కమల్ కంటే ముందుగా ప్రాజెక్ట్ K కోసం ఆ స్టార్ హీరోను అనుకున్నారా.. మరో ఆసక్తికరమైన టాక్ వైరల్!
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రాజెక్ట్ K సినిమా సిద్ధమవుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా మెజారిటీ షూటింగ్ ఇప్పటికే కంప్లీట్ అయింది. ఫ్యూచరిస్టిక్ కాన్సెప్ట్ తో ఈ చిత్రాన్ని దర్శకుడు సిల్వర్ స్క్రీన్ పై ఆవిష్కరిస్తున్నారు. వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్విని దత్ ఈ చిత్రాన్ని ఏకంగా 600 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.
ఈ సినిమాలో బాలీవుడ్ అమితాబచ్చన్, దీపిక పదుకొనే, దిశాపటాని లాంటి స్టార్ కాస్టింగ్ ఇప్పటికే కీలక పాత్రలలో నటించారు. తాజాగా ఈ సౌత్ ఇండియన్ స్టార్ కమల్ హాసన్ కూడా ప్రాజెక్ట్ Kలో జాయిన్ అయ్యారు. మూవీలో ప్రతి నాయకుడిగా కమల్ హాసన్ కనిపించబోతున్నారు. ఆయన పాత్ర సినిమా మొత్తాన్ని ప్రభావితం చేసే విధంగా ఉంటుందని టాక్ వినిపిస్తోంది.

ఈ చిత్రంలో ప్రతి నాయకుడుగా ముందు సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజినీకాంత్ ని తీసుకోవాలని నాగ్ అశ్విన్ అనుకున్నారంట. అయితే ప్రభాస్ బుజ్జిగాడు సినిమాలో సూపర్ స్టార్ రజినీకాంత్ వీరాభిమానిగా నటించారు. ఈ కారణంగా సూపర్ స్టార్ విలన్ గా చేస్తే ప్రేక్షకులు కనెక్ట్ కారని ప్రభాస్ భావించారంట. దీంతో నాగ్ అశ్విన్ సెకండ్ ఛాయిస్ గా కమల్ హాసన్ అనుకున్నారంట. ఇక చెన్నై వెళ్లి కమల్ హాసన్ ను ప్రత్యేకంగా కలిసి నాగ్ అశ్విన్ ప్రాజెక్ట్ K సినిమా కథని నేరేట్ చేయడం జరిగింది. కమల్ హాసన్ కి కూడా క్యారెక్టర్ బాగా కనెక్ట్ అవ్వడంతో సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తున్న మాట.


Click it and Unblock the Notifications











