ప్రాజెక్టు Kలో అసలు విలన్ ప్రభాసే: ఆ కాలంలో ఒకరు.. ఈ కాలంలో మరొకరు.. ఇదేం ట్విస్టు బాబోయ్!
చాలా కాలం వరకూ ప్రాంతీయ చిత్రాలకే పరిమితమైనా.. బాహుబలి సిరీస్ నుంచి పాన్ ఇండియా రేంజ్‌లో స్టార్‌గా హవాను చూపిస్తున్నాడు యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్. ఇదే ఊపులో వరుస పెట్టి భారీ ప్రాజెక్టులను చేస్తూ ఫుల్ బిజీగా గడుపుతున్నాడు. ఇలా అతడు ప్రస్తుతం నటిస్తోన్న చిత్రాల్లో 'Project K' ఒకటి. పాన్ వరల్డ్ రేంజ్‌లో అత్యంత భారీ బడ్జెట్‌తో రాబోతున్న ఈ మూవీలో ప్రభాస్ క్యారెక్టర్ గురించి ఓ ఆసక్తికరమైన న్యూస్ బయటకు వచ్చింది. ఆ వివరాలను మీరే చూడండి!
ప్రాజెక్టు K అంటూ క్రేజీగా: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న చిత్రమే 'Project K'. వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అశ్వినీదత్ నిర్మిస్తున్న ఈ సినిమాలో కమల్ హాసన్ విలన్‌గా, దీపిక పదుకొణె హీరోయిన్‌గా చేస్తున్నారు. అలాగే, అమితాబ్ బచ్చన్, దిశా పటానీ సహా ఎంతో మంది ప్రముఖులు కీలక పాత్రలు చేస్తున్నారు. ఈ మూవీకి సంతోష్ నారాయణన్ సంగీతం ఇస్తున్నారు.

బ్రేకులతో.. అంతే కంప్లీట్ : 'Project K' మూవీని పాన్ వరల్డ్ రేంజ్‌లో తెరకెక్కిస్తున్నట్లు మొదట్లోనే ప్రకటించారు. అందుకు అనుగుణంగానే దీన్ని హై రేంజ్‌లో తెరకెక్కిస్తున్నారు. ఇక, ఈ సినిమాకు సంబంధించిన రెగ్యూలర్ షూటింగ్‌ను చాలా రోజుల క్రితమే మొదలు పెట్టారు. అప్పటి నుంచి వీలు చిక్కినప్పుడల్లా షెడ్యూళ్లను జరిపారు. ఇలా ఇప్పటికి దాదాపు 50 శాతం వరకే టాకీ పార్టును పూర్తి చేశారు.

అలాంటి స్టోరీ.. భారీ ఖర్చు: హై రేంజ్‌లో రాబోతున్న 'Project K' మూవీని దాదాపు రూ. 600 కోట్లు బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అందుకు తగ్గట్లుగానే భారీ టెక్నికల్ వ్యాల్యూస్‌తో దీన్ని తీస్తున్నారు. అంతేకాదు, ఈ మూవీ టైం ట్రావెల్ స్టోరీతో నడుస్తుందని ముందే రివీలైంది. ఇక, ఇందులో టైం మెషీన్ గతానికి, భవిష్యత్‌కు పయనించే విధంగా ప్రపంచాన్ని సృష్టిస్తున్నారు.
ప్రభాస్ రోల్‌పై పుకార్లతో:పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ - నాగ్ అశ్విన్ కాంబోలో రాబోతున్న 'Project K' మూవీకి సంబంధించిన ఎన్నో రకాల వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఈ సినిమా కథ, ఇందులో ప్రభాస్ పోషిస్తున్న పాత్రల గురించి మరింత ఎక్కువగా ఊహాగానాలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే అతడు విష్ణుమూర్తి అవతారంలో కూడా కనిపించబోతున్నాడని టాక్ వచ్చింది.

అసలు విలన్ ప్రభాసేనా?:అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతోన్న 'Project K' మూవీలో విశ్వ నాయకుడు కమల్ హాసన్ విలన్ కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో ఆయన విలన్‌గా చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే, తాజా సమాచారం ప్రకారం.. ఇందులో విలన్ కమల్ కాదని తెలిసింది. అంతేకాదు, ఇందులో ప్రభాసే నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపిస్తాడని అంటున్నారు.
రెండు కాలాలకు ముడి: వాస్తవానికి 'Project K' సినిమాలో హీరో ప్రభాస్ ఒక్కో కాలంలో ఒక్కో ప్రత్యర్థిని ఎదుర్కొంటాడట. ఇందులో భాగంగానే ఓ సందర్భంలో మరో ప్రభాస్ పాత్రతో అతడు ఫైట్ చేయాల్సి వస్తుందని తెలిసింది. వీళ్లిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు నెక్ట్స్ లెవెల్‌లో ప్లాన్ చేశారని అంటున్నారు. వీళ్ల కాంబో సీన్స్ వల్ల వచ్చే ట్విస్టులు ప్రేక్షకులకు మైండ్ బ్లాక్ చేస్తాయని సమాచారం.


Click it and Unblock the Notifications











