Prabhas మారుతి సినిమా.. చర్చల్లోకి మరో క్రేజీ టైటిల్.. అదే ఎందుకంటే?
డార్లింగ్ ప్రభాస్ నటించిన ఆదిపురుష్ మూవీ జూన్ 16న ప్రేక్షకుల ముందుకి వచ్చి డివైడ్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమా కలెక్షన్స్ కూడా చాలా వరకు క్లోజ్ అయినట్లు కనిపిస్తోంది. థియేటర్స్ అన్ని మేగ్జిమమ్ ఖాళీ అయిపోయాయి. అయితే డార్లింగ్ ఫ్యాన్స్ అందరూ ఇప్పుడు ఆదిపురుష్ ని మరిచిపోయారు. ప్రభాస్ నుంచి రాబోయే కొత్త ప్రాజెక్ట్స్ పై పడింది.
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సలార్ మూవీ టీజర్ రిలీజ్ కి రంగం సిద్ధమైంది. జులైలో ఫస్ట్ టీజర్ రానున్నట్లు టాక్ వినిపిస్తోంది. మరో వైపు ప్రాజెక్ట్ K ప్రేస్టేజియస్ మూవీగా రెడీ అవుతోంది. రీసెంట్ గా ఈ సినిమాలో కమల్ హాసన్ నటిస్తున్నట్లు ఎనౌన్స్ చేశారు. ఆగష్టు నుంచి ఆయన షూటింగ్ లో పాల్గొంటారంట. ఈ రెండు చిత్రాలపై డార్లింగ్ ఫ్యాన్స్ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు.

ఎటొచ్చి మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమాకి సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్ రాలేదు. ఏవో కొన్ని లీక్ ఫోటోలు బయటకొచ్చిన వాటి వలన సినిమా కంటెంట్ ఏంటనేది క్లారిటీ రావడం లేదు. ఈ నేపథ్యంలో మారుతి నుంచి మూవీ అప్డేట్స్ ఫ్యాన్స్ అడుగుతున్నారు. అయితే ప్రస్తుతం ఈ సినిమాకి సంబందించిన ఇంటరెస్టింగ్ టాక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మూవీ కోసం రెండు పేర్లు చిత్ర యూనిట్ పరిశీలిస్తుందంట. అందులో రాజా డీలాక్స్ ఒకటిగా వినిపిస్తోంది. మొదటి నుంచి ఇదే టైటిల్ ప్రచారంలో ఉంది. అయితే ఫ్యాన్స్ ఈ టైటిల్ పై అంత సంతృప్తికరంగా లేరని ఇప్పటికే సోషల్ మీడియాలో కామెంట్స్ ద్వారా తెలుస్తోంది. ఇప్పుడు అంబాసిడర్ అనే మరో పేరు తెరపైకి వచ్చింది. మూవీలో అంబాసిడర్ కారు పాత్ర చాలా కీలకంగా ఉంటుందంట. ఈ కారణంగా సినిమాకి అదే పేరు ఖరారు చేస్తే బాగుంటుందని భావిస్తున్నారు. ప్రస్తుతానికి అయితే రాజా డీలాక్స్, అంబాసిడర్ టైటిల్స్ రెండు కూడా రిజిస్టర్ చేయించడం జరిగినట్లు టాక్ వినిపిస్తోంది. మరి వీటిలో ఏది ఫైనల్ చేస్తారనేది తెలియాల్సి ఉంది.


Click it and Unblock the Notifications











