twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Prabhas: రాధేశ్యామ్ నుంచి మరో సర్‌ప్రైజ్.. సెకండ్ ట్రైలర్ రాబోయేది ఎప్పుడంటే?

    |

    పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నుంచి రాబోతున్న బిగ్గెస్ట్ లవ్ అడ్వెంచర్ మూవీ రాధేశ్యామ్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ సినిమాకు సంబంధించిన ప్రతి అంశం కూడా ఇప్పటికే ఇంటర్నెట్ ప్రపంచంలో వైబ్రేషన్స్ ని క్రియేట్ చేశాయి. సంక్రాంతికి రావాల్సిన ఈ సినిమా కరోనా కారణంగా వాయిదా పడింది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సారి అనుకున్న సమయానికి విడుదల చేయాలని చిత్ర నిర్మాతలు ప్రణాళికలు రచిస్తున్నారు. అయితే మరొకసారి సినిమాకు సంబంధించిన మరొక ట్రైలర్ ను కూడా విడుదల చేయాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఇక ఆ ట్రైలర్ 2 ఎప్పుడు రాబోతోంది అనే వివరాల్లోకి వెళితే..

    ఆ పాత్రతో..

    ఆ పాత్రతో..

    బాహుబలి సాహో సినిమాల అనంతరం ప్రభాస్ నుంచి వస్తున్న విభిన్నమైన లవ్ స్టొరీ రాధేశ్యామ్ కూడా బాక్సాఫీస్ వద్ద సరికొత్త సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది అని అభిమానులు ఎంతగానో నమ్ముతున్నారు. ప్రభాస్ కూడా ఒక ప్రేమ కథను చేసి చాలా కాలం అవుతుంది. జిల్ దర్శకుడు రాధాకృష్ణ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. అంతే కాకుండా మరొక ముఖ్యమైన పాత్రలో ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు కూడా నటించారు. ఈ సినిమాలో ఆయన పాత్రతో కథలో ఒక్కసారిగా మలుపు తిరిగే ఎపిసోడ్ హైలెట్ గా ఉంటుందట.

     చివరి నిమిషంలో వాయిదా

    చివరి నిమిషంలో వాయిదా

    ఇక ఈ సినిమాను మార్చి 11వ తేదీన విడుదల చేయబోతున్నారు. సంక్రాంతికి విడుదల చేయాలని ఎంతగానో ప్రయత్నం చేసిన నిర్మాతలకు చివరి నిమిషంలో చేదు అనుభవం ఎదురయింది.

    భారీగా ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించడమే కాకుండా మంచి ట్రైలర్ ను కూడా విడుదల చేసిన చిత్ర యూనిట్ సినిమాపై మొత్తానికి మంచి హైప్ ఐతే క్రియేట్ చేయ గలిగింది. కానీ కరోనా కారణంగా అప్పుడే సినిమాను వాయిదా వేసుకోవలసి వచ్చింది.

    భారీ స్థాయిలో ఓపెనింగ్స్

    భారీ స్థాయిలో ఓపెనింగ్స్

    ఇక ఫైనల్ గా సినిమాను మార్చి 11వ తేదీన విడుదల చేయబోతున్నారు ఆ సమయంలో మిగతా సినిమాల నుంచి కూడా ఎటువంటి పోటీ లేదు. కాబట్టి బాక్సాఫీస్ వద్ద ప్రభాస్ మరోసారి భారీ స్థాయిలో ఓపెనింగ్స్ అందుకునే అవకాశం ఉంది. మొదటిరోజు 100కోట్ల గ్రాస్ రావచ్చని సమాచారం. కేవలం తెలుగు ప్రేక్షకులకు మాత్రమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఎంతోమంది ప్రభాస్ అభిమానులు ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. నార్త్ ఇండస్ట్రీలో కూడా సినిమా భారీ స్థాయిలో ఓపెనింగ్స్ అందుకునే అవకాశం ఉన్నట్లు టాక్.

    సెకండ్ ట్రైలర్ ఎప్పుడంటే?

    సెకండ్ ట్రైలర్ ఎప్పుడంటే?

    అయితే సినిమాను సంక్రాంతికి విడుదల చేయాలని అనుకున్నప్పుడు ఒక అద్భుతమైన ట్రైలర్ ద్వారా ప్రేక్షకులకు విజువల్ ట్రీట్ ఇచ్చారు. అయితే ఇప్పుడు మరొకసారి సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేసే విధంగా రెండవ ట్రైలర్ ను కూడా రెడీ చేస్తున్నట్లు తెలుస్తోంది. మార్చి ఫస్ట్ వీక్ లోనే విడుదల చేయబోయే ఆ ట్రైలర్ కూడా రెండు నిమిషాలకు పైగానే ఉంటుందట. తెలుగు తమిళ్ మలయాళం కన్నడ హిందీ భాషల్లో ఎప్పటిలానే విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. మరి సెకండ్ ట్రైలర్ ఎలాంటి బజ్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

    English summary
    prabhas Radhe shyam movie second trailer release details,
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X