twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ప్రబాస్ ని ఇక ముందు హీరోగా చూడలేమా!

    By Sindhu
    |

    టాలీవుడ్ లో నాగార్జున తర్వాత అమ్మాయిల ఆదరణను ఆ రేంజ్ లో పొందిన మ్యాన్లీ హీరో ప్రభాసే. అయితే నిన్నమొన్నటివరకూ సినిమా సినిమాకీ గ్లామర్ పెంచుకుంటూ వచ్చిన ప్రభాస్ ఈ మద్య బాగా డల్ అయిపోతున్నాడు. ముఖంలో ముందున్న అందం కనిపించకుండా పోయింది. మనిషిలోనూ ముందున్న హుషారు బాగా తగ్గిపోయింది. దీనికి కారణం ఏమిటా అని ఆరా తీస్తే...

    కొన్ని రోజుల క్రితం తన తండ్రిని దూరం చేసుకున్న ప్రభాస్ ఆ బాధతో ఎక్కువగా డ్రింక్ చేస్తున్నారన్నది ఇండస్ట్రీలో టాక్ అయితే 'లేట్ నైట్స్ వరకూ పబ్బుల్లో గడిపి ఉబ్బిపోయిన కళ్ళతో షూటింగ్ కి వస్తున్నాడనే దర్శకుల ఆరోపణ ముందునుంచీ వున్నదే అని, సూర్యనారాయణ రాజే తన కొడుకుని కంట్రోల్ చూస్తూ వచ్చారనీ, ఇప్పుడు పార్టీల్లో మునిగిపోతున్నాడనీ" మరోవైపు వినిపిస్తోంది.'డార్లింగ్ లోనే డల్ గా వున్నాడనుకుంటే రీసెంట్ గా 'గోలీమార్" ఆడియో ఫంక్షన్ లో మరింత బ్యాడ్ లుక్ తో కనిపించి ఫ్యాన్స్ ని టెన్షన్ లోకి నెట్టేశారు ప్రభాస్.

    ఇలాగే కంటిన్యూ అయి తన గ్లామర్ మొత్తం పోగొట్టేసుకుంటే ఇప్పుడున్న కాంపిటీషన్ లో ఇక ప్రభాస్ హీరోగా సస్టెయిన్ అవడం కష్టమని కంగారుపడుతున్నారు ఈ డార్లింగ్ సన్నిహితులు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X