Project K: కమల్ హాసన్ పాత్రపై మరో ఆసక్తికరమైన లీక్.. ఎలా ఉండబోతోందంటే?
పాన్ ఇండియా నెంబర్ వన్ స్టార్ గా దూసుకుపోతున్న ప్రభాస్ రాబోయే ప్రాజెక్టులపై మరిన్ని ఆసక్తికరమైన అప్డేట్స్ వస్తున్నాయి. ముఖ్యంగా ప్రాజెక్ట్ K సినిమాపై అంచనాల స్థాయి రోజురోజుకు మరింత పెరుగుతోంది. ఇప్పటికే ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ దీపికా పదుకొనే ఉండడంతో అటు బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా బజ్ గట్టిగానే పెరుగుతోంది.
ఇక ఇప్పుడు తమిళ ఇండస్ట్రీలో కూడా అంచనాల స్థాయి మరింత పెరిగే విధంగా చిత్ర యూనిట్ సభ్యులు కమల్ హాసన్ ను రంగంలోకి దింపడం ఆసక్తిని కలిగించింది. కమల్ హాసన్ ఒక పవర్ఫుల్ పాత్రలో కనిపించబోతున్నాడు అని చిత్ర యూనిట్ అధికారికంగా ఆదివారం రోజు ఒక వీడియో ద్వారా అప్డేట్ ఇచ్చిన విషయం తెలుస్తుంది. ఇక కమల్ హాసన్ కూడా సోషల్ మీడియా ద్వారా ఈ అప్డేట్ విషయంపై క్లారిటీ ఇచ్చాడు.

ఇలాంటి సినిమాలు నటించబోతున్నందుకు చాలా సంతోషంగా ఉంది అని ముఖ్యంగా అమితాబ్ బచ్చన్ తో స్క్రీన్ షేర్ చేసుకుంటునన్నందుకు కూడా ఆనందంగా ఉంది అని ఆయన వివరణ ఇచ్చారు. అయితే కమల్ హాసన్ ఈ సినిమాలో ఎలాంటి పాత్రలో కనిపించబోతున్నాడు అనే విషయంలో కూడా అనేక రకాల గాసిప్స్ అయితే ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఇక కమల్ హాసన్ అయితే ఒక విలన్ పాత్రలోనే కనిపించబోతున్నాడు అని అతని పాత్ర ఊహించని నెగిటివ్ షేడ్ లో ఉంటుంది అని చెబుతున్నారు.

ఒక అద్భుతమైన టెక్నాలజీని కనిపెట్టే పాత్రలో అమితాబ్ బచ్చన్ అలాగే కమల్ హాసన్ మంచి మిత్రులుగా కనిపిస్తారట. అయితే ఊహించిన విధంగా కమల్ హాసన్ ఒక స్వార్థం కోసం ఆ టెక్నాలజీని వాడుకోవాలని అనుకుంటాడంట. అంతేకాకుండా అది లోక వినాశనానికి దారితీస్తుంది అని అమితాబ్ బచ్చన్ అతన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తుంటాడట. ఇక అందుకోసమే ప్రభాస్ రంగంలోకి దింపడంతో ఈ సినిమా ఊహించని మలుపు తిరుగుతుంది అని ఒక టాక్ అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే దర్శకుడు నాగ్ అశ్విన్ మరో అప్డేట్ ఇచ్చేవరకు ఆగాల్సిందే. ఇక ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి తీసుకురావాలని అనుకుంటున్నారు.


Click it and Unblock the Notifications











