Kalki 2898 AD Release date ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఆరు నూరైనా ఆ డేట్‌కే కల్కి రిలీజ్!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, దీపిక పదుకోన్ జంటగా యువ దర్శకుడు నాగ్ అశ్విన్ డైరెక్షన్‌లో రూపొందుతున్న చిత్రం ప్రాజెక్ట్ కల్కి 2898 AD. ఈ సినిమా రిలీజ్ డేట్ విషయంలో కొంత గందరగోళం నెలకొన్నది. ఇప్పటికే పలుమార్లు విడుదల వాయిదా పడ్డ ఈ సినిమా కోసం ప్రభాస్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఆరు నూరైనా ఈ మూవీని ప్రస్తుతం అనుకొంటున్న తేదీకే రిలీజ్ చేయాలని డిసైడ్ అయ్యారనేది తాజా న్యూస్. ఆ వార్త వివరాల్లోకి వెళితే..

మహానటి తర్వాత నాగ్ అశ్విన్ రూపొందిస్తున్న ప్యాన్ వరల్డ్ మూవీపై అన్ని భాషల ప్రేక్షకులు కన్నేశారు. ప్రేక్షకుల అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. హాలీవుడ్ సినిమాలకు పనిచేసిన వీఎఫ్ఎక్స్ వర్క్ కంపెనీలను రంగంలోకి దించారు. దాంతో ఈ సినిమా బడ్జెట్ అటు ఇటుగా 600 కోట్ల రూపాయలుగా ట్రేడ్ వర్గాలు నిర్ణయించాయి.

Prabhas movie Kalki 2898 AD all Set release on This date Here is Deeepika Padukone movie details

ఇక ఈ మూవీలో ప్యాన్ ఇండియా యాక్టర్లు భాగమయ్యారు. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దిశా పటానీ, మృణాల్ థాకూర్, రాజేంద్ర ప్రసాద్, పశుపతి తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను మే 9వ తేదీన రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. అయితే ఆ సమయంలో దేశవ్యాప్తంగా ఎన్నికలు జరుగుతుండటంతో ఆ మూవీ రిలీజ్ గురించి ఆందోళన చెందారు.

అయితే ఈ సినిమాను వాయిదా వేసి అక్టోబర్ గానీ.. లేదా మరో తేదిన రిలీజ్ చేయాలని తొలుత భావించారు. అయితే ఇటీవల చిత్ర యూనిట్, డిస్టిబ్యూటర్లు, ఎగ్జిబ్యూటర్లతో సమావేశమయ్యారు. ఎన్నికలు వల్ల కొంత డ్యామేజ్ జరుగుతంది. కానీ మే నెల మాత్రమే అనువైన సమయం. వేసవిలో మంచి రెస్పాన్స్‌తోపాటు కలెక్షన్లు కూడా ఉంటాయి. అయితే మే నెలలోనే రిలీజ్ చేయాలని డిస్టిబ్యూటర్లు బలంగా చెప్పడంతో ఆ దిశగా అడుగులు వేస్తున్నారు.

Prabhas movie Kalki 2898 AD all Set release on This date Here is Deeepika Padukone movie details

డిస్టిబ్యూటర్లు, ఎగ్జిబ్యూటర్లు, ట్రేడ్ అనలిస్టుల సూచనలు, సలహాల తర్వాత వైజయంతీ మూవీస్ ఈ సినిమా రిలీజ్ డేట్‌ను లాక్ చేసినట్టు సమాచారం. పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలు మే 30 కల్లా పూర్తి అవుతాయి. కాబట్టి ఈ సినిమాను మే 30 తేదీన రిలీజ్ చేస్తే బాగుంటుందని చెప్పడంతో ఆ డేట్‌ను ఫిక్స్ చేసినట్టు తెలుస్తున్నది.

ఇదిలా ఉండగా, కల్కి 2898 ఏడీ సినిమాకు ఇంతకంటే మంచి డేట్ ఉండదనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. ఈ డేట్ మిస్ అయితే.. మరో డేట్ లభించడం కష్టమే. ఇతర సినిమాలతో క్లాష్, దసరా సినిమాల హడావిడి ఉంటుంది. కాబట్టి మే 30 తేదీ ఫర్‌ఫెక్ట్ అని భావిస్తున్నారు. త్వరలో రిలీజ్ డేట్‌ను అధికారికంగా ప్రకటిస్తారు అని యూనిట్ వర్గాలు వెల్లడించాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X