twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ప్రభాస్ జాన్.. ఆ ఒక్క సెట్ కోసమే ఎంత ఖర్చుపెట్టారో తెలుసా?

    |

    తెలుగు చిత్రసీమలో భారీ బడ్జెట్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్స్ అయ్యారు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. 'బాహుబలి'తో వరల్డ్ స్టార్ కావడంతో ఆయన రేంజ్ బాగా పెరిగిపోయింది. దీంతో ప్రభాస్‌తో భారీ సినిమాలు రూపొందించేందుకు ఆసక్తి చూపుతున్నారు మేకర్స్. ఈ నేపథ్యంలోనే ఇటీవలే వచ్చిన 'సాహో'కి భారీగా ఖర్చు చేసి హాలీవుడ్ స్థాయి సినిమా రూపొందించారు కానీ ఆశించిన ఫలితం రాలేదు.

    అయినప్పటికీ ఆయన తాజా సినిమా విషయంలో అస్సలు వెనక్కితగ్గడం లేదు నిర్మాతలు. రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రభాస్ లెటెస్ట్ మూవీ జాన్ (వర్కింగ్ టైటిల్) శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌ వేసిన భారీ సెట్‌లో జరుగుతోంది. ఈ ఒక్క సెట్ కోసమే ఏకంగా 3 కోట్ల వరకు ఖర్చు చేశారట మేకర్స్.

    Prabhas Latest Movie Shooting Update: Spending Huge Money

    యూరప్ నేపథ్యంలో ఈ కథ రూపొందుతున్న కారణంగా కొన్ని సన్నివేశాలను యూరప్ వెళ్లి చిత్రీకరించారు మేకర్స్. ఇక ఇప్పుడు అదే నేపథ్యంతో కూడిన మరికొన్ని సన్నివేశాలను చిత్రీకరించడానికి యూరప్ వీధుల సెట్ హైదరాబాద్ లోనే వేసేశారు. ఆ ఫీల్‌ను తీసుకురావడానికి భారీ స్థాయిలో ప్రత్యేకంగా ఈ సెట్ డిజైన్ చేశారట.

    ఇక్కడ షూటింగ్ పూర్తి కాగానే తదుపరి షెడ్యూల్ కోసం ఆస్ట్రియా వెళ్లనుంది చిత్రయూనిట్. ఇంకా టైటిల్ కూడా ఫిక్స్ కాకుండానే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొనడం విశేషం.

    English summary
    Prabhas recent release Saaho, directed by Sujeeth, failed to live up to everyone's expectation. After Saaho, the actor is now concentrating on his upcoming film titled Jaan. For this movie producers spending huze amount for sets.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X