ప్రభాస్ నెక్ట్స్ మూవీ రాజమౌళితో కాదా?
హైదరాబాద్ : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ 'రెబల్' చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే డార్లింగ్, మిస్టర్ పర్ ఫెక్ట్ చిత్రాలతో వరుస హిట్లిచ్చిన ప్రభాస్ 'రెబల్' ద్వారా హాట్రిక్ కొడతారనే నమ్మకం ఇటు సినీ వర్గాల్లోనూ, అటు అభిమానుల్లోనూ నెలకొంది. మరో వైపు ప్రభాస్ తో సినిమా చేసేందుకు టాప్ డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు క్యూ కడుతున్నారు.
ప్రస్తుతం ప్రభాస్ ఇప్పటికే కొరటాల శివ దర్శకత్వంలో కమిటైన 'వారధి' చిత్రంలో నటిస్తున్నాడు. ఈచిత్రం షూటింగ్ కూడా తుది దశకు చేరుకుంది. దీని తర్వాత ప్రభాస్ చేయబోయే సినిమా రాజమౌళితోనే అని అంతా అనుకుంటున్నాం. కానీ అది నిజం కాదని, రాజమౌళితో సినిమా చేసేకంటే ముందే మరో టాప్ డైరెక్టర్ తో ప్రభాస్ మరో సినిమా చేయబోతున్నారని ఫిల్మ్ నగర్ టాక్. ఆ డైరెక్టర్ ఎవరో కాదు...వివి వినాయక్ అంటున్నారంతా.
ప్రస్తుతం రామ్ చరణ్ తో 'నాయక్' చిత్రం చేస్తున్న వివి వినాయక్ మరో రెండు నెలల్లో షూటింగ్ కంప్లీట్ చేసి...నవంబర్ నెలాఖరుకల్లా ప్రభాస్ తో సినిమా చేయడానికి సిద్ధం అవుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రాజమౌళి ప్రభాస్ తో తీయబోయే చిత్రం చారిత్రక నేపథ్యంలో సాగనున్న కారణంగా రాజమౌళి మరిత సమయం తీసుకోవాలని చూస్తున్నారని, ఆలోగా వినాయక్-ప్రభాస్ కాంబినేషన్ చిత్రం ప్రారంభం కానుందనే వార్తలు వినిపిస్తున్నాయి.
ఇప్పటికే ఆ చిత్రానికి సంబంధించిన కథా చర్చలు పూర్తయ్యాయని, తమన్ మ్యూజిక్ డైరెక్టర్ గా సెలక్ట్ అయినట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని వినాయక్ కామెడీ విత్ మాస్ ఎంటర్ టైనర్ గా రూపొందించేందుకు రెడీ అవుతున్నట్లు సమాచారం. త్వరలోనే దీనిపై అధికారిక సమాచారం వెలువడనుంది.


Click it and Unblock the Notifications











