బాలీవుడ్ అడ్డాలో ప్రభాస్ భారీ పెట్టుబడి.. వచ్చిన రెమ్యునరేషన్ మొత్తం దానిపైనే..
నెంబర్ వన్ పాన్ ఇండియా స్టార్ గా క్రేజ్ అందుకున్న ఏకైక హీరో ప్రభాస్. ప్రభాస్ సెట్ చేసిన ఫార్మాట్ లోనే ఇప్పుడిప్పుడే మిగతా వాళ్ళు కూడా ప్రయత్నాలు మొదలు పెడుతున్నారు. ఇక బాక్సాఫీస్ వద్ద ప్రభాస్. మార్కెట్ ఏ రేంజ్ లో ఉందొ బాహుబలి, సాహో సినిమాలతో అర్ధమయ్యింది. సాహో ఇంకాస్త క్లిక్కయ్యి ఉంటే మరో రేంజ్ లో ఉండేది. ఇక బాలీవుడ్ అడ్డాలో ప్రభాస్ ఇటీవల భారీ స్థాయిలో పెట్టుబడి పెట్టినట్లు తెలుస్తోంది.
Recommended Video

పాన్ ఇండియా రేంజ్ లో
బాక్సాఫీస్ మార్కెట్ విషయంలో ఇప్పుడు బాలీవుడ్ హీరోల కంటే ప్రభాస్ తక్కువేమి కాదు. రెబల్ స్టార్ క్రేజ్ ప్రస్తుతం ఏ రేంజ్ లో ఉందొ ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎలాంటి సినిమా ఒప్పుకున్నా కూడా మినిమమ్ పాన్ ఇండియా రేంజ్ లో రూపొందుతున్నాయి. ఇక ప్రభాస్ తో సినిమా చేయాలి అంటే బడ్జెట్ ఈజీగా 250కోట్లు దాటేస్తోంది.

4 సినిమాలతో
ఈ స్టార్ హీరో లైనప్ ఇప్పుడు మామూలుగా లేదు. లిస్ట్ లో ఉన్న ప్రతి సినిమా కూడా అభిమానుల్లో అంచనాల డోస్ ను అమాంతంగా పెంచుతోంది. ఒకదానికి మించి మరొకటి అనేలా ఉన్నాయి. ఒక విధంగా ప్రభాస్ ఈ లాక్ డౌన్ ను చాలా బాగా ఉపయోగించుకున్నాడనే చెప్పాలి. దాదాపు నాలుగేళ్ళ వరకు బిజీగా ఉండేలా పర్ఫెక్ట్ ప్లాన్ చేసుకున్నట్లు చాలా ఈజీగా అర్ధమయ్యింది. ప్రస్తుతం వరుసగా 4 సినిమాలను లైన్ లో పెట్టిన విషయం తెలిసిందే.

దర్శకులు ఎవరంటే.
ప్రభాస్ మొదట రాధేశ్యామ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. జులై 30న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. KGF డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో చేస్తున్న సలార్ సినిమాపై కూడా అంచనాలు గట్టిగానే ఉన్నాయి. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సైన్ ఫిక్షన్ సినిమాతో పాటు ఆదిపురుష్ సినిమాను చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ప్రభాస్ అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తో కూడా సినిమా చేయనున్నాడు.

రెమ్యునరేషన్ ఎంత
డార్లింగ్ ప్రభాస్ ఎంత బిజీగా ఉన్నాడో అందరికి ఒక క్లారిటీ వచ్చేసింది. అయితే ప్రభాస్ ఒక సినిమాకు ఇప్పుడు అందుకుంటున్న రెమ్యునరేషన్ ఎంత అనేది హాట్ టాపిక్ గా మారింది. బాహుబలి అనంతరం , సాహో ద్వారా బాలీవుడ్ లో కలెక్షన్స్ గట్టిగానే అందుకున్నాడు. దీంతో ప్రభాస్ రెమ్యునరేషన్ ఇప్పుడు ఒక్క సినిమాకు 100కోట్లు దాటుతున్నట్లు టాక్ వస్తోంది.

స్పెషల్ బాలీవుడ్ మూవీ
ఆదిపురుష్ సినిమా ప్రభాస్ కు చాలా స్పెషల్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ సినిమా బాలీవుడ్ లోనే తెరకెక్కుతోంది. దర్శకుడు ఓం రావత్ తో పాటు అందరూ హిందీ పరిశ్రమకు చెందినవారే. ఒక విధంగా తెలుగులోనే ఈ సినిమా డబ్ కానుంది. అయితే ఆ సినిమా షూటింగ్ కోసం ప్రభాస్ రెగ్యులర్ గా ముంబైకు వెళుతున్నాడు.

విలాసవంతమైన ఇల్లుపై ప్రభాస్ కన్ను
ముంబైలో స్టార్ హోటల్ లో ఉంటున్నప్పటికీ ప్రభాస్ ఎక్కువగా హోటల్ లైఫ్ ను ఇష్టపడడు. ఇక బాలీవుడ్ నుంచి కూడా ఆఫర్స్ చాలాన్స్ వస్తున్నాయి కాబట్టి అక్కడ సొంత ఇల్లు ఉంటే బావుంటుందని ఫిక్స్ అయ్యారట. అందుకు ఆదిపురుష్ నిర్మాతలతో చర్చలు జరువుతున్నారట. రెమ్యునరేషన్ కాకుండా విలాసవంతమైన ఇల్లు ఒకటి చూడమని ప్రభాస్ చెప్పాడట. ఇల్లు కొంటే ఒక రకంగా ప్రభాస్ కు అది పెట్టుబడే. మరి ఆ కొత్త విల్లా ఎలా ఉంటుందో చూడాలి.


Click it and Unblock the Notifications











