3 గురు హీరోయిన్స్‌తో ప్రభాస్ రొమాన్స్.. పండగ పూట కూడా కెప్టెన్ వదలడటం లేదట?
రానున్న రోజుల్లో తెలుగు సినిమా నుంచి రాబోతున్న పలు భారీ చిత్రాల్లో దాదాపు మన తెలుగు నుంచి ఉన్న టాప్ మోస్ట్ స్టార్స్ నుంచి వచ్చే అన్ని సినిమాలు కూడా ఉండబోతున్నాయి అని చెప్పాలి. కాగా ఈ చిత్రాల్లో హీరో రెబల్ స్టార్ ప్రభాస్ నుంచి ప్రతీ సినిమా కూడా ఒక పాన్ ఇండియా సినిమానే అని చెప్పొచ్చు. మిగతా హీరోలు ఒకటి రెండు సినిమాలు పాన్ ఇండియా లెవెల్లో డౌటే అని చెప్పొచ్చు కానీ ప్రభాస్ నుంచి వచ్చే ప్రతి సినిమా ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లోనే రానున్నాయి.
అయితే ఇప్పుడు చేస్తున్న ప్రభాస్ అన్ని సినిమాల్లో కూడా లీస్ట్ హైప్ ఉన్న పాన్ ఇండియా సినిమా ఏదన్నా ఉంది అంటే అది దర్శకుడు మారుతీతో చేస్తున్న భారీ చిత్రం "ది రాజా సాబ్" కూడా ఒకటి. కాగా ఈ చిత్రం ఏకంగా 400 కోట్ల మేర బడ్జెట్ తో తెరకెక్కుతుండగా ఈ సినిమాలో ప్రభాస్ మొట్ట మొదటిసారిగా ఒకరు కాదు ఇద్దరు కాదు ముచ్చటగా ముగ్గురు హీరోయిన్స్ గా చేస్తున్నారు.

కాగా వారిలో ఇద్దరు మొదటిసారి ప్రభాస్ తో నటిస్తుండగా ఓ హీరోయిన్ ఆల్రెడీ నటించింది మరో హీరోయిన్ అయితే టాలీవుడ్ లో ఈ సినిమా తోనే పరిచయం అవుతుంది. కాగా ఆ హీరోయిన్స్ ఎవరో కాదు కోలీవుడ్ బోల్డ్ హీరోయిన్ మాళవిక మోహనన్.. అలాగే మరో హాట్ బ్యూటీ నిధి అగర్వాల్, అలాగే రిద్ధి కుమార్ లు నటిస్తున్నారు. వీరిలో మాళవిక ఈ సినిమా తోనే తెలుగు ఎంట్రీ ఇస్తుండగా నిధి అగర్వాల్ ప్రభాస్ తో మొదటిసారి యాక్ట్ చేస్తుంది.
అలాగే రిద్ధి కుమార్ ప్రభాస్ తో "రాధే శ్యామ్" సినిమా తర్వాత ఈ సినిమాకి చేస్తుంది. కాగా ఇప్పుడు ప్రభాస్ ఈ ముగ్గురుతో కలిసి సినిమాలో ఒక ఇంట్రెస్టింగ్ సీక్వెన్స్ ని ప్రభాస్ చేస్తున్నాడట. మరి ఇందులో రిద్ధి కుమార్ రోల్ ఏమో కానీ ఆ మిగతా ఇద్దరితో మాత్రం డార్లింగ్ రొమాన్స్ చేయడం ఖాయం అన్నట్టు వినిపిస్తుంది. అలాగే ప్రభాస్ కి ముగ్గురుకి మధ్య సీన్స్ ని పండగలు పబ్బాలు అని తేడా లేకుండా దర్శకుడు మారుతీ తెరకెక్కిస్తున్నాడట.

వినాయక చవితికి కూడా తమ కెప్టెన్ ఆఫ్ షిప్ మారుతీ వదల్లేదట. పండుగ నాడు కూడా చిత్ర యూనిట్ కి ఎలాంటి హాలిడే లేకుండానే మారుతీ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నాడట. మరి పండుగతో కూడా షూట్ చేస్తున్నారంటే ఆ సీన్స్ ఎంత కీలకమో అర్ధం చేసుకోవచ్చు. ఇక ఈ భారీ సినిమాలో బాలీవుడ్ స్టార్ నటుడు సంజయ్ దత్ కీలక పాత్రలో నటిస్తుండగా ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు.
అలాగే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణ సంస్థపై నిర్మాత టిజి విశ్వప్రసాద్ నిర్మాణం వహిస్తున్నారు. అలాగే వచ్చే ఏడాది ఏప్రిల్ 10న పాన్ ఇండియా భాషల్లో రిలీజ్ కాబోతుంది. కాగా ఈ చిత్రాన్ని దర్శకుడు మారుతీ హారర్, రొమాంటిక్ థ్రిల్లర్ గా అయితే తెరకెక్కిస్తున్నారు


Click it and Unblock the Notifications











