Kalki 2 : కల్కి 2 షూటింగ్ షురూ..? ఎవరితో చిత్రీకరణ జరుగుతుంది అంటే?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ - సెన్సేషనల్ డైరెక్టర్ నాగ అశ్విన్ కాంబినేషన్లో వచ్చిన బిగ్గెస్ట్ మూవీ 'కల్కి 2898 ఏడీ' చిత్రం ఎంత బ్లాక్ బస్టర్ గా నిలిచిందో తెలిసిందే. గతేడాది ప్రేక్షకులకు ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. ఏకంగా 1100 కోట్ల రూపాయల గ్రాస్ ను కలెక్ట్ చేసి ఇండియాలో హైయెస్ట్ గ్రాస్ వసూలు చేసిన చిత్రాలలో మొదటి వరుసలో నిలిచింది.
ఈ చిత్రంలో భారీ తారాగణం నటించిన సంగతి తెలిసిందే. మొదటి పార్ట్ అంచనాలను రీచ్ అవ్వడంతో ఆడియన్స్ కు కల్కి 2 సీక్వెల్ పై మరింత ఆసక్తి నెలకొంది. రెండో పార్ట్ ఎప్పుడు వస్తుందా? అని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ప్రేక్షకులు. కాగా సీక్వెల్ ఫై అదిరిపోయే అప్డేట్ అందింది.

ప్రభాస్ ప్రస్తుతం తన లైనప్ లో ఉన్న ప్రాజెక్ట్స్ తో ఫుల్ బిజీగా ఉన్నారు. దాదాపు ఏడాదిన్నర నుంచి రెండు సంవత్సరాల వరకు డార్లింగ్ తన రాబోయే చిత్రాలతోనే సమయం గడపనున్నారు. ఏమాత్రం డేట్స్ ఖాళీ లేకుండా షెడ్యూల్ ఫిక్స్ అయి ఉంది. ఈ క్రమంలో కల్కి 2 షూటింగ్లో ప్రభాస్ ఎప్పుడు పాల్గొంటారని సర్వత్రా ఆసక్తి నెలకొంది. ప్రభాస్ ఇప్పట్లో కల్కి2 సీక్వెల్ పై ఫోకస్ పెట్టినట్లు కనిపించట్లేదు. దీంతో నాగ్ అశ్విన్ మాత్రం ఎలాగైనా కల్కి పార్ట్ 2 షూటింగ్ని స్టార్ట్ చేయాలనే ఆలోచనలో మునిగి ఉన్నారంట. ఇప్పుడు అప్పుడు షూటింగ్ మొదలుపెట్టే ప్రయత్నాలే చేస్తున్నారంట.
ఇక ప్రభాస్ ఫుల్ బిజీ షెడ్యూల్ తో ఉండడంతో మిగిలిన తారాగణంతో నాగ్ అశ్విన్ షూట్ స్టార్ట్ చేయాలని భావిస్తున్నారంట. అందుకు తగిన ఏర్పాట్లు కూడా పూర్తి చేస్తున్నారని తెలుస్తోంది. అయితే కల్కి 2898 ఏడీ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించిన ఇండియాస్ బిగ్గెస్ట్ యాక్టర్స్ బిగ్ బి అమితాబ్ బచ్చన్, యూనివర్సల్ యాక్టర్ కమల్ హాసన్ లతో షూటింగ్ జరిపించే ఆలోచనతో ఉన్నారని తెలుస్తోంది.
ప్రభాస్ ఎలాగూ తన ప్రాజెక్ట్స్ ను పూర్తి చేసుకొని ఈ ప్రాజెక్ట్ కు టైమ్ ఇచ్చే సరికి చాలా టైమ్ పడేలా ఉంది. దీంతో ప్రస్తుతం నాగ్ అశ్విన్ ఈ ఇద్దరు సీయర్ యాక్టర్లతో కీలక సన్నివేశాలను చిత్రీకరించే పనిలో బిజీ అయ్యారని తెలుస్తోంది. ఇలా ప్లాన్ చేస్తే త్వరగా షూటింగ్ పూర్తి చేసే అవకాశం ఉంటుందని, మరోవైపు ప్రభాస్ కు సంబంధించిన షూటింగ్ పార్ట్ ను కూడా త్వరగానే కంప్లీట్ చేసే అవకాశం ఉంటుందని ఆలోచిస్తున్నారంట.
అయితే, షూటింగ్ ను 2025 మేలోనే ప్రారంభించేలా నాగ్ అశ్విన్ ప్లాన్ చేస్తున్నారంట. ఈమేరకు ఫిల్మ్ సర్కిల్స్ లో టాక్ వినిపిస్తోంది. మరి నాగ్ అశ్విన్ ఎంత త్వరగా షూట్ ను కంప్లీట్ చేసే వీలుంటే అంత తర్వగా పూర్తి చేయాలని భావిస్తున్నారంట. ఇప్పటికే ఈ సీక్వెల్ కోసం అభిమానులు, ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న క్రమంలో ఇలాంటి అప్డేట్ రావడంతో ఫుల్ ఖుషి అవుతున్నారు.
మరీ మేలో షూటింగ్ ప్రారంభం అవుతుందా లేదా అనేది వేచి చూడాలి. ఇక ప్రభాస్ ప్రస్తుతం 'రాజా సాబ్', 'ఫౌజీ', 'స్పిరిట్' చిత్రాలతో బిజీగా ఉన్నారు. మరోవైపు సలార్2, లోకేష్ కనగరాజ్ తో ఓ సినిమా, రీసెంట్ గా త్రివిక్రమ్ తో కూడా 'జటాయు' సినిమా కూడా ఫిక్స్ అయ్యిందని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











