ప్రభాస్ రేంజ్ అంటే ఆ మాత్రం ఉండాలిగా.. చివరి సీన్ కోసం భారీగా..
టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి అనంతరం ఏ స్థాయిలో క్రేజ్ అందుకుంటున్నాడో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. సాహో సినిమా అనుకున్నంత రేంజ్ లో సక్సెస్ కాకపోయినప్పటికి ఇంకా అదే క్రేజ్ మెయింటైన్ చేస్తున్నాడు. రాబోయే రాధేశ్యామ్ సినిమాపై అంచనాలు అయితే భారీగానే ఉన్నాయి. గతంలో ఎప్పుడు లేని విదంగా ప్రభాస్ చాలా కొత్తగా కనిపించబోతున్నట్లు అర్ధమయ్యింది.
అసలు మ్యాటర్ లోకి వస్తే సినిమాకు సంబంధించిన ఫైనల్ షెడ్యూల్ తో ప్రభాస్ బిజీగా ఉన్నాడు. సినిమా క్లైమాక్స్ ను భారీగా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఒక్క సీన్ కోసం నాలుగు రకాల సెట్స్ ను క్రియేట్ చేశారట. చివరి అరగంట సినిమా ట్విస్ట్ అలాగే మేకింగ్ స్టైల్ నెవర్ బిఫోర్ అనేలా ఉంటుందని టాక్ అయితే వస్తోంది.

ఇక ప్రభాస్ స్థాయికి తగ్గట్లుగా మరోసారి యూవీ క్రియేషన్స్ ఖర్చుకు వెనకడకుండా డేర్ చేస్తున్నారు. రామోజీ ఫిల్మ్ సిటీలో ఒకదాని పక్కన మరొకటి దగ్గరగా ఉండేలా నాలుగు రకాల డిఫరెంట్ సెట్స్ ను నిర్మించినట్లు తెలుస్తోంది.
ఆర్ట్ డిపార్ట్మెంట్ గత నెల రోజులకు పైగా కష్టపడి సెట్స్ ని నిర్మించారట. సినిమాలో క్లైమాక్స్ అద్భుతంగా ఉండాలని విజువల్ ఎఫెక్ట్స్ కి అనుగుణంగా సెట్స్ ను నిర్మించినట్లు సమాచారం. మరి ఆ సీన్స్ ఎంతవరకు ఆకట్టుకుంటాయో చూడాలి.


Click it and Unblock the Notifications











