ఆ డైరెక్టర్ ప్రభాస్‌కే సూటి పెట్టారట.. అందుకే ఇంతకాలం సైలెంట్ అయ్యారా?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ క్రేజ్ క్యాచ్ చేసుకునేలా ఆ డైరెక్టర్ ఓ ఆసక్తికర కథాంశం సిద్ధం చేశారట. కాస్త లేట్ అయినా సరే.. లేటెస్ట్‌గా వద్దాం, టాలెంట్ ఏంటో మరోసారి చూపిద్దాం అన్నట్లుగా ఆ దర్శకుడు ఇన్నాళ్లు వెయిట్ చేశారని టాక్ నడుస్తోంది. ఇంతకీ ఎవరా డైరెక్టర్? అనే కదా మీ ఆలోచన. అక్కడికే వచ్చేద్దాం.

అతనే డైరెక్టర్ పరశురామ్. తనదైన స్టైల్ సినిమాలు తీస్తూ ఆడియన్స్ మనసు దోచుకున్న ఈయన గత కొంతకాలంగా సైలెంట్ అయిన సంగతి తెలిసిందే. విజయ్ దేవరకొండతో 'గీత గోవిందం' లాంటి బ్లాక్ బస్టర్ సినిమా రూపొందించిన డైరెక్టర్ పరశురామ్, ఆ తర్వాత మరో సినిమా చేయలేదు. చిన్న సినిమా గానే వచ్చి గీత గోవిందం వంద కోట్లు కొల్లగొట్టింది. అయినప్పటికీ ఆ తర్వాత పరశురామ్ మార్క్ కనిపించలేదు.

Prabhas Next Project With Director Parasuram?

దీంతో ఈయనకు ఎవ్వరూ అవకాశాలు ఇవ్వడం లేదని అనుకున్నారంతా. కానీ అసలు విషయం అదికాదని తెలుస్తోంది. కాస్త ఎక్కువ గ్యాప్ తీసుకొని ప్రభాస్ కోసం బలమైన కథ రాసేందుకే ఆయన ఇన్నాళ్లు సమయం కేటాయించాడని, ఇక ఆ కథను ప్రభాస్ చెవిలో వేసేందుకు రెడీ అవుతున్నాడని సమాచారం. సినీ వ‌ర్గాల స‌మాచారం మేర‌కు కొద్ది రోజుల్లోనే ప్ర‌భాస్‌కు పరశురామ్ క‌థ చెప్ప‌బోతున్నాడ‌ట‌. చూడాలి మరి పరశురామ్ కథ విని ప్రభాస్ ఎలా రియాక్ట్ అవుతాడా? అనేది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X