Project K సర్‌ప్రైజ్ కూడా రెడీ.. పాన్ వరల్డ్ రేంజ్ కు తగ్గట్టుగా బిగ్ ప్లాన్!
ఫ్యాన్ ఇండియా నెంబర్ వన్ స్టార్ ప్రభాస్ నటించిన ఆదిపురుష్ సినిమా ఇటీవల ఊహించిన విధంగా డిజాస్టర్ అయిన విషయం తెలిసిందే. ఇక ప్రభాస్ తదుపరి సినిమాలతో అయినా బిగ్ సక్సెస్ అందుకోవాలి అని ఫ్యాన్స్ అయితే ఎక్కువగా నమ్మకం పెట్టుకున్నారు. ముఖ్యంగా సలార్ సినిమాతో పాటు ఆ తర్వాత రాబోయే ప్రాజెక్ట్ K కూడా తప్పకుండా బాక్స్ ఆఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది అని మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ అయితే పెరుగుతున్నాయి.
అయితే ప్రాజెక్ట్ కు సంబంధించిన అసలైన అప్డేట్ ఎప్పుడు వస్తుందా అనే ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు సినిమా స్థాయి పెరిగే విధంగా ఒక అద్భుతమైన అప్డేట్ ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తోంది. అందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..

బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసేలా: మహానటి సినిమాతో దర్శకుడుగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న దర్శకుడు నాగ్ అశ్విన్ తెరపైకి తీసుకు వస్తున్న ప్రాజెక్ట్ K తప్పకుండా బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది అని అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 50 వసంతాలు పూర్తి చేసుకున్న వైజయంతి మూవీస్ బ్యానర్ లో ఈ సినిమా తెరపైకి వస్తూ ఉండడంతో మార్కెట్లో కూడా మంచి డిమాండ్ అయితే ఏర్పడింది.
ఆసక్తికరమైన స్టార్ క్యాస్ట్: ప్రాజెక్ట్ K సినిమా సైన్స్ ఫిక్షన్ బ్యాక్ డ్రాప్ లో తెరపైకి రాబోతోంది. ఈ సినిమాలో ప్రభాస్ మూడు విభిన్నమైన షేడ్స్ లో కనిపిస్తాడట. ఇక దీపిక పదుకొనే అతనికి జోడిగా నటిస్తున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ ప్రముఖ నటుడు అమితాబచ్చన్ ప్రభాస్ కు ఒక గురువు పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ సినిమాలో ప్రభాస్ పేరు కృష్ణ అనే పేరుతో మొదలవుతుంది అని కూడా ఆ మధ్య కొన్ని లీక్స్ అయితే వచ్చాయి.

కంటెంట్ కు సంబంధించిన పోస్టర్స్: అయితే ఈ సినిమాకు ఎలాంటి టైటిల్ పెడుతున్నారు అలాగే ఫస్ట్ లుక్ ఎలా ఉండబోతుంది అనే విషయంలో చిత్ర యూనిట్ ఇప్పటివరకు పెద్దగా క్లారిటీ ఇచ్చింది లేదు. అప్పుడప్పుడు కొన్ని ప్రత్యేకమైన రోజులలో మాత్రమే సినిమా కంటెంట్ కు సంబంధించిన పోస్టర్స్ విడుదల చేశారు. ముఖ్యంగా చేతికి సంబంధించిన పోస్టర్లు ఎక్కువగా వచ్చాయి. ఈ సినిమా టైం ట్రావెల్ నేపథ్యంలో ఉంటుంది అని కూడా ముందుగానే దర్శకుడు ఒక క్లారిటీ అయితే ఇచ్చాడు.
అప్డేట్ వచ్చేది అప్పుడే: ఇక లేటెస్ట్ గా వినిపిస్తున్న టాక్ ప్రకారం అయితే ప్రాజెక్ట్ K సినిమా 2024 సంక్రాంతికి విడుదల చేయబోతున్నట్లు ఆ మధ్య అఫీషియల్ గా క్లారిటీ అయితే ఇచ్చారు. అయితే సినిమా ఆ సమయానికి వస్తుందా లేదా అనేది మాత్రం ఇంకా క్లారిటీ రావడం లేదు. లేటెస్ట్ గా అయితే చిత్ర యూనిట్ సభ్యులు ఆ విషయంలో కూడా పూర్తిస్థాయిలో ఒక నిర్ణయానికి వచ్చి జూలై రెండవ వారంలో అధికారికంగా మోషన్ పోస్టర్ విడుదల చేయాలి అని అనుకుంటున్నారు.

అక్కడ గ్రాండ్ గా రిలీజ్ చేసేలా ప్లాన్: సినిమా టైటిల్ తో పాటు అలాగే ప్రభాస్ ఫస్ట్ లుక్ ను కూడా ఆ మోషన్ పోస్టర్లో విడుదల చేయాలని దర్శకుడు నాగ్ అశ్విన్ అలాగే నిర్మాత సి అశ్విని దత్ కూడా ప్రణాళికలు రచిస్తున్నారు. అయితే ఈ సినిమాను ఫ్యాన్ వరల్డ్ మూవీగా నిర్మిస్తున్నట్లు కూడా ముందుగానే నిర్మాత తెలియజేశారు.
ఇక అందుకు తగ్గట్టుగా ఉండేలా మోషన్ పోస్టర్ను అమెరికాలో గ్రాండ్ గా విడుదల చేయాలని ఆలోచిస్తున్నారు. త్వరలోనే ఈ విషయంలో ముందుగానే ఒక ప్రకటన అయితే రానున్నట్లు తెలుస్తోంది. ఇక మోషన్ పోస్టర్లు మాత్రం జూలై రెండో వారం లేదా మూడో వారంలో విడుదల చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











