అల్లు అర్జున్ కు హ్యాండ్ ఇచ్చిన ప్రభాస్, కారణం అదేనట!
అల్లు అర్జున్ హీరోగా ప్రముఖ రచయిత వక్కంత వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన 'నా పేరు సూర్య' మూవీ ప్రీ రిలీజ్ వేడుక ఈ నెల 29న హైదరాబాద్ లో జరగబోతోంది. ఈ వేడుకకు రెబల్ స్టార్ ప్రభాస్ ముఖ్య అతిథిగా రానున్నారని వార్తలు వచ్చాయి. కాని ప్రభాస్ దుబాయ్ షూటింగ్ లో ఉండడంతో ఈ ఫంక్షన్ కు రాలేకపోతున్నాడు. కాని నా పేరు సూర్య సినిమాకు సంభంధించి జరిగే మరో ఈవెంట్ కు ప్రభాస్ హాజరు అవుతారని చిత్ర వర్గాలు చెబుతున్నాయి.

కొత్త ట్రెండ్ వస్తోంది
ఇటీవల జరిగిన 'భరత్ ప్రి రిలీజ్' ఈవెంట్‌కి జూ.ఎన్టీఆర్ ముఖ్యఅతిథిగా హాజరైన సందర్భంలో మహేష్ చేసిన ప్రమాణాన్ని మరి కొంతమంది స్టార్లు ఫాలో అవుతున్నారు. ఇప్పటినుండి జరిగే ఫంక్షన్స్ కు స్టార్స్ వస్తారు, ట్రెండ్ మారుతుందని మహేష్ బాబు భరత్ అనే నేను ఫంక్షన్ లో చెప్పడం జరిగింది.

అర్జున్, ప్రభాస్ మంచి ఫ్రెండ్స్
అల్లు అర్జున్ హీరోగా ప్రముఖ రచయిత వక్కంత వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన 'నా పేరు సూర్య' మూవీ ప్రీ రిలీజ్ వేడుక ఈ నెల 29న హైదరాబాద్ లో జరగబోతోంది. ఈ వేడుకకు రెబల్ స్టార్ ప్రభాస్ ముఖ్య అతిథిగా రానున్నారని వార్తలు వచ్చాయి. కాని ప్రభాస్ స్థానంలో చరణ్ ఈ వేడుకకు రాబోతున్నాడని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించడం జరిగింది. ప్రభాస్, అల్లు అర్జున్ మంచి ఫ్రెండ్స్ కావున ప్రభాస్ ఈ ఈవెంట్ కు వస్తాడు అనుకున్నారు అంతా.

రెబెల్ స్టార్ రాలేకపోతున్నాడు
నా పేరు సూర్య యూనిట్ ప్రభాస్ ను ఈ వేడుకకు గెస్ట్ గా పిలవడం జరిగింది, కాని ప్రభాస్ దుబాయ్ షూటింగ్ లో ఉండడంతో ఈ ఫంక్షన్ కు రాలేకపోతున్నాడు. కాని నా పేరు సూర్య సినిమాకు సంభందించి జరిగే మరో ఈవెంట్ కు ప్రభాస్ హాజరు అవుతారని చిత్ర వర్గాలు చెబుతున్నాయి.

మే 4న రిలీజ్
మే 4న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా పై పాజిటివ్ బజ్ ఉంది. అల్లు అర్జున్ పాత్ర ఈ సినిమాలో కొత్తగా చూపించడం జరిగిందని సమాచారం. అను ఇమ్యన్యుల్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో రావ్ రమేష్, అర్జున్, శరత్ కుమార్ వంటి నటులు ముఖ్య పాత్రల్లో కనిపించబోతున్నారు.


Click it and Unblock the Notifications











