అది ప్రభాస్ మూవీనే.. కానీ ఆ హీరోకు వదిలేసిన డార్లింగ్.. దెబ్బకు స్టార్ అయ్యాడుగా

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం బిగ్ ప్రాజెక్ట్స్ ల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. నిర్విరామంగా సినిమాలు చేస్తూనే ఉన్నారు. ఏమాత్రం ఖాళీ లేకుండా తను సైన్ చేసిన సినిమాలను పూర్తి చేసే పనిలో నిమగ్నమై ఉన్నారు. ప్రస్తుతం ప్రభాస్ లైనప్ లో ఎన్ని సినిమాలు ఉన్నాయో డార్లింగ్ కే తెలియని పరిస్థితి ఉంది. ఇండియాలోనే మోస్ట్ వాంటెడ్ హీరోగా ప్రభాస్ బిజీ అయ్యారు. ఆయన డేట్స్ కోసం ఓవైపు దర్శకులు, మరోవైపు నిర్మాతలు కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు.

ప్రభాస్ కెరీర్ ఎలా ప్రారంభమైంది..
తెలుగు చిత్ర పరిశ్రమలో రెబల్ స్టార్ గా కీర్తి పొందిన కృష్ణం రాజు నటవారసుడిగా, ఆయన అన్న కొడుకుగా ప్రభాస్ ఉప్పలపాటి టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. 2002లో ఈశ్వర్ చిత్రంతో తొలిసారిగా వెండితెరపై మన డార్లింగ్ ఆడియెన్స్ ను అలరించారు. తన ఒడ్డుపొడుగు, హ్యాండసమ్ లుక్, ఆకట్టుకునే డైలాగ్ డెలివరీతో తొలి సినిమాతోనే ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు. ఫిల్మ్ ఎడిటర్ కావాలని శిక్షణ పొందిన ప్రభాస్ నటుడిగా మారి ప్రస్తుతం ఇండియాలోనే బిగ్గెస్ట్ యాక్టర్స్ లిస్ట్ లో మొదటి వరుసలో నిలిచారు.

Prabhas missed blockbuster movie

ప్రభాస్ నుంచి గుర్తుండిపోయే సినిమాలు..
ప్రభాస్ కెరీయర్ లో ఇప్పటి వరకు 20కి పైగా సినిమాలు చేశారు. అందులో సగానికి పైగా సినిమాలు టాలీవుడ్ లో ఉత్తమ చిత్రాలుగా నిలిచాయి. అందులో మొదటి చిత్రం వర్షం. ఇది 2004లో విడుదలైంది. భారీ విజయాన్ని సాధించింది. ఈ చిత్రంతోనే ప్రభాస్ స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత 2005లో 'ఛత్రపతి' సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే సంచలనంగా మారాడు. బుజ్జిగాడు, బిల్లా, డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్, మిర్చి, బాహుబలి : ది బిగినింగ్, బాహుబలి 2 : ది కన క్లూజన్, సాహో, సలార్ : పార్ట్ 1 సీజ్ ఫైర్, కల్కి 2898 ఏడీ వంటి సినిమాల్లో నటించి బిగ్ స్టార్ గా ఎదిగిన సంగతి తెలిసిందే.

ప్రభాస్ మిస్ చేసుకున్న ఉత్తమ చిత్రమిదే..
2004లో ప్రభాస్ 'వర్షం' చిత్రంతో భారీ సక్సెస్ ను అందుకున్నారు. దాంతో వరుస సినిమా ఆఫర్ల వచ్చాయి. అడవి రాముడు, చక్రం, ఛత్రపతి, పౌర్ణమి వంటి సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో టాలీవుడ్ లో ఎవర్ గ్రీన్ ఫిల్మ్ గా నిలిచిన 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా' చిత్రం ఆఫర్ ను వదులుకున్నారు. ఈ సినిమా కథ మొదటి హీరోగా ఫ్రభాస్ నే అనుకున్నారంట. కానీ బిజీ షెడ్యూల్ కారణంగా డార్లింగ్ చేయలేకపోయారు. అయితే ఆ అవకాశం సిద్ధార్థకు వెళ్లింది. దీంతో 2005లో సిద్ధార్థ - త్రిష జంటగా నువ్వొస్తానంటే నేనొద్దంటానా చిత్రం విడుదలై భారీ సక్సెస్ ను అందుకుంది. ఈ సినిమాతోనే సిద్ధార్థ్ కు స్టార్ డమ్ వచ్చింది. ఈచిత్రం తర్వాత 'చుక్కల్లో చంద్రుడు', 'బొమ్మరిల్లు', 'కొంచెం ఇష్టం కొంచెం కష్టం', 'ఓయ్' వంటి బ్యూటీఫుల్ సినిమా అవకాశాలను అందుకున్నారు.

ప్రభాస్ నుంచి నెక్ట్స్ రాబోతున్న చిత్రాలివే..
మారుతీ దర్శకత్వం వహించిన 'రాజాసాబ్' త్వరలో విడుదల కానుంది. దసరా కానుకగా థియేటర్లలో విడుదలయ్యే ఛాన్స్ ఉందని సినీ ప్రముఖులు అంటున్నారు. మరోవైపు మే చివరి వారంలో టీజర్ కూడా రానుంది. ఆ తర్వాత ఫౌజీ విడుదల కానుంది. ఇక స్పిరిట్ 2027లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

More from Filmibeat

Read more about: prabhas siddharth tollywood
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X