Project K: ఆ దేవుడి పాత్రలో ప్రభాస్.. అచ్చం బాలయ్య చేసినట్లుగానే!
సినిమాల్లోకి అడుగు పెట్టినప్పటి నుంచి ఎన్నడూ లేని విధంగా వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూ జెట్ స్పీడుతో దూసుకుపోతోన్నాడు యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్. పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన తర్వాత నుంచి ఎన్నో భారీ చిత్రాలను ప్రేక్షకులకు అందించిన అతడు.. ఇప్పుడు చేతిలో నాలుదైదు సినిమాలతో బిజీగా గడుపుతున్నాడు. అందులో 'Project K' ఒకటి. 'మహానటి' దర్శకుడు నాగ్ అశ్విన్ డైరెక్షన్‌లో బిగ్ బడ్జెట్‌తో వస్తున్న ఈ సినిమా టైం ట్రావెల్ కాన్సెప్టుతో రాబోతుంది. దీంతో ఈ సినిమాపై ఆరంభం నుంచే అంచనాలు భారీగా ఏర్పడ్డాయి.
భారీ బడ్జెట్‌తో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న 'Project K' సినిమాను పాన్ వరల్డ్ రేంజ్‌తో తీస్తున్నట్లు మొదట్లోనే ప్రకటించారు. అందుకు అనుగుణంగానే దీన్ని హై రేంజ్‌లో తెరకెక్కిస్తున్నారు. ఇక, ఈ సినిమాకు సంబంధించిన రెగ్యూలర్ షూటింగ్‌ను చాలా రోజుల క్రితమే మొదలు పెట్టారు. అప్పటి నుంచి వీలు చిక్కినప్పుడల్లా షెడ్యూళ్లను ప్లాన్ చేసుకుంటూ వస్తున్నారు. ఇలా ఇప్పటికే దాదాపు 50 శాతానికి పైగానే టాకీ పార్టును పూర్తి చేసుకున్నారు. మిగిలిన దాన్ని కూడా త్వరగానే కంప్లీట్ చేసేలా ప్లాన్ చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా దీని నుంచి ఓ న్యూస్ లీకైంది.

'Project K' మూవీ టైం ట్రావెల్ స్టోరీతో రూపొందుతుందని తెలిసిందే. ఇక, ఇందులో ప్రభాస్ పలు పాత్రల్లో కనిపిస్తాడని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం.. ఈ మూవీలో ఓ ఎపిసోడ్‌లో ప్రభాస్ విష్ణుమూర్తి అవతారంలో కనిపించబోతున్నాడట. ఇప్పటికే దీనికి సంబంధించిన షూటింగ్ కూడా కంప్లీట్ అయినట్లు తెలిసింది. ఇదిలా ఉండగా.. 'ఆదిత్య 369' మూవీలో బాలయ్య శ్రీకృష్ణదేవరాయలుగా, ఇప్పటి మనిషిగా కనిపించారు. ప్రభాస్ కూడా ఈ ఎపిసోడ్‌లో అదే రీతిలో ఉంటాడనే టాక్ వినిపిస్తోంది. దీంతో ఈ చిత్రంపై హైప్ పెరుగుతోంది.
క్రేజీ కాన్సెప్టుతో రూపొందుతోన్న 'Project K' సినిమాలో ప్రభాస్ సరసన బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకొనే హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే, బిగ్ బీ అమితాబ్ బచ్చన్ అత్యంత ముఖ్యమైన సైంటిస్ట్ పాత్రను చేస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే, ఈ చిత్రం దిశా పటానీ సహా ఎంతో మంది ప్రముఖులు నటిస్తున్నారు.


Click it and Unblock the Notifications











