Radhe Shyam OTT రిలీజ్ డేట్.. అనుకున్న డేట్ కంటే ముందుగానే.. షాకింగ్ డిసిషన్?
రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన మూడవ పాన్ ఇండియా సినిమా రాధే శ్యామ్ ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను యూవీ క్రెయేషన్స్ అత్యంత భారీ బడ్జెట్తో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చింది. అయితే ఈ సినిమా విడుదలకు ముందే మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేసినప్పటికీ విడుదల తర్వాత మాత్రం అంచనాలను అందుకోలేకపోయింది. పూర్తిస్థాయిలో అభిమానులను ఆకట్టుకునే లేకపోయిన రాధే శ్యామ్ మిగతా భాషల్లో అయితే చాలా తక్కువ స్థాయిలో కలెక్షన్స్ అందుకుంటోంది. ఇక ఈ సినిమా ఓటీటీ విడుదలపై చిత్ర యూనిట్ సభ్యులతో ఇటీవల అమెజాన్ ప్రైమ్ మరొకసారి చర్చ జరిపినట్లుగా తెలుస్తోంది. ముందుగా చేసుకున్న ఒప్పందం కంటే ముందే ఈ సినిమా ఓటీటీ లో విడుదల అయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఆ వివరాల్లోకి వెళితే..

మిగతా భాషల్లో..
ప్రభాస్ పూజ హెగ్డే మొదటిసారి కలిసి నటించిన సినిమా కావడంతో కేవలం మాస్ ఆడియన్స్ లోనే కాకుండా ఈ సినిమా క్లాస్ ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలను క్రియేట్ చేసింది. ఇక సినిమా విడుదల తర్వాత ప్యూర్ లవ్ స్టోరీగా ఓ వర్గం ప్రేక్షకులను మాత్రమే ఆకట్టుకోగలిగింది. తెలుగులో అయితే ఓపెనింగ్స్ బాగానే వచ్చాయి. కానీ మలయాళం తమిళం లో మాత్రం ప్రభాస్ గతంలో మాదిరిగా మంచి ఓపెనింగ్స్ అయితే అందుకోలేకపోయాడు. ఇక హిందీలో అయితే అనుకున్న దానికంటే చాలా తక్కువ కలెక్షన్స్ వచ్చాయి.

సినిమా కోసం స్పెషల్ గా..
సినిమాపై మొదటి నుంచి కూడా అంచనాలు అంతకంతకూ పెరుగుతూనే వచ్చాయి. ముఖ్యంగా విడుదల చేసిన రెండు ట్రైలర్స్ కూడా యూట్యూబ్ లో సరికొత్త రికార్డులను క్రియేట్ చేశాయి. అంతేకాకుండా సినిమాలోని స్పెషల్ సాంగ్స్ కోసం భారీగా ఖర్చు చేశారు. ప్రతీ భాషలో కూడా పాటలు హైలెట్ అయ్యే విధంగా విభిన్నమైన సంగీత దర్శకులతో కంపోజ్ చేయించారు. ఇక బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అద్భుతంగా ఉండాలని చివరి క్షణంలో థమన్ ను రంగంలోకి దిగిన విషయం తెలిసిందే. సినిమా కోసం కావాల్సిన ప్రయోగాలు అన్ని చేశారు.

నెగిటివ్ టాక్..
ఇక సినిమా థియేటర్ లోకి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. రివ్యూలు కూడా చాలావరకు నెగిటివ్ గానే వచ్చాయి. ఇక బాలీవుడ్ లో అయితే ఎప్పుడూ లేని విధంగా ప్రభాస్ సినిమా పై ఊహించని విధంగా నెగిటివ్ కామెంట్స్ కూడా వస్తున్నాయి. సాహో సినిమా లో యాక్షన్ ఎపిసోడ్స్ తో పాటు మంచి స్క్రీన్ ప్లే ఉండడంతో హిందీలో 100 కోట్ల వసూళ్లను అందుకుంది. కానీ ఇప్పుడు రాధే శ్యామ్ లవ్ స్టోరీ కావడంతో అక్కడ అంతగా వర్కౌట్ కాలేదు.

తొందరగానే ఓటీటీలో..
హిందీలో 50 కోట్ల బిజినెస్ చేసిన రాదే శ్యామ్ బాక్సాఫీస్ టార్గెట్ను పూర్తి చేస్తుంది అనే నమ్మకం కూడా లేదు. ఇక ఈ తరుణంలో అమెజాన్ ప్రైమ్ సినిమాను అనుకున్న డీల్ ప్రకారం కంటే కూడా తొందరగానే ఓటీటీలో విడుదల చేసే విధానంగా యూవీ క్రియేషన్స్ తో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అసలైతే అమెజాన్ ప్రైమ్ లో రాధే శ్యామ్ సినిమా ఏప్రిల్ రెండో వారంలో విడుదల కావాలని డీల్ సెట్ చేసుకున్నారు.
Recommended Video


ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్
కానీ ప్రస్తుతం సినిమా టాక్ ప్రకారం కలెక్షన్ ఊహించిన స్థాయిలో తక్కువగా వస్తున్నాయి. బ్రేక్ ఈవెన్ అందుకునే అవకాశమే లేదు. దానికి తోడు ఈ నెలలోనే RRR సినిమా వస్తుంది కాబట్టి ఆ హడావుడిలో రాధే శ్యామ్ దాదాపు సైలెంట్ అయిపోవాల్సిందే. కాబట్టి ముందు అనుకున్న దాని కంటే కాస్త ఎక్కువ అమౌంట్ ఇచ్చి ఉగాది సందర్భంగా ఏప్రిల్ 2వ తేదీన విడుదల చేయాలని అని అమెజాన్ ప్రైమ్ ఆలోచిస్తున్నట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











