మెగా డాటర్‌తో ప్రభాస్ పెళ్లి.. మీడియాలో రూమర్ వైరల్
Recommended Video

సినీ పరిశ్రమలో హీరో హీరోయిన్లపై చాలా రూమర్లు ఎందుకు పుడుతాయో.. ఎక్కడ నుంచి పుడుతాయో ఓ పట్టాన అర్థం కావు. కానీ అలాంటి రూమర్లు చాలా గందరగోళానికి గురిచేస్తాయి. తెలుగు సినీ పరిశ్రమలో మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ ప్రభాస్ పెళ్లి వార్త ఇప్పుడు ప్రాధాన్యం సంతరించుకొన్నది. ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు ప్రభాస్ జాతకాల ప్రస్తావన తేవడంతో పెళ్లి వార్తలు జోరందుకున్నాయి. ఈ నేపథ్యంలో ఆసక్తికరమైన, నిరాధార వార్త ప్రచారంలో ఉంది. అదేమిటంటే..

అనుష్కతో ప్రభాస్ అఫైర్
గతంలో ప్రభాస్, అనుష్కల మధ్య అఫైర్ ఉందని, వారు పెళ్లి కూడా చేసుకొంటారని వార్తలు రూమర్లు తెగ షికారు చేశాయి. ఇదిలా ఉండగా, మెగా డాటర్‌తో పెళ్లి జరుగనుందని వార్తలు వచ్చాయి. కానీ ఆ వార్తలన్ని అబద్దాలేనని తేలిపోయాయి.

బాహుబలి తర్వాతనే పెళ్లి
ప్రభాస్ వద్ద పెళ్లి ప్రస్తావన తెచ్చినప్పుడు బాహుబలి తర్వాత చేసుకొంటానని చెప్పేవారట. బాహుబలి సినిమా పూర్తయి సుమారు ఏడాది కావోస్తున్నది. అయినా పెళ్లిపై అంతగా ప్రభాస్ చూపడం లేదనేది ఇండస్ట్రీలో టాక్. ప్రస్తుతం సాహో చిత్రంలో ప్రభాస్ బిజీగా ఉన్నారు.

మెగా డాటర్‌తో పెళ్లి రూమర్
తాజాగా ప్రభాస్, మెగా డాటర్‌తో పెళ్లి జరుగుబోతున్నదనే ఓ నిరాధారమైన వార్త మీడియాలో, యూట్యూబ్ చానెళ్లలో ప్రచారమవుతున్నది. అయితే ప్రభాస్ పెళ్లి గురించి పెదనాన్న కృష్ణంరాజుతో మెగా కుటుంబ సభ్యులు మాట్లాడారనేది ఆ రూమర్ సారాంశం.

భీమవరం అమ్మాయితో..
అందులో ఎలాంటి నిజం లేదని అనిపిస్తున్నది. మరో వార్త కూడా ప్రచారంలోకి వచ్చింది. భీమవరం పట్టణానికి చెందిన ఓ అమ్మాయితో ప్రభాస్ పెళ్లి కుదిరే అవకాశం ఉంది. జాతకాలు చూస్తన్నారు. ఒకవేళ జాతకాలు కుదిరితే పెళ్లి జరుగుతుంది అని కృష్ణంరాజు చెప్పడాన్ని బట్టి ప్రభాస్ పెళ్లి ఎంతో దూరం లేదు అనిపిస్తున్నది.

సాహోకు ముందా.. తర్వాత
ప్రస్తుతం ప్రభాస్ సాహో చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతున్నది. వచ్చే ఏడాది చివర్లో ఆ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్నది. ప్రభాస్ పెళ్లి సాహో తర్వాత జరుగుతుందా? లేదా అంతకుముందే జరుగుతుందా అనే ప్రశ్నలకు కొద్దిరోజులు ఆగితే సమాధానం దొరకడానికి అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











