూ.700 కోట్ల గ్రాస్ ను వసూల్ చేయగా.. నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేసిన కల్కి 2898 ఏడీ చిత్రం వరల్డ్ వైడ్ గా రూ.1100 కోట్లకు పైగా గ్రాస్ వసూల్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రభాస్ తదుపరి చిత్రాలపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇదే సమయంలో ప్రభాస్ కీలక నిర్ణయాలు తీసుకున్నారని తెలుస్తోంది.
నెక్ట్స్ రిలీజ్ కాబోతున్న చిత్రాలివే..
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నుంచి నెక్ట్స్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రాలివే. ఒకటి మారుతీ దర్శకత్వం వహిస్తున్న 'ది రాజా సాబ్', మరోకటి సీతారామం డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్న 'ఫౌజీ'. ప్రభాస్ లైనప్ లో ఈ రెండు చిత్రాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. అయితే ఇప్పటి వరకు ఉన్న సమాచారం వరకు రాజా సాబ్ చిత్రాన్ని మొదట రిలీజ్ చేయబోతున్నారని, ఆ తర్వాత ఫౌజీ సినిమా థియేటర్లలోకి వస్తుందని. అయితే తాజాగా మరో షాకింగ్ గాసిప్ అయితే ఫిల్మ్ సర్కిల్స్ లో, సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

ప్రభాస్ తీసుకున్న నిర్ణయం వాస్తవమేనా..
డార్లింగ్ ప్రభాస్ సినిమాల కోసం అభిమానులే కాదు దేశ వ్యాప్తంగా నార్మల్ ఆడియెన్స్ కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే ఈ క్రమంలో ప్రభాస్ తన రాబోయే చిత్రాల విడుదల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. అదేంటో కాదు.. రాజా సాబ్ సినిమా ముందుగా రిలీజ్ కావాల్సి ఉండగా.. దాన్ని పోస్ట్ పోన్ చేసి, ముందుగా ఫౌజీ సినిమాను విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారంట. దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన అయితే లేదు. కానీ సోషల్ మీడియాలో స్ట్రాంగ్ గాసిప్ మాత్రం క్రియేట్ అయ్యింది. దీనిపై రెండు టీమ్స్ స్పందిస్తే గానీ స్పష్టత వచ్చే అవకాశం లేదు.
రాజా సాబ్, ఫౌజీ షూటింగ్ వివరాలు..
మారుతీ దర్శకత్వంలోని రాజా సాబ్ సినిమా షూటింగ్ ను ఇప్పటికే పూర్తి చేసినట్టు డైరెక్టర్ చెప్పారు. కేవలం సాంగ్స్ మాత్రం షూట్ చేయాల్సి ఉందని పలు సందర్భాల్లో అనాధికారికంగా వెల్లడంచారు టీమ్. కాగా ప్రస్తుతం ప్రభాస్ ఫౌజీ షూటింగ్ కు హాజరవుతున్నారని, ఆ మూవీలోని యాక్షన్ సీక్వెన్స్ ను పూర్తి చేసేందుకు టైమ్ ఇచ్చారని తెలుస్తోంది. అయితే కొద్ది రోజులుగా రాజా సాబ్ టీమ్ నుంచి ఎలాంటి అప్డేట్ రాకపోవడం, ఇంకా సాంగ్స్ షూట్ ప్రారంభం కాకపోవడంతో ఈ బజ్ క్రియేట్ అయ్యి ఉంటుందని అంటున్నారు. మన్ముందు దీనిపైన క్లారిటీ రావాల్సి ఉంది.
ప్రభాస్ నుంచి నెక్ట్స్ అప్డేట్..
ప్రభాస్ - మారుతీ దర్శకత్వంలోని రాజా సాబ్ చిత్రం నుంచి నెక్ట్స్ అప్డేట్ రానుందని తెలుస్తోంది. టీజర్ రిలీజ్ కు అన్ని ఏర్పాట్లు జరిగాయని అంటున్నారు. త్వరలోనే అప్డేట్ ఇవ్వబోతున్నారని, కొంచెం భారీ స్థాయిలో టీజర్ ను విడుదల చేయబోతున్నారని తెలుస్తోంది. రాజా సాబ్, ఫౌజీ షూటింగ్ పార్ట్స్ పూర్తి చేసుకుని అక్టోబర్ నుంచి సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలోని స్పిరిట్ చిత్రానికి వర్క్ చేయబోతున్నారని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











