ఆ సినిమా దెబ్బ.. భారీ ఆఫర్ చేజార్చుకున్న ప్రభాస్.. లేకుంటే రచ్చ రచ్చే!
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి తర్వాత ప్యాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. ఆయన చేస్తున్న అన్ని సినిమాలని ప్యాన్ ఇండియా లెవల్లో రిలీజ్ చేస్తున్నారు. చివరిగా సాహో సినిమా చేసిన ఆయన ప్రస్తుతం రాధేశ్యామ్ చేస్తున్నారు. ఈ సినిమా చివరి షెడ్యూల్ ఇంకా షూట్ చేయాల్సి ఉంది. అయితే తాజాగా ఆయన ఒప్పుకున్న ఒక సినిమా ఒక భారీ సినిమా ఛాన్స్ వదులుకోవాల్సి వచ్చిందని అంటున్నారు. ఆ వివరాల్లోకి వెళితే

బ్యాక్ టు బ్యాక్ సినిమాలు
రాధేశ్యామ్ సినిమా సెట్స్ మీద ఉండగానే ప్రభాస్ మరో మూడు సినిమాలు అనౌన్స్ చేశారు. నాగ్అశ్విన్ డైరెక్షన్లో ఓ సినిమా, బాలీవుడ్ మూవీ 'ఆదిపురుష్', ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ అనే సినిమాలు చేస్తున్నాడు. అయితే ఈ అన్ని సినిమాల విషయం పక్కన పెడితే ఆదిపురుష్ టీమ్‌ను మాత్రం వరుసగా కష్టాలు వెంటాడుతున్నాయని చెప్పచ్చు.

‘ఆదిపురుష్' షూట్
'ఆదిపురుష్' సినిమా మొదలయ్యాక అగ్ని ప్రమాదం మొదలు, మహారాష్ట్ర లాక్ డౌన్ దాకా అన్నీ ఇబ్బందులే. ఎట్టకేలకు అనేక అవాంతరాల అనంతరం ఆదిపురుష్ షూట్ ముంబైలో తిరిగి ప్రారంభమైంది. అయితే, రాధే శ్యామ్ మరియు సలార్‌ల షూటింగ్ పూర్తి చేశాకనే ప్రభాస్ ఈ సినిమా షూటింగ్ లో పాల్గొంటారని అంటున్నారు. ప్రభాస్ సెప్టెంబర్ నెలలో ఆదిపురుష్ సెట్స్‌లో ప్రభాస్ ప్రవేశించే అవకాశం ఉందని అంటున్నారు.

అప్పటి నుంచే హాట్ కేక్
నిజానికి బాహుబలి హిట్ కొట్టినప్పటి నుంచే ప్రభాస్ బాలీవుడ్ చిత్రనిర్మాతలకు ఒక హాట్ కేక్ అయ్యాడు. ప్రభాస్ ను అగ్రశ్రేణి చిత్రనిర్మాతలు సంప్రదించినట్లు అప్పటి నుంచే పుకార్లు వెలువడుతున్నాయి. నిజానికి ధూమ్ 4లో ప్రభాస్‌ను నటింప చేయడానికి యశ్ రాజ్ ఫిల్మ్స్ ఆదిత్య చోప్రా ప్లాన్ చేస్తున్నారని ఈ ప్రచారం జరుగుతోంది.

రిస్క్ వద్దని
నిజానికి జాన్ అబ్రహం నుండి హృతిక్ రోషన్ నుండి అమీర్ ఖాన్ వరకు ఉన్న హీరోలందరూ ఈ ఫ్రాంచైజీలో మంచి మంచి రోల్స్ చేసి పేరు తెచ్చుకున్నారు. ఈ సారి సౌత్ హీరో బెటర్ అని భావించి ప్రభాస్ తో ఆ రోల్ చేయించాలని భావించారు. అయితే తాజా నివేదికల ప్రకారం ధూమ్ సిరీస్ లో ప్రభాస్ ను నటింప చేయాలనే తన ప్రణాళికను ఆదిత్య చోప్రా విరమించుకున్నారట. దానికి కారణం ఆదిపురుష్. పౌరాణిక చిత్రం చేస్తూ, ధూమ్ 4 లో అల్ట్రా స్టైలిష్ లుక్ లో ప్రేక్షకులు అంగీకరించగలరా అనే సందహంతో ఈ సినిమా ఆలోచనని పక్కన పెడుతున్నారని అంటున్నారు.
Recommended Video

షూట్ లో బిజీ
పాన్ ఇండియా మూవీగా రానున్న ఈ భారీ ప్రాజెక్ట్ లో ప్రభాస్ రాముడిగా కనిపించనుండగా సీతగా కృతి సనన్ నటిస్తోంది. బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ రావణ పాత్రలో కనిపించనుండగా.. లక్ష్మణుడిగా సన్నీ సింగ్ ఎంపికయ్యారు. ఇక సైఫ్ అలీ ఖాన్ మీద ఇప్పటికే షూటింగ్ ప్రారంభించారని అంటున్నారు.


Click it and Unblock the Notifications











