ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్: కొత్త సినిమా టైటిల్ ప్రకటనకు ముహూర్తం ఖరారు.!
ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీలో ఉన్న టాప్ హీరోల్లో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ఒకడు. 'ఈశ్వర్' అనే సినిమాతో హీరోగా పరిచయం అయిన అతడు.. కెరీర్ ఆరంభంలోనే ఎన్నో సూపర్ హిట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ క్రమంలోనే యూత్‌లో భారీ స్థాయిలో క్రేజ్ సంపాదించుకున్నాడు. ఇక, దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన 'బాహుబలి' తర్వాత యూనివర్శల్ స్టార్ అయిపోయాడు. అప్పటి నుంచి భారీ చిత్రాలనే చేస్తున్నాడు. ఇందులో భాగంగానే ప్రభాస్ కొత్త సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ బయటకు వచ్చింది. ఆ వివరాలేంటో చూద్దాం పదండి.!
Recommended Video

అక్కడి వారంతా ప్రభాస్‌ను సాహో అనేశారు
‘బాహుబలి'తో వచ్చిన క్రేజ్‌ను కంటిన్యూ చేసుకునేందుకు ప్రభాస్ తన తదుపరి సినిమా ‘సాహో'ను కూడా పాన్ ఇండియా లెవెల్‌లో తీసుకెళ్లాడు. సుజిత్ తెరకెక్కించిన ఈ సినిమా తెలుగులో నిరాశ పరిచినప్పటికీ... హిందీలో మాత్రం సూపర్ డూపర్ హిట్ అయింది. అంతేకాదు, కలెక్షన్ల పరంగానూ దుమ్ము దులిపేసింది. దీంతో బాలీవుడ్‌లో అతడి మార్కెట్ పెరిగిపోయింది.

మళ్లీ అదే రేంజ్.. ఈ సారి సరికొత్త ప్రభాస్
యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం జిల్ ఫేం రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. గత చిత్రాలకు వచ్చిన ఫలితాలను దృష్టిలో ఉంచుకుని దీన్ని కూడా పాన్ ఇండియా లెవెల్‌లో రూపొందిస్తున్నారు. ఇందులో ప్రభాస్ రొమాంటిక్ రోల్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. పూజా హెగ్డే హీరోయిన్‌గా చేస్తున్న ఈ మూవీని గోపీకృష్ణ బ్యానర్, యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్నాయి.

ప్రభాస్‌ను వదలని కష్టాలు.. అదే పరిస్థితి
ప్రభాస్ సినిమా అంటేను రెండు మూడు సంవత్సరాలు తెరకెక్కుతోందన్న టాక్ ఉంది. అందుకు అనుగుణంగానే ఈ సినిమా కూడా చాలా రోజుల నుంచి షూటింగ్ జరుపుకుంటోంది. వాస్తవానికి ఇది ఎప్పుడో రావాల్సి ఉంది. కానీ, అనివార్య కారణాలతో తరచూ షూటింగ్ వాయిదా పడుతుండడంతో సినిమా విడుదల మరింత ఆలస్యం అవుతోంది.

జాన్ పోయింది... ఓ డియర్‌గా మారింది
ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కనున్న ఈ సినిమాకు మొదట ‘జాన్' అనే టైటిల్ పెట్టాలని చిత్ర యూనిట్ భావించింది. అయితే, సమంత - శర్వానంద్ కాంబోలో వచ్చిన సినిమాకు ‘జాను' అనే టైటిల్ పెట్టడంతో.. దీనికి కొత్త పేరు పెట్టాలని అనుకున్నారు. ఇందులో భాగంగానే చాంబర్‌లో ‘ఓ డియర్', ‘రాధేశ్యామ్' అనే టైటిళ్లు రిజిస్టర్ చేయించారు. రెండిట్లో మొదటిదే ఫిక్స్ అయ్యే ఛాన్స్ ఉంది.

ప్రభాస్ అభిమానుల్లో పెరుగుతున్న కోపం
దాదాపు ఈ సినిమా షూటింగ్ ప్రారంభమై ఏదాడి కావొస్తుంది. అయినప్పటికీ... ఈ మూవీ నుంచి ఒక్కటంటే ఒక్క అప్‌డేట్ రాలేదు. దీంతో ప్రభాస్ అభిమానులు నిర్మాణ సంస్థపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే వాళ్లంతా కలిసి యూవీ క్రియేషన్స్‌ను బ్యాన్ చేయాలని అప్పట్లో డిమాండ్ కూడా చేశారు. ఇప్పటికీ ఆ సంస్థపై ఒత్తిడి తెస్తూనే ఉన్నారు.

టైటిల్ ప్రకటనకు ముహూర్తం ఖరారు.!
కరోనా ప్రభావంతో ఈ సినిమా విడుదల మరింత ఆలస్యం కానుంది. దీంతో ఫ్యాన్స్ నుంచి వ్యతిరేకత రాకుండా సినిమా నుంచి ఏదో అప్‌డేట్ ఇవ్వాలని యూనిట్ భావిస్తోంది. ఇందులో భాగంగానే డైరెక్టర్ రాధాకృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 2న చిత్ర టైటిల్ రివీల్ చేయబోతున్నారని తాజాగా ఓ న్యూస్ లీకైంది. దీంతో ప్రభాస్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











