twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ప్రభాస్ అభిమానులకు గుడ్ న్యూస్.. రాధేశ్యామ్ ఫస్ట్ సాంగ్ ఎప్పుడంటే..?

    |

    రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులకు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్న సినిమాల్లో రాధేశ్యామ్ ఒకటి. ఈ సినిమా సెట్స్ పైకి వచ్చి దాదాపు రెండున్నర ఏళ్లు అవుతోంది. సాహో సినిమా సమయంలోనే సినిమాను గ్రాండ్ గా స్టార్ట్ చేశారు. అయితే సినిమా అప్ డేట్స్ ఇవ్వడంలో మాత్రం ఈ చిత్ర యూనిట్ సభ్యులు చాలా నెమ్మదిగా అడుగులు వేస్తున్నారు. యూవీ క్రియేషన్స్ ఏ నిర్ణయాన్ని కూడా తొందరగా తీసుకోవడం లేదని అభిమానులు ఆ మధ్య తీవ్ర స్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేశారు. యూవీ క్రియేషన్స్ ను బ్యాన్ చేయాలి అంటూ సోషల్ మీడియాలో ఒక ట్యాగ్ ను కూడా వైరల్ చేశారు.

    ఒక విధంగా యు.వి.క్రియేషన్స్ పై అభిమానులు కాస్త ఆగ్రహంతో ఉన్నారని చెప్పాలి. ఇక వారి కోపాన్ని చల్లార్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ పెద్దగా వర్కౌట్ అయితే అవ్వడం లేదు. రాధేశ్యామ్ సినిమా విషయంలో ఇప్పటివరకు పెద్దగా అంచనాలు క్రియేట్ చేసే విధంగా అప్డేట్ అయితే ఇవ్వలేదు ఎలాంటి సర్ ప్రైజ్ ఇచ్చినా కూడా అభిమానుల అంచనాలను అందుకోలేక పోతున్నాయి. ఈసారి మాత్రం ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా అందరికీ నచ్చేలా ట్రీట్ ఇవ్వాలని అనుకుంటున్నారు. రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయ్యింది. ఇక సినిమాకు సంబంధించిన మొదటి పాటను ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా అక్టోబర్ 23న విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

    Prabhas radhe shyam first song release date almost finalized

    జస్టిన్ ప్రభాకరన్ సంగీత సారథ్యంలో మొదటి పాటను కంపోజ్ చేశారు. సిద్ శ్రీరామ్ ఆ పాటను పాడినట్లు సమాచారాన్ని. దాదాపు అన్ని పాటలు కూడా ఫైనల్ అయినట్లు తెలుస్తోంది. మరొక మూడు పాటలను హిందీ సంగీత దర్శకులతో కంపోజ్ చేయించినట్లు తెలుస్తోంది. అనుకున్న సమయానికి ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేయాలని అనుకుంటున్నారు. ఆ పాట కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇక సినిమాను ఇదే ఏడాది విడుదల చేయాలని అనుకున్నారు. కానీ పరిస్థితుల ప్రభావం వలన వచ్చే ఏడాదికి షిఫ్ట్ చేయాల్సి వచ్చింది. పోటీ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పటికీ 2022 సంక్రాంతి బరిలోనే రిలీజ్ చేసేందుకు డిసైడ్ అయిన విషయం తెలిసిందే.

    రాధేశ్యామ్ జనవరి 14న ఈ సినిమా విడుదల కానుంది. ఇక అదే సమయంలో పవన్ కళ్యాణ్ రానా భీమ్లా నాయక్, మహేష్ బాబు సర్కారు వారి పాట, వెంకటేష్ వరుణ్ తేజ్ ఎఫ్3 సినిమాలు కూడా విడుదల కానున్నాయి. పోటీ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పటికీ అదే తేదీన ఫిక్స్ చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. మరి సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయిలో విజయాన్ని అందుకుంటుందో చూడాలి. ఇక ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా మరొక ముఖ్యమైన పాత్రలో కృష్ణంరాజు నటిస్తున్నారు. ఇక 2022 లోనే ప్రభాస్ నుంచి సలార్ సినిమా అలాగే ఆదిపురుష్ సినిమా పాన్ ఇండియా స్థాయిలోనే విడుదల కాబోతున్న విషయం తెలిసిందే.

    English summary
    Prabhas radhe shyam first song release date almost finalized
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X