ఫ్యాన్స్ కోపానికి అడ్డుకట్ట వేసేందుకు ప్రభాస్ న్యూ ప్లాన్.. పవర్ స్టార్ దర్శకుడితో..
రెబల్ స్టార్ ప్రభాస్ బహుబలి అనంతరం అభిమానులు కాస్త నిరాశకు గురి చేస్తున్నాడనే చెప్పాలి. స్పీడ్ గా సినిమాలు చేస్తానని చెప్పి మళ్ళీ అదే తరహాలో ఆలస్యం చేస్తున్నాడు. దానికి తోడు సినిమా అప్డేట్స్ కూడా ఇవ్వకపోవడంపై అభిమానులు తీవ్ర ఆగ్రహానికి లోనవుతున్నారు. అందుకే వారిని కూల్ చేయడానికి రెబల్ స్టార్ కొత్త ప్లాన్ వేశాడట.

సాహో ఎఫెక్ట్..
ఓ విధంగా సాహో సినిమా కూడా ప్రభాస్ పై అలాగే యూవీ క్రియేషన్స్ పై ఎఫెక్ట్ చూపించిందనే చెప్పాలి. ఆ సినిమా సక్సెస్ అయ్యి ఉంటే అభిమానుకు ప్రభాస్ తదుపరి సినిమా గురించి పెద్దగా పట్టించుకునేవారు కాదు. 300కోట్ల బడ్జెట్ తో ఇన్నేళ్లు కష్టపడి తీసిన సినిమా ఇదేనా ? అంటూ ఓ వర్గం ఆడియెన్స్ చాలా నీరాశచెందారు. దీంతో నెక్స్ట్ సినిమాను అయినా తొందరగా రిలీజ్ చేస్తారు అనుకుంటే కనీసం టైటిల్ కూడా ఫైనల్ చేయలేదు.

సంక్రాంతికి కూడా లేనట్లే..
అసలైతే ఈ ఏడాది మొదట్లోనే ప్రభాస్ 20వ సినిమా రిలీజ్ చేయాల్సింది. కానీ పాన్ ఇండియా హంగులుకు పోయి చిత్ర యూనిట్ మరింత సమయాన్ని తీసుకుంది. ఇక మధ్యలో లాక్ డౌన్ వల్ల షూటింగ్ ప్లాన్స్ తారుమారయ్యాయి. చూస్తుంటే ప్రభాస్ 20 వచ్చే సంక్రాంతికు రాదనిపిస్తోంది. సమ్మర్ లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేసుకుంటున్నారు.

యూవీ క్రియేషన్స్..
యూవీ క్రియేషన్స్ ప్లానింగ్స్ ఎలా ఉంటాయో తెలియదు గాని ఆ సంస్థ ప్రభాస్ కి సంబంధించిన సినిమా అప్డేట్స్ ఇవ్వడంలో చాలా ఆలస్యం చేస్తుందనే టాక్ వచ్చింది. చివరకు అభిమానులు ఆ సంస్థను బ్యాన్ చేయాలని ట్విట్టర్ లో ఒక యుద్ధమే ప్రకటించారు. ఆ తరువాత క్లారిటీ ఇచ్చినప్పటికీ ఇంకా అభిమానులని సంతృప్తి పరచలేకపోతున్నారు.
Recommended Video

అభిమానులను కూల్ చేయాలని..
ఇక ఫైనల్ గా ప్రభాస్ అభిమానులకు నెక్స్ట్ ఇయర్ వీలైనంత వరకు రెండు సినిమాలను అందించేలా ప్లాన్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. అందుకు పవన్ దర్శకుడిని లైన్ లో పెడుతున్నాడట. వకీల్ సాబ్ సినిమాను తెరకెక్కిస్తున్న వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ప్రభాస్ ఒక మినీ బడ్జెట్ సినిమాను ప్లాన్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది రాధా కృష్ణ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న 20వ ప్రాజెక్ట్ తో పాటు వేణు శ్రీరామ్ ప్రాజెక్ట్ ను కూడా విడుదల చేయాలని ప్లాన్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











