రిలీజ్‌కు ముందే లీకైన ‘రాధే శ్యామ్’ స్టోరీ లైన్: అసలు కథ అప్పుడే మొదలు.. ప్రభాస్ అలా పూజా ఇలా!
'ఈశ్వర్' అనే సినిమాతో హీరోగా కెరీర్‌ను ప్రారంభించాడు యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్. సుదీర్ఘ కెరీర్‌లో చేసింది తక్కువ సినిమాలే అయినా.. ఇప్పుడు పాన్ ఇండియా స్టార్‌గా వెలుగొందుతున్నాడు. దీనికి కారణం అతడు ఈ మధ్య కాలంలో చేసిన.. చేస్తున్న సినిమాలన్నీ భారీ ప్రాజెక్టులే కావడమే. ఇప్పటికే 'బాహుబలి', 'సాహో'తో బాక్సాఫీస్‌పై దండయాత్ర చేసిన ఈ స్టార్ హీరో.. ప్రస్తుతం 'రాధే శ్యామ్' అనే సినిమా చేస్తున్నాడు. త్వరలోనే విడుదల కానున్న ఈ సినిమా స్టోరీ లైన్ తాజాగా లీకైంది. దీంతో ప్రభాస్, పూజా హెగ్డే పాత్రల వివరాలు బయటకొచ్చాయి. ఆ సంగతులు మీకోసం!

కెరీర్‌లో తొలిసారి అలాంటి పాత్రలో ప్రభాస్
రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ నటిస్తోన్న చిత్రమే 'రాధే శ్యామ్'. కృష్ణంరాజు సమర్పణలో యువీ క్రియేషన్స్, గోపీకృష్ణా మూవీస్ పతాకాలపై వంశీ, ప్రమోద్, ప్రశీద ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పూజా హెగ్డే హీరోయిన్‌గా చేస్తోంది. జస్టిన్ ప్రభాకరన్ మ్యూజిక్ అందిస్తున్నారు. 1960 దశకం నాటి కథతో రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోందీ సినిమా.

రెండేళ్లు దాటేసింది.. చేయాల్సింది చాలానే
టాలీవుడ్‌లో మిగిలిన హీరోలతో పోలిస్తే ప్రభాస్ సినిమా అంటేనే రెండు మూడేళ్లు పడుతుంది అన్న టాక్ ఇండస్ట్రీలో ఉంది. అందుకు అనుగుణంగానే 'రాధే శ్యామ్' షూటింగ్ ఎప్పుడో ప్రారంభం అయినప్పటికీ.. చిత్రీకరణ మాత్రం ఇంకా పూర్తవలేదు. కీలకమైన కొన్ని సన్నివేశాలతో పాటు వీఎఫ్ఎక్స్ వర్క్స్ కూడా ఆలస్యం అవుతున్నాయి. దీంతో సినిమా విడుదలపై ఆ ప్రభావం పడుతోంది.

ప్రభాస్ అభిమానులకు ప్రేమికులరోజు గిఫ్ట్
'రాధే శ్యామ్' నుంచి సరైన అప్‌డేట్స్ రాకపోవడంపై యంగ్ రెబెల్ స్టార్ ఫ్యాన్స్ ఆగ్రహంగా ఉన్నారు. దీంతో సోషల్ మీడియాలో నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్‌ను ట్రోల్ చేస్తున్నారు. ఇలాంటి సమయంలో ఈ సినిమా టీజర్‌ను ఫిబ్రవరి 14న విడుదల చేశారు. దీనికి ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన వచ్చింది. ఆ తర్వాత ప్రతి పండుగకూ ఒక్కో పోస్టర్‌ను వదులుతున్నారు.

అలాంటి స్టోరీ అంటున్నారు... అంతా రెడీ
వాస్తవానికి 'రాధే శ్యామ్' మూవీ పునర్జన్మల నేపథ్యంతో సాగే కథ అని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. ఇందులో రెండు జన్మలకు సంబంధించిన ప్రేమకథలను చూపించబోతున్నారని అంటున్నారు. ఇదిలా ఉండగా.. ఈ సినిమా బ్యాలెన్స్ పార్టును షూట్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. వచ్చే వారం నుంచే ఈ మూవీ షూటింగ్ పున: ప్రారంభం కానుందని అంటున్నారు.

విడుదలకు ముందే లీకైన ‘రాధే శ్యామ్' స్టోరీ
ఐదు భాషల్లో రాబోతున్న 'రాధే శ్యామ్' మూవీపై ఎన్నో అంచనాలు ఉన్నాయి. అందుకు తగ్గట్లుగానే దీని నుంచి వచ్చే ప్రతి అప్‌డేట్‌కు భారీ స్థాయిలో స్పందన వస్తోంది. దీంతో ఎన్నో ఊహాగానాలు బయటకు వస్తున్నాయి. ఇలాంటి సమయంలోనే ప్రతిష్టాత్మకంగా రానున్న 'రాధే శ్యామ్'లోని ప్రభాస్ - పూజా హెగ్డే పాత్రలకు సంబంధించిన కీలకమైన వివరాలు తాజాగా లీక్ అయ్యాయి.
Recommended Video

కథ అప్పుడే.. ప్రభాస్ అలా పూజా ఇలా!
తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమా పూజా హెగ్డే (ప్రేరణ) మెడికో స్టూడెంట్‌గా నటిస్తుందట. ఓ ప్రమాదంలో గాయాలపాలైన ప్రభాస్ (విక్రమాదిత్య) ఆమె దగ్గర వైద్యం చేయించుకుంటాడని తెలిసింది. ఆ సమయంలోనే వీళ్లిద్దరి మధ్య ప్రేమ పుడుతుందని అంటున్నారు. ఇది గతంలో చాలా సినిమాల్లో చూపించినా.. 'రాధే శ్యామ్'లో చాలా ఫ్రెష్‌గా తెరకెక్కించినట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











