Radhe Shyam Story: రిలీజ్‌కు ఒక్కరోజు ముందు స్టోరీ లీక్.. ఆ రెండు ప్రమాదాలే హైలైట్‌గా!

గతంతో పోలిస్తే ఈ మధ్య కాలంలో తెలుగు సినీ ఇండస్ట్రీలో భారీ నుంచి అతి భారీ చిత్రాలు వస్తున్నాయి. దీనికి కారణం ఇప్పుడు మన సినిమా స్థాయి విస్తృతం అవడమే. ఇలా ఇప్పటికే ఎన్నో చిత్రాలు ప్రేక్షకులను అలరించాయి. మరికొన్ని విడుదలయ్యేందుకు రెడీగా ఉన్నాయి. అలాంటి వాటిలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన 'రాధే శ్యామ్' ఒకటి.

విడుదలకు ముందే ఎన్నో అంచనాలను ఏర్పరచుకున్న ఈ సినిమా.. శుక్రవారమే (మార్చి 11) ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీకి సంబంధించిన కథ బయటకు వచ్చింది. విడుదలకు ఒక్కరోజు ముందే ఇలా జరగడంతో ఇప్పుడిది హాట్ టాపిక్ అవుతోంది. అసలేం జరిగింది? ఆ సంగతులేంటో చూద్దాం పదండి!

రాధే శ్యామ్‌ అంటూ వస్తున్నాడు

రాధే శ్యామ్‌ అంటూ వస్తున్నాడు

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా రాధాకృష్ణ కుమార్‌ రూపొందించిన చిత్రమే 'రాధే శ్యామ్'. దీన్ని కృష్ణంరాజు సమర్పణలో యువీ క్రియేషన్స్‌, గోపీకృష్ణా మూవీస్‌ పతాకాలపై వంశీ, ప్రమోద్‌, ప్రశీద నిర్మిస్తున్నారు. పూజా హెగ్డే హీరోయిన్‌గా చేస్తున్న ఈ మూవీని ఐదు భాషల్లో విడుదల చేస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ జ్యోతిష్యుడిగా నటిస్తోన్న సంగతి తెలిసిందే.

రికార్డులు బ్రేక్.. భారీ అంచనాలు

రికార్డులు బ్రేక్.. భారీ అంచనాలు

'రాధే శ్యామ్' మూవీ నుంచి చాలా కాలం వరకూ అప్‌డేట్లు రాలేదు. దీంతో ఫ్యాన్స్ నిర్మాణ సంస్థపై దాడులు చేశారు. దీంతో తేరుకున్న యూనిట్ సభ్యులు టీజర్, ట్రైలర్, పోస్టర్లు, పాటలు ఇలా గ్యాప్ లీకుండా విడుదల చేశారు. వీటన్నింటికీ భారీ రెస్పాన్స్ వచ్చింది. దీంతో రికార్డులు కూడా చాలా వరకూ బ్రేక్ అయ్యాయి. ఫలితంగా ఈ సినిమా అంచనాలు భారీగా నెలకొన్నాయి.

 భారీగా బిజినెస్... మూడో స్థానం

భారీగా బిజినెస్... మూడో స్థానం

భారీ బడ్జెట్‌తో ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న 'రాధే శ్యామ్' మూవీ నుంచి ఏది విడుదలైనా మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఈ సినిమా హక్కులకు అన్ని ప్రాంతాల్లో భారీ డిమాండ్ ఏర్పడింది. అందుకు అనుగుణంగానే అన్ని ఏరియాల రైట్స్ కలిపి రూ. 202.80 కోట్లకు అమ్ముడయ్యాయి. దీంతో ఎక్కువ బిజినెస్ చేసుకున్న చిత్రాల జాబితాలో మూడో స్థానానికి చేరుకుంది.

గ్రాండ్ రిలీజ్.. ఇదీ రికార్డులతో

గ్రాండ్ రిలీజ్.. ఇదీ రికార్డులతో

పాన్ ఇండియా రేంజ్‌లో తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో రాబోతున్న 'రాధే శ్యామ్' మూవీని గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నారు. ఇక, ఇది తెలుగు రాష్ట్రాల్లో 900 థియేటర్లలో, తమిళనాడులో 175, కర్నాటకలో 185, కేరళలో 150, హిందీ రెస్టాప్ ఇండియాలో 2200, ఓవర్సీస్‌లో 3400 థియేటర్లలో కలిపి మొత్తంగా 7010 థియేటర్లలో విడుదల కాబోతుంది.

రిలీజ్ ముందే లీకైన మూవీ కథ

రిలీజ్ ముందే లీకైన మూవీ కథ

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన 'రాధే శ్యామ్' మూవీ లవ్ అండ్ డెస్టినీ ఆధారంగా రూపొందిన విషయం తెలిసిందే. విధి ఆడే వింత నాటకం నుంచి హీరో తమ ప్రేమను ఎలా గెలిపించుకున్నాడన్న కాన్సెప్టుతో ఈ మూవీ రూపొందింది. ఇక, ఈ సినిమా శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా సినిమా కథ ఇదేనంటూ ఓ న్యూస్ లీకైంది.

 ఆ రెండు ప్రమాదాలే ప్రధానంగా

ఆ రెండు ప్రమాదాలే ప్రధానంగా

తాజా సమాచారం ప్రకారం.. 'రాధే శ్యామ్' మూవీ రెండు ప్రమాదాలు ప్రధానంగా చేసుకుని రూపొందినట్లు తెలిసింది. స్వతహాగా జోతిష్యుడు అయిన హీరోకు భవిష్యత్ గురించి తెలుస్తుంది. దీని ద్వారానే ఒక సందర్భంలో ట్రైన్ ప్రమాదం నుంచి.. మరో సందర్భంలో ఓడ ప్రమాదం నుంచి హీరోయిన్‌ను కాపాడుతాడట. ఈ రెండు ఎపిసోడ్లు సినిమాకే హైలైట్‌గా నిలుస్తాయని టాక్.

సీట్లలో కూర్చోలేనంత టెన్షన్‌గా

సీట్లలో కూర్చోలేనంత టెన్షన్‌గా

'రాధే శ్యామ్'లో ఇంటర్వెల్ ముందు వచ్చే మిస్టరీ ట్రైన్ సీక్వెన్స్ హైలైట్‌గా ఉంటుందట. అలాగే, క్లైమాక్స్‌లో వచ్చే ఓడ ప్రమాదం కూడా విజువల్ వండర్‌గా ఉంటుందని తాజాగా తెలిసింది. అంతేకాదు, ఈ రెండు ఎపిసోడ్స్ వచ్చినప్పుడు ప్రేక్షకుల సీట్లలో కూర్చోలేనంత ఉత్కంఠ ఉంటుందని తెలుస్తోంది. మొత్తంగా ఈ మూవీ విధిని ఎదిరించే ప్రేమకథతో రాబోతుందన్న మాట.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X