Don't Miss!
- News
తీన్మార్ మల్లన్న అరెస్ట్.. జీవో రద్దు చేసేవరకు పోరాడుతాం: మల్లన్న
- Sports
IPL 2022: తూ.. దీనమ్మ జీవితం..ఫైనల్‌కు పోయిన ఆనందం కూడా లేదు!
- Finance
తెలంగాణలో యూరియా ప్లాంట్‌ను తెరిపించింది మేమే: మోడీ: రూ.8 లక్షల కోట్లు
- Automobiles
భారతదేశంలోకి రావాలంటే మా కండిషన్స్ ఇవి: టెస్లా సీఈఓ ఎలోన్ మస్క్
- Lifestyle
'ఈ' టీ తాగడం వల్ల మీ గుండెను సురక్షితంగా ఉంచుకోవచ్చు అని మీకు తెలుసా?
- Technology
Xiaomi Pad 6 లాంచ్ వివరాలు వచ్చేసాయి ! స్పెసిఫికేషన్లు చూడండి
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
Radhe Shyam Release Date: ప్రభాస్ ఫ్యాన్స్‌కు పండగ లాంటి వార్త.. అదే జరిగితే ఆరోజే విడుదల
తెలుగు సినీ ఇండస్ట్రీలో తనదైన సినిమాలతో హవాను చూపించి.. చాలా తక్కువ సమయంలోనే స్టార్ స్టేటస్‌ను సొంతం చేసుకున్నాడు ప్రభాస్. ఈ క్రమంలోనే దర్శకధీరుడు రాజమౌళి రూపొందించిన 'బాహుబలి' తర్వాత ఏకంగా పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. అప్పటి నుంచి వెనుదిరిగి చూసుకోని ఈ స్టార్ హీరో.. వరుసగా భారీ చిత్రాల్లోనే నటిస్తూ సత్తా చాటుతున్నాడు. అంతేకాదు, సినిమాల మీద సినిమాలను ప్రకటిస్తూ ముందుకు వెళ్తున్నాడు. ఇందులో భాగంగానే తాజాగా అతడు 'రాధే శ్యామ్' అనే సినిమాలో నటించాడు. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్ గురించి ఓ న్యూస్ బయటకు వచ్చింది. ఆ వివరాలు మీకోసం!

రాధే శ్యామ్ అంటోన్న ప్రభాస్
రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన చిత్రమే 'రాధే శ్యామ్'. దీన్ని కృష్ణంరాజు సమర్పణలో యువీ క్రియేషన్స్, గోపీకృష్ణా మూవీస్ పతాకాలపై వంశీ, ప్రమోద్, ప్రశీద నిర్మిస్తున్నారు. పూజా హెగ్డే హీరోయిన్గా చేస్తున్న ఈ మూవీని ఐదు భాషల్లో విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ జ్యోతిష్యుడిగా నటిస్తోన్న సంగతి తెలిసిందే.
పూర్తి నగ్నంగా ఉన్న ఫొటో షేర్ చేసిన హీరోయిన్: ఒక్కసారిగా బెడ్ మీద అలా కనిపించడంతో!

అంచనాలకు తగ్గట్లే బిజినెస్
'రాధే శ్యామ్' మూవీ నుంచి అప్డేట్లు అంతగా రాలేదనే చెప్పాలి. దీంతో చిత్ర యూనిట్‌పై ప్రభాస్ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఆ మధ్య టీజర్, ఆ తర్వాత ప్రతి పండుగకూ ఒక పోస్టర్ చొప్పున వదిలారు. వీటి వల్ల సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. దీంతో ఈ చిత్రానికి రికార్డు స్థాయిలో బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

ట్రైలర్‌తో నేషనల్ రికార్డులు
ఫీల్ గుడ్ థ్రిల్లర్‌గా, ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన 'రాధే శ్యామ్' మూవీ నుంచి కొద్ది రోజుల క్రితమే ట్రైలర్‌ను విడుదల చేశారు. దీనికి ప్రభాస్ అభిమానులతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన వచ్చింది. దీంతో తెలుగులో ఎక్కువ మంది వీక్షించిన ట్రైలర్‌గా ఇది రికార్డు సాధించింది. అంతేకాదు, ఇండియాలోనే నెంబర్ వన్‌గా నిలిచింది.
బిడ్డకు పాలు పడుతోన్న ఫొటోను షేర్ చేసిన శ్రీయ: ఇలాంటివి కూడా వదులుతారా అంటూ దారుణంగా!

వాయిదా పడిపోయిన మూవీ
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన 'రాధే శ్యామ్' మూవీని సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ గతంలో ప్రకటించింది. కానీ, కరోనా కేసులు భారీ స్థాయిలో పెరుగుతోన్న నేపథ్యంలో దీన్ని వాయిదా వేశారు. విడుదలకు పది రోజుల ముందే అధికారికంగా ప్రకటించారు. అయితే, మళ్లీ ఎప్పుడు విడుదల చేస్తామన్న దానిపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు.

రాధే శ్యామ్ కొత్త రిలీజ్ డేట్
క్రేజీ కాంబినేషన్లో రూపొందిన 'రాధే శ్యామ్' మూవీ వాయిదా పడడంతో ప్రభాస్ అభిమానులతో పాటు సినీ ప్రియులంతా నిరాశగా ఉన్నారు. దీంతో ఇది ఎప్పుడు విడుదల అవుతుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్ బయటకు వచ్చింది. దీని ప్రకారం.. ఈ సినిమాను మార్చి 17న ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తారట.
ప్రియుడితో శృతి హాసన్ రచ్చ: ఎదపై హత్తుకుని ఘాటుగా.. పిచ్చ హాట్ ఫొటోను షేర్ చేసిన హీరోయిన్

అదే జరిగితే ఆరోజే విడుదల
'రాధే శ్యామ్' మూవీని మార్చి 17న విడుదల చేయాలని చిత్ర యూనిట్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అయితే, అప్పటికి కరోనా కేసులు తగ్గడంతో పాటు అన్ని ఏరియాల్లో థియేటర్లు వంద శాతం ఆక్యూపెన్సీతో రన్ అయితేనే రిలీజ్ చేస్తారట. అందుకు అనుగుణంగానే పరిస్థితులను చూసిన తర్వాతనే ఈ తేదిని ప్రకటిస్తారని, లేకుంటే సైలెంట్‌గా ఉంటారని తెలిసింది.