ప్రభాస్ - నాగ్ అశ్విన్ మరో ఇంట్రెస్టింగ్ పాయింట్ .. ఎక్కువగా ఆ కాలంలోనే..
బహుబలి అనంతరం ప్రభాస్ స్పీడ్ తో పాటు మార్కెట్ లెవెల్ ను కూడా గట్టిగానే పెంచుతున్నాడు. షెడ్యూల్స్ ఎలా ప్లాన్ చేసుకుంటున్నాడో తెలియదు గాని రానున్న రోజుల్లో మాత్రం రెస్ట్ లేకుండా వర్క్ చేసే టైమ్ వస్తుందేమో. రాధేశ్యామ్ ఇంకా పూర్తవ్వలేదు. సలార్ డేట్స్ ఇప్పటికే చాలా వరకు వృధా అయ్యాయి. సెకండ్ వేవ్ తగ్గితేనే ఆ సినిమా విడుదలపై కన్ఫ్యూజన్ తొలగుతుంది.
బాలీవుడ్ బడా దర్శకుడు ఓం రావత్ దర్శకత్వంలో ఆదిపురుష్ అంతకుమించి అనేలా రెడీ అవుతోంది. ఆ సినిమా రామాయణం కథ ఆధారంగా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇక నాగ్ అశ్విన్ దర్శకత్వంలో చేయనున్న సినిమాపై కూడా అంచనాలు భారీగానే ఉన్నాయి. ఆ సినిమా టైమ్ ట్రావెల్ నేపథ్యంలో తెరకెక్కనున్న విషయం తెలిసిందే. అయితే ఎక్కువగా స్టోరి 2050 కాలంలోనే కొనసాగుతుందట.

అసలైన ట్విస్ట్ 2050 సంవత్సరం చుట్టే తిరుగుతుందని సమాచారం. ఈ సినిమాను హాలీవుడ్ లో కూడా విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. గ్లోబల్ సినిమాగా టాలీవుడ్ స్థాయిని మరో లెవెల్ కు తీసుకెళ్లడం కాయమని తెలుస్తోంది. ప్రీ ప్రొడక్షన్ పనుల కోసమే దర్శకుడు నాగ్ అశ్విన్ ఏడాది సమయం కేటాయిస్తున్నారు. ఇక ప్రభాస్ ఆగస్ట్ తరువాతనే టీమ్ తో జాయిన్ కావచ్చని టాక్ వస్తోంది. కోవిడ్ ప్రభావం తగ్గితే త్వరలోనే షూటింగ్ స్టార్ట్ చేయాలని ఆలోచిస్తున్నారు. ఇక సినిమా 2023 చివరలో రిలీజ్ కావచ్చని సమాచారం.


Click it and Unblock the Notifications











