Prabhas: మరో లవ్ స్టొరీ ప్లాన్ చేసిన ప్రభాస్.. లైన్ లోకి టాలెంటెడ్ దర్శకుడు.. కాంబో సెట్టయ్యేనా?
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా మార్కెట్ రంగంలో మంచి క్రేజ్ అందుకుంటూ అతి తక్కువ కాలంలోనే నెంబర్ వన్ స్టార్ గా మారిపోయాడు. అద్భుతంగా నటిస్తూ అందరి చేత ఆహా అనిపించే ప్రభాస్.. 20 ఏళ్లుగా టాలీవుడ్ ను ఏలుతూనే ఉన్నారు. ముఖ్యంగా బాహుబలి చిత్రంతో పాన్ ఇండియా స్టార్ గా మారి వరుస చిత్రాలతో దూసుకెళ్తున్నాడు. ఇక బిగ్ బడ్జెట్ సినిమాలు మాత్రమే కాకుండా ప్రభాస్ విభిన్నమైన లవ్ కథలను కూడా సెలెక్ట్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక రీసెంట్ గా మరో దర్శకుడితో లవ్ స్టొరీ చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే..
సాహో, రాధే శ్యామ్ లు ఫ్లాప్ : బాహుబలి తర్వాత వచ్చిన సాహో, రాధే శ్యామ్ లు ఫ్లాప్ గా నిలిచినప్పటికీ.. దాన్ని గురించి పట్టించుకోకుండా పలు ప్రాజెక్టులకు సైన్ చేశారు. ప్రస్తుతం ఓ అరడజను సినిమాల్లో నటిస్తున్నారు. ఆది పురుష్ సినిమా షూటింగ్ పూర్తి అయిపోగా... ప్రాజెక్టు కే, సలార్ వంటి చిత్రాల్లో నటిస్తూ బిజీగా గడుపుతున్నారు. ఈ సినిమాలు ఇంకా పూర్తి కాకముందే మరికొన్ని సినిమాలకు కూడా ఓకే చెప్పారు.

ఆసక్తికరమైన కాంబినేషన్ : మరో రెండు మూడు సినిమాలను ప్రభాస్ లైన్ లో పెట్టుకున్నారు. అందులో సందీప్ రెడ్డి వంగా స్పిరిట్ కూడా ఉంది. ఈ ప్రాజెక్ట్ లో ప్రభాస్ ఒక పోలీస్ గా కనిపించనున్నాడు. ప్రస్తుతం ఆ దర్శకుడు ఎనిమల్ అనే సినిమా చేస్తున్నాడు. దాని తరువాత బన్నీ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసే ఛాన్స్ ఉంది. ఇక ప్రభాస్ స్పిరిట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందనే విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు.

లైన్ లోకి మరో దర్శకుడు : అయితే సీతారామం సినిమా బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టిన టాలెంటెడ్ డైరెక్టర్ హను రాఘవ పూడితో కూడా ప్రభాస్ ఓ సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ దర్శకుడు చెప్పిన కథ, మాట్లాడే తీరు ప్రభాస్ ను చాలా బాగా ఆకట్టుకున్నాయట. ఈ క్రమంలోనే ఆయన హను రాఘవ పూడితో సినిమా తీసేందుకు ఒప్పుకున్నాడట. అయితే హను రాఘవపూడి ప్రభాస్ కోసం రాసిన కథ లవ్ స్టోరీ కమ్ రొమాంటిక్ డ్రామా అని తెలుస్తోంది.

ఆ బిగ్ ప్రొడక్షన్ బ్యానర్లలో : అంతేకాదండోయ్ వీరిద్దరి కాంబోలో రాబోతున్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ నిర్మాతలు మరియు అశ్వినీ దత్ కలిసి నిర్మించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఆ మధ్య ప్రభాస్ ఎక్కువగా యాక్షన్ సినిమాల్లోనే కనిపించడంతో.. ఓ లవ్ స్టోరీ చేయాలనుకున్నారట. ఈ క్రమంలోనే హను రాఘవపూడి లవ్ స్టోరీ చెప్పడం అది డార్లింగ్ కు నచ్చడంతో ఓకే అయినట్లు తెలుస్తోంది. ఈ వార్త కనక నిజం అయితే బాగుండు అని ప్రభాస్ ఫ్యాన్స్ అనుకుంటున్నారు. ఎన్నో రోజులుగా ప్రభాస్ రొమాంటిక్ చిత్రాల్లో కనిపించట్లేదని... సీతారామం లాంటి మరో అద్భుతమైన చిత్రంతో తమ అభిమాన హీరో వస్తే చూడాలని కలలు కంటున్నట్లు చెబుతున్నారు. చూడాలి మరి ఏం జరగనుందో.


Click it and Unblock the Notifications










