మరోసారి ప్రభాస్ పెళ్లి న్యూస్ హాట్ టాపిక్.... అక్టోబర్ 23న నిజమేనా?

బాహుబలి స్టార్ ప్రభాస్ మరో నెల రోజుల్లో 38వ వసంతంలోకి అడుగు పెట్టబోతున్నారు. ఈ నేపథ్యంలో మరోసారి ప్రభాస్ పెళ్లి వార్తలు తెరపైకి వచ్చాయి. ఈసారి యంగ్ రెబల్ స్టార్ నుండి సర్‌ప్రైజింగ్ న్యూస్ వింటామని అభిమానులు ఆశ పడుతున్నారు.

ప్రస్తుతం ప్రభాస్ 'సాహో' చిత్రంలో నటిస్తున్న నేపథ్యంలో ఆయన పుట్టినరోజైన అక్టోబర్ 23న ఈ సినిమాకు సంబంధించి స్పెషల్ టీజర్, ట్రైలర్ లాంటివి అభిమానులు ఆశించడం సర్వసాధారణమే. అయితే ఫ్యాన్స్ ఈ సారి అంతకు మించిన సర్‌ప్రైజ్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు.

అక్టోబర్ 23న నిజమేనా?

అక్టోబర్ 23న నిజమేనా?

మరో వైపు ప్రభాస్ ఫ్యామిలీ కూడా.... కొన్ని రోజులుగా ఈ బాహుబలికి తగిన జోడీని వెతికే పనిలో బిజీగా ఉన్నారు. ప్రభాస్ పెళ్లి గురించిన రూమర్స్‌కు తెరదించాలని వారు కూడా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ప్రభాస్ పెళ్లి వార్త అతి త్వరలోనే ఆయన పెదనాన్న కృష్ణం రాజు ద్వారా బ్రేక్ చేయబోతున్నారని, అది కూడా ప్రభాస్ పుట్టినరోజైన అక్టోబర్ 23న జరిగే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.

Recommended Video

Prabhas Tweets About His Next Project
గతంలో ప్రభాస్-అనుష్క మీద రూమర్స్

గతంలో ప్రభాస్-అనుష్క మీద రూమర్స్

గతంలో ప్రభాస్, అనుష్క శెట్టి పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు ప్రచారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ విషయాన్ని ఇద్దరు స్టార్స్ ఖండించారు. తమ మధ్య కేవలం స్నేహం మాత్రమే ఉందని అంతకు మించి మరే రిలేషన్ లేదని స్పష్టం చేశారు.

వారికి మనసులో ఆశ ఉన్నప్పటికీ...

వారికి మనసులో ఆశ ఉన్నప్పటికీ...

గతంలో అనుష్క తల్లి మీడియాతో మాట్లాడుతూ.... ప్రభాస్ లాంటి వ్యక్తి తమ కూతురుకు భర్తగా దొరకాలని తాము కూడా కోరుకుంటున్నామని, అయితే వారి మధ్య అలాంటి ఉద్దేశ్యం లేనపుడు దీని గురించి మాట్లాడం అనవసరం అని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.

ఫ్యాన్స్ ఆందోళన అదే...

ఫ్యాన్స్ ఆందోళన అదే...

ప్రభాస్ పెళ్లి గురించి అభిమానులు ఇంతలా ఆందోళన చెందడానికి కారణం ప్రభాస్ వయసే. యంగ్ రెబల్ స్టార్ 40కి దగ్గరవుతున్న కొద్దీ వారిలో టెన్షన్ పెరుగుతోంది. 40 లోపే తమ అభిమాన హీరో పెళ్లి జరిగిపోవాలని వారు ఆశ పడుతున్నారు. మరి ఈ పుట్టినరోజునైనా ప్రభాస్ తన పెళ్లి విషయంలో అభిమానుల్లో నెలకొన్ని టెన్షన్ దించేస్తారో లేదో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X