ఆ దెబ్బతో ప్లాన్ చేంజ్ చేసిన ఆదిపురుష్ టీమ్.. రిస్క్ చేయవద్దని ప్రభాస్ చెప్పడంతో..
టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఆదిపురుష్ పాన్ ఇండియా అభిమానులు ఏ రేంజ్ లో ఎదురుచూస్తున్నారో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. చాలా ఏళ్ళ తరువాత రామాయణం బ్యాక్ డ్రాప్ లో బిగ్ బడ్జెట్ సినిమా రూపొందుతోంది కాబట్టి అన్ని ఇండస్ట్రీలో ప్రముఖులు కూడా సినిమాను చూడాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అసలు మ్యాటర్ లోకి వస్తే సినిమాకు సంబంధించిన ప్లాన్ మొత్తం మళ్ళీ చేంజ్ అయినట్లు టాక్ వస్తోంది.
Recommended Video
ఆది పురుష్ సినిమాను దర్శకుడు ఓం రావత్ బాలీవుడ్ హై టెక్నీషియన్లతో తెరకెక్కిస్తున్నాడు. సినిమాకు సంబంధించిన షూటింగ్ పనులన్నీ కూడా ముంబైలోని ఒక ఇండోర్ సెట్ లోనే నిర్వహిస్తూ వచ్చారు. ఆ మధ్య అగ్నిప్రమాదం వలన మళ్ళీ కొత్త సెట్ వేసిన విషయం తెలిసిందే. ఇక కోవిడ్ వలన రిస్క్ చేయవద్దని ప్రభాస్ చెప్పడంతో ఇప్పుడు లోకేషన్ షిఫ్ట్ చేస్తూ కొత్త తరహా సెట్ ను వేయబోతున్నట్లు తెలుస్తోంది.

హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో అయితే అన్నిటికీ సౌకర్యంగా ఉంటుందని అలాగే సేఫ్ గా ఎన్ని రోజులైనా చేసుకోవచ్చని ప్రభాస్ నిర్ణయంతో చిత్ర యూనిట్ ప్లాన్ చేంజ్ చేసినట్లు సమాచారం. ఇక షూటింగ్ మొత్తం ఇక్కడే సెట్స్ లలో పూర్తి చేయనున్నారట. ఎక్కువగా గ్రీన్ మ్యాట్ ఉపయోగించి గ్రాఫిక్స్ కు అనుకూలంగా షూట్ చేస్తున్నట్లు టాక్ వస్తోంది. ఇక సినిమాలో సీత పాత్రలో కృతి సనోన్ నటిస్తుండగా రావణుడి పాత్రలో సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్న విషయం తెలిసిందే. సినిమాను వచ్చే ఏడాది రిలీజ్ చేయాలని ఆలోచిస్తున్నారు.


Click it and Unblock the Notifications











