Project K: ప్రభాస్ - నాగ్ అశ్విన్ సినిమా వచ్చేది అప్పుడే.. అన్ని సంవత్సరాలు ఎదురుచూడాలా?
బాహుబలి - RRR వంటి బడా సినిమాల అనంతరం ప్రాజెక్ట్ K మరో బిగ్ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాగా రూపొందనుంది. మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆ సినిమాపై అంచనాలు అయితే మాములుగా లేవు. ఎనౌన్స్మెంట్ తోనే భారీగా హైప్ క్రియేట్ చేశారు. నటీనటులు కూడా నేషనల్ మార్కెట్ కు తగ్గట్లుగానే ఉన్నారు. ఇక హాలీవుడ్ లో కూడా విడుదల కాబోయే ఈ సినిమా రిలీజ్ పై మరో షాకింగ్ అప్డేట్ వచ్చేసింది.

సినిమాకు తగ్గట్లుగానే అగ్ర నటీనటులు
ఇటీవల సెట్స్ పైకి వచ్చిన ఈ సినిమాకు వర్కింగ్ టైటిల్ గా ప్రాజెక్ట్ K ను సెట్ చేసిన విషయం తెలిసిందే. దర్శకుడు నాగ్ అశ్విన్ సైన్స్ ఫిక్షన్ కథగా ప్లాన్ చేసుకున్నట్లు ముందే క్లారిటీ ఇచ్చేశాడు. ఇక సినిమా కోసం దాదాపు అగ్ర నటీనటులనే సెలెక్ట్ చేసుకున్నాడు. ప్రభాస్ కు గురువు పాత్రలో అమితాబ్ బచ్చన్ సినిమా మొత్తం కనిపిస్తాడట. ఇక హీరోయిన్ గా దీపికా పదుకొనె సెలెక్ట్ అయిన విషయం తెలిసిందే.
Recommended Video

ఈ సంస్థలో మొదటి బిగ్ బడ్జెట్ మూవీ
ఇండియాలోనే అత్యదిక అనుభవం కలిగిన ప్రొడక్షన్ కంపెనీలలో వైజయంతి కూడా టాప్ లిస్టులో ఉంటుంది. ఇక 50 ఏళ్ళ చరిత్ర కలిగిన ఈ సంస్థలో మొదటిసారి బిగ్ బడ్జెట్ పాన్ ఇండియా సినిమా రూపొందుతోంది. నిర్మాత అశ్వినిదత్ ఖర్చుకు ఏ మాత్రం వెనుకాడకుండా భారీగా పెట్టుబడులు పెడుతున్నారు.

బడ్జెట్ మొత్తం ఎంతంటే
సినిమా నిర్మాణం కోసం దాదాపు 500కోట్లు ఖర్చు చేసి అవకాశం ఉన్నట్లు టాక్ అయితే వస్తోంది. మొదట మూడు వందల కోట్ల లోపే పూర్తయ్యేలా ప్లాన్ చేసుకున్నారు. కానీ ఆ తరువాత హాలీవుడ్ స్థాయిలో కూడా సినిమాను అద్భుతంగా ప్రజెంట్ చేయవచ్చని బడ్జెట్ లెక్కలను మార్చేశారు.

సినిమా వచ్చేది ఎప్పుడంటే?
ఇక సినిమా ఎప్పుడు వస్తుంది అనేది హాట్ టాపిక్ గా మారుతున్న సమయంలో ఒక న్యూస్ అభిమానులను షాక్ కు గురి చేస్తోంది. ప్రాజెక్ట్ K 2024లో విడుదల అవుతుందట. ఇంతకుముందు 2023లోనే రావచ్చని అన్నారు. ఇక ప్రీ ప్రొడక్షన్ పనులు వల్ల ఇప్పుడు మరికొంత ఆలస్యం అయ్యిందట. మరి అనుకున్న ప్లాన్ ప్రకారం దర్శకుడు సినిమాను ఎలా ఫినిష్ చేస్తాడో చూడాలి. ఇక ఆ లోపు ప్రభాస్ చేతిలో ఉన్న సినిమాలతో పాటు సిద్దార్థ్ ఆనంద్ సినిమాను కూడా ఫినిష్ చేయవచ్చని సమాచారం.


Click it and Unblock the Notifications











