»   » ఇంజనీరింగ్ అమ్మాయితో ప్రభాస్ పెళ్లి?

ఇంజనీరింగ్ అమ్మాయితో ప్రభాస్ పెళ్లి?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్లలో ప్రభాస్ ఒకరు. 35 సంవత్సరాల వయసొచ్చినా ప్రభాస్‌ ఇంకా పెళ్లి పెటాకులు లేకుండా తన సినిమా కెరీర్ మీదనే దృష్టి సారించాడు. ఇంట్లో వాళ్లు ఆయనుకు పెళ్లి చేయాలని ప్రయత్నాలు మొదలు పెట్టినప్పటికీ ప్రభాస్ తనకు పెళ్లి కంటే కెరీరే ముఖ్యం అంటూ మొండిగా పోతున్నాడు.

ఇట్టా అయితే ప్రభాస్ పెళ్లి చేయడం కష్టం అని భావించిన ఆయన కుటుంబ సభ్యులు.... ప్రభాస్ వద్దంటున్నా పెళ్లి ప్రయత్నాలు మొదలెట్టేసారు. ఆ మధ్య ప్రభాస్ కు భీమవరంలో ఓ సంబంధం చూసినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ప్రభాస్ మాత్రం అలాంటిదేమీ లేదని కొట్టిపారేసారు.


 Prabhas to marry an engineering girl?

అయితే ప్రభాస్ కావాలనే మీడియాతో అబద్ధం చెప్పారని తెలుస్తోంది. తన పెళ్లి విషయం నుండి మీడియా దృష్టి మళ్లించడానికే అతను అలా చేసాడని అంటున్నారు. వాస్తవానికి భీమవరం అమ్మాయిని రెబల్ స్టార్ ఫ్యామిలీ ఫిక్స్ చేసారని, అమ్మాయి నచ్చడంతో ప్రభాస్ కూడా ఓకే చెప్పినట్లు సమాచారం. అయితే ఇప్పుడే ఆ విషయం బయటకు పొక్కితే అందరూ ‘బాహుబలి' గురించి మాట్లాడటం మానేసి తన పెళ్లి గురించి మాట్లాడతారనే కారణంగానే ఆ విషయాన్ని గోప్యంగా ఉంచుతున్నారట.


ప్రభాస్ పెళ్లాడబోయే భీమవరం అమ్మాయి ఇంజనీరింగ్ చదువుకున్నట్లు తెలుస్తోంది. అయితే ‘బాహుబలి' పార్ట్ 2 పూర్తయ్యే వరకు తన పెళ్లి విషయాలు బయటకు పొక్కనీయవద్దని, మీడియా వారు అనవసర హంగా సృష్టిస్తారని, ఆ ఎఫెక్ట్ ‘బాహుబలి' పార్ట్2 మీద పడకుండా ఉండేందుకే ప్రభాస్ పెళ్లి విషయం రహస్యంగా ఉంచుతున్నారని సమాచారం.

English summary
According to the reliable sources, it is heard that Rebel star family have already selected one girl. Sources reveal that Prabhas is going to marry a Bhimavaram girl, who is pursuing her engineering.
Please Wait while comments are loading...