తెరపై ఆ ఇద్దరు కనిపిస్తే!..: 'దందా'తో ప్రభాస్ దండయాత్ర?..
స్టార్ హీరోలకు సంబంధించి ఎప్పుడెప్పుడు కొత్త వార్త వినిపిస్తుందా? అన్న కుతూహలం అభిమానుల్లో సహజమే. గాసిప్స్ నుంచి మొదలై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చేదాకా.. పుకార్లతోనే టైమ్ పాస్ చేసేస్తారు. తాజాగా రెబల్ స్టార్ ప్రభాస్ 'దందా'కు సిద్దమవుతున్నాడనే సరికొత్త ఊహాగానం తెరపైకి వచ్చింది. ఆ విశేషాలేంటో చూద్దాం..

ఏంటీ దందా?:
ప్రభాస్ పెదనాన్న కృష్ణం రాజు దర్శకత్వంలో.. ఆయన సొంత బ్యానర్ అయిన గోపి కృష్ణ ప్రొడక్షన్ లో ఓ సినిమా రాబోతున్నట్లు సమాచారం. బిల్లా తర్వాత మళ్లీ ఆ బ్యానర్ లో నటించని ప్రభాస్.. ఇప్పుడీ సినిమాలో నటించనున్నారని టాక్. అంటే, కృష్ణం రాజు దర్శకత్వంలోనే ప్రభాస్ హీరోగా నటించనున్నారన్నమాట!.

కృష్ణం రాజు దర్శకత్వంలో:
ఇటీవల కృష్ణంరాజు ఫిలిం ఛాంబర్‌లో 'దందా' అనే టైటిల్ రిజిస్టర్ చేయించారు. ప్రభాస్‌ను డైరెక్ట్ చేసే సినిమా కోసమే కృష్ణం రాజు ఈ టైటిల్ రిజిస్టర్ చేయించారన్న టాక్ వినిపిస్తోంది. అధికారికంగా మాత్రం దీనికి సంబంధించి ఎటువంటి క్లారిటీ రాలేదు.

సాహో తర్వాత?:
ప్రస్తుతం యూవీ క్రియేషన్స్ నిర్మాణంలో సుజిత్ దర్శకత్వంలో ప్రభాస్ 'సాహో' చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత జిల్ చిత్ర దర్శకుడు రాధా కృష్ణతో సినిమా చేస్తాడని తెలుస్తోంది. 2018 చివరలో గానీ లేదా 2019లో గానీ ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లవచ్చు. ఈ సినిమా తర్వాత కృష్ణంరాజు-ప్రభాస్ సినిమా ఉంటుందని తెలుస్తోంది.

మరిన్ని 'క్యూ'లో పెట్టాలని:
సాహో తర్వాత రాధా కృష్ణతో సినిమా కమిట్ అయిన ప్రభాస్.. మరిన్ని చిత్రాలను 'క్యూ'లో పెట్టాలని చూస్తున్నాడట. ఇందుకోసం చాలానే కథలు వింటున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే పెద్దనాన్న కృష్ణం రాజుతోనూ సినిమా కమిట్ అవాలనుకుంటున్నాడట. కృష్ణం రాజు 'దందా' టైటిల్ రిజిస్టర్ చేయించడంతో ఆ ఊహాగానాలకు బలం చేకూరుతోంది.

తెరపై ఇద్దరూ కనిపిస్తే:
ప్రభాస్‌తో కృష్ణం రాజు చేయబోయే సినిమాలో ఆయన కూడా కీలక పాత్రలో కనిపిస్తారని టాక్. అదే నిజమైతే.. ఈ ఇద్దరు రెబల్ స్టార్స్ మధ్య ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ అద్భుతంగా ఉండొచ్చు. ఈ విషయం తెలిసి ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు. అధికారిక ప్రకటన వస్తే.. ఈ సినిమాపై ఇక భారీ అంచనాలు నెలకొనడం ఖాయం.


Click it and Unblock the Notifications











