Don't Miss!
- Finance Cerelac News: పేదదేశాల సెరెలాక్ ఉత్పత్తులో పంచదార..!! FSSAIకి నోటీసులు జారీ..
- Technology గూగుల్ మ్యాప్స్ కొత్త ఫీచర్ గురించి తెలుసా.. రోడ్ ట్రిప్ సహా ప్రయాణాల్లో ఆందోళన ఉండదిక...!
- Sports చెన్నై సూపర్ కింగ్స్‌లో భారీ మార్పులు..!!
- News పవన్ కల్యాణ్ దూకుడు - తాజా నిర్ణయంతో..!!
- Automobiles కేవలం రూ. 8,999లకే డ్యాష్‌క్యామ్.. ఈ BIS కెమెరా కార్లకు పెట్టుకుంటే చాలు!!
- Lifestyle గుడ్‌నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
ప్రభాస్ జాన్.. ఆ ఒక్క సెట్ కోసమే ఎంత ఖర్చుపెట్టారో తెలుసా?
తెలుగు చిత్రసీమలో భారీ బడ్జెట్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్స్ అయ్యారు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. 'బాహుబలి'తో వరల్డ్ స్టార్ కావడంతో ఆయన రేంజ్ బాగా పెరిగిపోయింది. దీంతో ప్రభాస్‌తో భారీ సినిమాలు రూపొందించేందుకు ఆసక్తి చూపుతున్నారు మేకర్స్. ఈ నేపథ్యంలోనే ఇటీవలే వచ్చిన 'సాహో'కి భారీగా ఖర్చు చేసి హాలీవుడ్ స్థాయి సినిమా రూపొందించారు కానీ ఆశించిన ఫలితం రాలేదు.
అయినప్పటికీ ఆయన తాజా సినిమా విషయంలో అస్సలు వెనక్కితగ్గడం లేదు నిర్మాతలు. రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రభాస్ లెటెస్ట్ మూవీ జాన్ (వర్కింగ్ టైటిల్) శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ వేసిన భారీ సెట్లో జరుగుతోంది. ఈ ఒక్క సెట్ కోసమే ఏకంగా 3 కోట్ల వరకు ఖర్చు చేశారట మేకర్స్.
యూరప్ నేపథ్యంలో ఈ కథ రూపొందుతున్న కారణంగా కొన్ని సన్నివేశాలను యూరప్ వెళ్లి చిత్రీకరించారు మేకర్స్. ఇక ఇప్పుడు అదే నేపథ్యంతో కూడిన మరికొన్ని సన్నివేశాలను చిత్రీకరించడానికి యూరప్ వీధుల సెట్ హైదరాబాద్ లోనే వేసేశారు. ఆ ఫీల్‌ను తీసుకురావడానికి భారీ స్థాయిలో ప్రత్యేకంగా ఈ సెట్ డిజైన్ చేశారట.
ఇక్కడ షూటింగ్ పూర్తి కాగానే తదుపరి షెడ్యూల్ కోసం ఆస్ట్రియా వెళ్లనుంది చిత్రయూనిట్. ఇంకా టైటిల్ కూడా ఫిక్స్ కాకుండానే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొనడం విశేషం.