‘రాజా సాబ్’ టీజర్.. ఇండియాను షేక్ చేయబోయే ప్లాన్.. అదేంటంటే?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం తన అప్ కమింగ్ చిత్రాలతో ఫుల్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. 'బాహుబలి' చిత్రాల తర్వాత డార్లింగ్ రేంజ్ ఏ స్థాయికి చేరుకుందో తెలిసిందే. తన లైనప్ కూడా భారీ స్కేల్లో ఉంది. టాప్ డైరెక్టర్లు డార్లింగ్ తో సినిమా చేయడానికి ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈక్రమంలో ప్రభాస్ మాత్రం తను ఇప్పటికే సైన్ చేసిన ప్రాజెక్ట్స్ ను ఒక్కొక్కటిగా పూర్తి చేసుకుంటూ వస్తున్నారు. నెక్ట్స్ టాలీవుడ్ సక్సెస్ ఫుల్ దర్శకుడు మారుతీ దర్శకత్వంలో నటించిన 'ది రాజా సాబ్' చిత్రంతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నాడు డార్లింగ్.

భారీ యాక్షన్ చిత్రాలతో ఫుల్ బిజీగా ఉంటున్న ప్రభాస్ తన అభిమానుల కోసం ఒక డిఫరెంట్ అటెంప్ట్ చేస్తున్నారు. రోటీన్ కు భిన్నంగా ఈసారి ఫుల్ కామెడీ హారర్ర్ జోనర్ తో అలరించబోతున్నారు. ఆ సినిమానే 'ది రాజా సాబ్' కావడం విశేషం. అగ్ర నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా రూ.300 కోట్లకు పైగా బడ్జెట్ వెచ్చించి నిర్మిస్తోంది. ఇప్పటికే సినిమాకు సంబంధించిన షూటింగ్ పార్ట్ కంప్లీట్ అయ్యిందని తెలుస్తోంది. ప్రస్తుతం టీమ్ మొత్తం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఫుల్ బిజీగా ఉన్నారు.

Prabhas Maruthi Raja Saab Movie Teaser will Release

కాగా చివరిగా ప్రభాస్ 'సలార్', 'కల్కి 2898 ఏడీ' చిత్రాలతో అలరించారు. ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ పొందడంతో పాటు బాక్సాఫీస్ వద్ద కూడా విధ్వంసం సృష్టించారు. ఇక నెక్ట్స్ 'ది రాజా సాబ్' చిత్రం విడుదల కావాల్సి ఉంది. ఇప్పటికే ఈ చిత్రం ఏప్రిల్ 10న విడుదల చేసేందుకు మేకర్స్ షెడ్యూల్ చేశారు. కానీ పోస్ట్ ప్రొడక్షన్ పనుల కారణంగా డిలే అవుతోంది. ఈ ఏడాది దసరా వరకు థియేటర్లలోకి రానుందని టాక్ వినిపిస్తోంది. వీలైంతే ఇంకా ముందే ఆడియెన్స్ ను అలరించబోతుందని సినీ పండితులు అంటున్నారు.

అయితే తాజాగా ది రాజా సాబ్ చిత్రం గురించి ఆసక్తికరమైన విషయం తెలిసింది. మే 1న లేదంటే మే 2వ వారంలో రాజా సాబ్ టీజర్ ను విడుదల చేసేందుకు టీమ్ సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈమేరకు ఫిల్మ్ సర్కిల్స్ లో గట్టిగా బజ్ క్రియేట్ అయ్యింది. ఇప్పుడు ఆ టీజర్ పై పెద్ద చర్చ నడుస్తోంది. రాజా సాబ్ చిత్రం టీజర్ కోసం స్పెషల్ వీఎఫ్ఎక్స్ టీమ్ పని చేస్తుందంట. హారర్ర్ జోనర్ లో ఇప్పటి వరకు ఇండియా వ్యాప్తంగా వచ్చిన చిత్రాలతో పోల్చితే రాజా సాబ్ వీఎఫ్ఎక్స్ నెక్ట్స్ లెవల్లో ఉంటుందని అంటున్నారు. ఇండియాన సినిమా హిస్టరీలోనే ఈ మూవీ వీఎఫ్ఎక్స్ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంటుందని అంటున్నారు.

దీంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఏదేమైనా ఈ టీజర్ కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. మరో వారం రోజుల్లో బిగ్ అప్డేట్ వస్తుందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రంలో ప్రభాస్ డ్యూయేల్ రోల్ లో నటిస్తున్నారు. తన పూర్వీకుల ఆస్తి కోసం పోరాడే ఒక యువకుడి కథలో ప్రభాస్ నటించారు. మాళవికా మోహనన్, నిధి అగర్వాల్ హీరోయిన్లు గా నటించారు. వరలక్ష్మి శరత్ కుమార్, అనుపమ్ ఖేర్, మురళీ శర్మ, వెన్నెల కిషోర్, యోగి బాబు కీలక పాత్రల్లో అలరించనున్నారు. లేడీ సూపర్ స్టార్ నయనతార స్పెషల్ సాంగ్ తో ఆకట్టుకోబోతోంది.

More from Filmibeat

Read more about: prabhas raja saab tollywood
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X