Prabhas: సీతారామం దర్శకుడితో ప్రభాస్ మూవీ.. స్టార్ హీరోలు కాదన్న కథతో యంగ్ రెబల్ స్టార్!

తెలుగు చిత్ర పరిశ్రమలో అందమైన ప్రేమ కావ్యాలకు పెట్టింది పేరు హను రాఘవపూడి. ఎమోషనల్, ఫీల్ గుడ్ లవ్ స్టోరీస్ తెరెక్కించే ఆయన ఇటీవల సీతా రామం సినిమాతో క్లాసిక్ హిట్ అందుకున్నారు. ఈ సినిమాతో హను రాఘవపూడి మార్క్ మరోసారి ప్రూవ్ అయింది. అయితే ఈ డైరెక్టర్ కి ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ను డైరెక్ట్ చేసే అవకాశం వచ్చిందని టాక్. త్వరలోనే ప్రభాస్-హను రాఘవపూడి కాంబినేషన్ లో ఓ సినిమా రానున్నట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. దానికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..

అందాల రాక్షసిలా: అందాల రాక్షసి సినిమాతో దర్శకుడిగా సినీ కెరీర్ ప్రారంభించిన హను రాఘవపూడి విభిన్నమైన ప్రేమ కథా చిత్రాలతో ఆకట్టుకున్నారు. చేసిన మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అనంతరం కృష్ణగాడి వీర ప్రేమగాథ, లై, పడి పడి లేచే మనసు వంటి చిత్రాలు తెరకెక్కించి అలరించారు. అయితే ఇవేవి అందాల రాక్షసి అంతగా హిట్ కాలేదు.

Prabhas

ప్రభాస్ ఫిదా: ఇక గతేదాడి సీతారామం వంటి క్లాసిక్ లవ్ స్టోరీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు హను రాఘవపూడి. దీంతో ప్రేమకథలకు స్పెషలిస్టుగా పేరు సంపాదించుకున్నారు ఈ డైరెక్టర్. ఈ సినిమాలో రామ్ గా దుల్కర్ సల్మాన్, సీతగా మృణాల్ ఠాకూర్ లను చిత్రీకరించిన విధానానికి యావత్ తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. అయితే తాజాగా హను రాఘవపూడి చెప్పిన కథకు ప్రభాస్ సైతం ఫిదా అయ్యాడట.

వద్దన్న హీరోలు: సీతా రామం సినిమా తర్వాత హను రాఘవపూడి తెరకెక్కించే సినిమాపై అంచనాలు భారీగానే నెలకొన్నాయి. ఈ క్రమంలోనే ఓ కథ అనుకున్న డైరెక్టర్ హను హీరోలు రామ్ చరణ్, సూర్య, కార్తీ, నానిలకు చెప్పాడట. అయితే వాళ్లతో మూవీ వర్కౌట్ కాలేదట. కానీ రీసెంట్ గా ఈ కథకు ప్రభాస్ ఇంప్రెస్ అయినట్లు తెలుస్తోంది.

Prabhas

అలాంటి బ్యాక్ డ్రాప్: హను రాఘవపూడి లవ్ స్టోరీని ఆసక్తిగా, అందంగా మలిచే విధానం ప్రభాస్ ను ఆకట్టుకుందట. అయితే ఈ ప్రేమకథకు వార్ బ్యాక్ డ్రాప్ జోడించి కథను సిద్ధం చేయమని హను రాఘవపూడికి ప్రభాస్ సూచించాడట. అందులో భాగంగానే వరల్డ్ వార్ బ్యాక్ డ్రాప్ తీసుకుని ఫ్రెండ్ షిప్, లవ్ మెయిన్ ప్లాట్ గా హను రాఘవపూడి కొత్త కథను రూపొందించినట్లు సమాచారం.

Prabhas

రెండు వారాల్లో: అంతేకాకుండా సీతా రామం సినిమాలో లెటర్ కాన్సెప్ట్ ను ఫ్రెంచ్ మూవీ నుంచి ఇన్ స్పైర్ అయినట్లు చెప్పిన హను రాఘవపూడి ఈ కథను మాత్రం ఏ సినిమాలను స్ఫూర్తిగా తీసుకోకుండా సొంతగా రెడీ చేసినట్లు సినీ వర్గాల నుంచి వస్తున్న ఇన్ సైడ్ టాక్. అన్నీ కుదిరితే రాబోయే రెండు వారాల్లో ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

భారీ బడ్జెట్-అనుమానాలు: భారీ బడ్జెట్ చిత్రంగా రూపొందనున్న హను రాఘవపూడి-ప్రభాస్ సినిమాను అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనుంది. ఇదిలా ఉంటే ప్రభాస్ వరుస సినిమాలతో ఇప్పటికే చాలా బిజీగా ఉన్నాడు. జూన్ 16న ఆదిపురుష్ మూవీ విడుదలకు సిద్ధంగా ఉండగా.. లైన్ లో సలార్, ప్రాజెక్ట్ కె, రాజా డీలక్స్, స్పిరిట్ చిత్రాలు ఉన్నాయి. దీంతో హనుతో సినిమా ఎప్పటికీ కానుందో అనే అనుమానాలు కూడా వస్తున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X