»   » ప్రభాస్ రొమాంటిక్ మూవీకి ముహూర్తం కుదిరిందా!

ప్రభాస్ రొమాంటిక్ మూవీకి ముహూర్తం కుదిరిందా!

Subscribe to Filmibeat Telugu

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కు బాహుబలి తరువాత జాతీయ వ్యాప్తంగా క్రేజీ హీరోగా మారిపోయాడు. ప్రభాస్ నెక్స్ట్ మూవీ కోసం అభిమానులు దేశవ్యాప్తంగా అభిమానులు ఎదురుచూస్తున్నారు. కాగా ప్రభాస్ బాహుబలి తరువాత కూడా అంతే స్థాయిలో భారీ చిత్రంలో నటిస్తున్నాడు. ప్రభాస్ నటిస్తున్న సాహో చిత్రం 150 కోట్ల బడ్జెట్ తో రూపొందుతోంది. ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం దుబాయ్ లో జరుగుతోంది. కాగా సాహో విడుదలకు ఇంకా సమయం పెట్టె అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఈ లోపు ప్రభాస్ మరో చిత్రాన్ని ప్రారంభించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రభాస్ జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకతంలో నటించనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ముహూర్తం కుదిరినట్లు వార్తలు వస్తున్నాయి. జులై 7 న ఈ చిత్రం ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఈ రొమాంటిక్ ఎంటర్ టైనర్ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్ గా ఎంపికైనట్లు తెలుస్తోంది.

Prabhas new movie will starts from July

సాహో, రాధా కృష్ణ దర్శకత్వంలో చిత్రాల షూటింగ్ తో ప్రభాస్ ఈ ఏడాది బిజీగా గడపడనున్నాడు. 2018లో ప్రభాస్ చిత్రం విడుదల కాకున్నా 2019 లో రెండు చిత్రాలతో ప్రభాస్ అభిమానులకు కానుక ఇవ్వనున్నాడు.

English summary
Prabhas new movie will starts from July. Jill fame Radha Krishna is the director
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X