ప్రభాస్ పెళ్లాడే అమ్మాయి ఎక్కడుందో తెలుసా?

By Bojja Kumar

హైదరాబాద్: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పెళ్లి గురించి కృష్ణం రాజు ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. బాహుబలి సినిమా పూర్తయిన తర్వాత ప్రభాస్ పెళ్లి చేస్తామని తెలిపారు. అయితే ఇంకా అమ్మాయిని చూడటం ప్రారంభించలేదని స్పష్టం చేసారు కృష్ణం రాజు. అయితే ప్రభాస్ సన్నిహిత వర్గాల నుంచి ఓ ఆ సక్తికర విషయం వినిపిస్తోంది.

ఉప్పలపాటి ఫ్యామిలీ భీమవరంలో ఓ అమ్మాయిని...ప్రభాస్ కోసం అనుకుంటున్నారని, అయితే ఇంకా ఖరారు కాక పోవడం వల్ల బయటకు చెప్పడం లేదని తెలుస్తోంది. ఇరు కుటుంబాల మధ్య చర్చల అనంతరం ఈ విషయం అధికారికంగా వెల్లడయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం 34 సంవత్సరాల ప్రభాస్....వీలైనంత త్వరగా ఓ ఇంటి వాడు కావాలని ఉబలాటపడుతున్నాడు. తన కెరీర్‌ను మలుపు తిప్పే 'బాహుబలి' సినిమా కారణంగా పెళ్లి వాయిదా వేసుకున్నాడు. ఈ సినిమా పూర్తయిన తర్వాత ప్రభాస్ వివాహం సాంప్రదాయ బద్దంగా వెరీ వెరీ గ్రాండ్‌గా జరుగనుంది.

బాహుబలి సినిమా వివరాల్లోకి వెళితే....ప్రభాస్, అనుష్క, రాణా, తమన్నా ప్రధాన పాత్రల్లో రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్‌ చిత్రం 'బాహుబలి'. ఆర్కా మీడియా వర్క్స్‌ పతాకంపై శోభు యార్లగడ్డ, ప్రసాద్‌ దేవినేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీ సమీపంలో భారీ యుద్ధ సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. దర్శకుడు రాజమౌళి భారతీయ సినిమా చరిత్రలో ఇప్పటి వరకు ఏ సినిమాలోనూ చేయని విధంగా 'బాహుబలి' యుద్ధ సన్నివేశాలు చిత్రీకరించడానికి ప్లాన్ చేస్తున్నారు. ప్రధాన తారాగణంతో పాటు దాదాపు 2000 మంది జూనియర్ ఆర్టిస్టులతో ఈ యుద్ధ సన్నివేశాలు చిత్రీకరించేందుకు ప్లాన్ చేసారు.

భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈచిత్రం భారతీయ సినీ చరిత్రలోనే మునుపెన్నడూ లేని విధంగా అద్భుతమైన సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి తెరకెక్కిస్తున్నాడు రాజమౌళి. ఇప్పటికే 'ఈగ' చిత్రంతో రాజమౌళి ఖ్యాతి అంతర్జాతీయంగా పాపులర్ అయింది. ఈ చిత్రం ఆయనకు మరింత పాపులారిటీ తెస్తుందని భావిస్తున్నారు ఇండస్ట్రీ వర్గాలు. ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు 2015లో వచ్చే అవకాశం ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X