Don't Miss!
- News ఐటీ హబ్ లో హైఅలర్ట్, దెబ్బకు అన్ని కంపెనీలకు సెలవు, ఓటు సరే పెళ్లామ్ తో జంప్!
- Sports మా పక్కింటి ఆంటీ గొడవ వల్ల క్రికెటర్‌ను అయ్యాను: నితీశ్ కుమార్ రెడ్డి వీడియో
- Technology OnePlus Watch 2 వన్‌ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
కొరటాలతో ప్రభాస్ మీట్.. చర్చల్లో ఇంట్రెస్టింగ్ ఇష్యూ.. అదే జరిగితే!
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తన తదుపరి సినిమాను కన్ఫర్మ్ చేయబోతున్నారని తెలుస్తోంది. ఇటీవలే సాహో సినిమాతో ఊహించని డిసాస్టర్ ఖాతాలో వేసుకున్న ఆయన కథల ఎంపికలో అత్యంత జాగ్రత్త వహిస్తున్నారట. ప్రస్తుతం రాధాకృష్ణ దర్శకత్వంలో కొత్త సినిమా చేస్తున్న ప్రభాస్.. ఇది పూర్తి కాగానే కొరటాల శివతో సినిమా చేసేందుకు ఫిక్స్ అయ్యారనేది తాజా సమాచారం.
గతంలో ప్రభాస్ - డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్లో వచ్చిన 'మిర్చి' సినిమా బ్లాక్ బస్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. అప్పుడే ఈ కాంబోపై క్రేజీ కాంబినేషన్ ముద్రపడింది. పైగా ఇదే కొరటాలకు ఫస్ట్ సినిమా కూడా. ఆ తరువాత ఆయన దర్శకత్వంలో వచ్చిన సినిమాలన్నీ సూపర్ డూపర్ హిట్ కావడంతో బడా డైరెక్టర్‌గా మారారు కొరటాల. ఈ నేపథ్యంలో దాదాపు ఐదేళ్ల మళ్ళీ ఇప్పుడు ప్రభాస్ - డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్లో సినిమా రానుందనే వార్త రెబల్ స్టార్ అభిమానుల్లో జోష్ నింపుతోంది.
దీపావళి సందర్భంగా ప్రభాస్, కొరటాల ఓ చోట కలిశారట. ప్రభాస్ ఓకే చెబితే స్టోరీ రాసేందుకు సిద్ధంగా ఉన్నానని కొరటాల చెప్పడంతో, ఆయన కూడా పాజిటివ్‌గా స్పందించారని తెలుస్తోంది. ప్రస్తుతం కొరటాల శివ.. చిరంజీవితో సినిమా చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత కొరటాల లైన్లో పెట్టింది ప్రభాస్‌నే అని టాక్ నడుస్తోంది.
త్వరలోనే ప్రభాస్ సినిమా స్క్రిప్టుపై పనులు ప్రారంభిస్తారట కొరటాల శివ. ప్రభాస్‌కు ప్యాన్ ఇండియా ఇమేజ్ దృష్టిలో పెట్టుకొని కొరటాల కథ ప్లాన్ చేస్తున్నారని సమాచారం. మైత్రిమూవీ మేకర్స్‌తో పాటు కొరటాల సన్నిహితుడు మిక్కిలినేని సుధాకర్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మించనున్నారని అంటున్నారు. అంతా అనుకున్నట్లుగా జరిగితే ప్రభాస్- కొరటాల శివ క్రేజీ కాంబోలో మరో సినిమా రానున్నట్లే మరి.