‘రాధే శ్యామ్’ రిలీజ్ డేట్ ప్రకటించకపోవడానికి కారణం ఇదే: ప్రభాస్ టీజర్ కూడా అందుకే ఆలస్యం

తెలుగు హీరోగా కెరీర్‌ను మొదలు పెట్టి పాన్ ఇండియా స్టార్‌గా వెలుగొందుతున్నాడు యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్. సీనియర్ హీరో కృష్ణంరాజు కుటుంబం నుంచి సినిమాల్లోకి ప్రవేశించిన అతడు కెరీర్ ఆరంభంలోనే పలు విజయాలను అందుకుని స్టార్ హీరోగా ఎదిగిపోయాడు. ఈ క్రమంలోనే దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన 'బాహుబలి'తో యూనివర్శల్ స్టార్ అయిపోయాడు. అప్పటి నుంచి వరుసగా భారీ చిత్రాల్లోనే నటిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అతడు నటిస్తోన్న 'రాధే శ్యామ్' రిలీజ్ డేట్‌పై క్లారిటీ రావడం లేదు. తాజాగా దీనికి సంబంధించిన కారణం లీకైంది. వివరాల్లోకి వెళ్తే..

ఆ రెండే ప్రభాస్ స్టామినాను నిరూపించాయి

ఆ రెండే ప్రభాస్ స్టామినాను నిరూపించాయి

'బాహుబలి' సినిమాతో ఇండియా మొత్తం ప్రభాస్ పేరు మారుమ్రోగిపోయింది. ఈ మూవీ ఇచ్చిన జోష్‌తో తన తర్వాతి సినిమా 'సాహో'ను కూడా పాన్ ఇండియా రేంజ్‌లో విడుదల చేశాడు. తెలుగుతో సహా దక్షిణాది భాషల్లో ఆకట్టుకోలేకపోయిన ఈ మూవీ.. హిందీలో మాత్రం సత్తా చాటింది. అక్కడ సూపర్ హిట్ టాక్‌తో పాటు కలెక్షన్ల పరంగా దుమ్ము దులిపి రికార్డులు క్రియేట్ చేసింది.

కెరీర్‌లో తొలిసారి అలా.. కొత్త రోల్‌లో ప్రభాస్

కెరీర్‌లో తొలిసారి అలా.. కొత్త రోల్‌లో ప్రభాస్

ప్రభాస్ ప్రస్తుతం 'జిల్' ఫేం రాధాకృష్ణ కుమార్‌ దర్శకత్వంలో 'రాధే శ్యామ్' అనే మూవీ చేస్తున్నాడు. దీన్ని కృష్ణంరాజు సమర్పణలో యువీ క్రియేషన్స్‌, గోపీకృష్ణా మూవీస్‌ పతాకాలపై వంశీ, ప్రమోద్‌, ప్రశీద నిర్మిస్తున్నారు. పూజా హెగ్డే హీరోయిన్‌గా చేస్తున్న ఈ మూవీని కూడా పాన్ ఇండియా రేంజ్‌లో రూపొందిస్తున్నారు. ఇందులో ప్రభాస్ రొమాంటిక్ రోల్‌లో నటిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

చాలా కాలం అయింది... సంస్థపై ఫ్యాన్స్ ఫైర్

చాలా కాలం అయింది... సంస్థపై ఫ్యాన్స్ ఫైర్

ప్రభాస్ సినిమా అంటేనే రెండు మూడేళ్లు పడుతుంది అన్న టాక్ ఇండస్ట్రీలో ఉంది. అందుకు అనుగుణంగానే 'రాధే శ్యామ్' షూటింగ్ ఎప్పుడో ప్రారంభం అయినప్పటికీ.. రిలీజ్ విషయంలో క్లారిటీ మాత్రం రాలేదు. పైగా దీని నుంచి ఫ్యాన్స్ కోరుకున్నట్లుగా అప్‌డేట్స్ రావడం లేదు. దీంతో వాళ్లంతా నిరాశతో యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌పై సోషల్ మీడియా వేదికగా దాడి చేశారు.

షూటింగ్ అప్‌డేట్.. ప్రస్తుతం అదే పనిలో బిజీ

షూటింగ్ అప్‌డేట్.. ప్రస్తుతం అదే పనిలో బిజీ

ఈ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తయిందని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సీనియర్ హీరో కృష్ణంరాజు తెలిపారు. అంతేకాదు, కొన్ని సీన్లు చిత్రీకరించాల్సి ఉందని, అప్పటి వరకు చిత్ర యూనిట్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చేస్తుందని వెల్లడించారు. అదే సమయంలో మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా ప్రారంభం అయ్యాయని తెలిపారు. దీంతో రిలీజ్ డేట్ ప్రకటన వస్తుందని అంతా అనుకున్నారు.

రిలీజ్ డేట్ ప్రకటించకపోవడానికి కారణం ఇదే

రిలీజ్ డేట్ ప్రకటించకపోవడానికి కారణం ఇదే

సంక్రాంతి సీజన్ తర్వాత ప్రేక్షకుల నుంచి వచ్చిన మద్దతును గ్రహించిన దర్శక నిర్మాతలు.. తమ కొత్త ప్రాజెక్టులకు సంబంధించిన రిలీజ్ డేట్లను ప్రకటిస్తున్నారు. ఇప్పటికే పాన్ ఇండియా సినిమాలతో పాటు చిన్న చిత్రాల విడుదల తేదీలూ వచ్చాయి. కానీ, ప్రభాస్ 'రాధే శ్యామ్' రిలీజ్ డేట్ మాత్రం అనౌన్స్ చేయలేదు. దీనికి వీఎఫ్ఎక్స్ వర్క్ ఆలస్యం అవడమే కారణమని సమాచారం.

Recommended Video

Prabhas 21 : Nag Ashwin Repeats Mahanati Crew | Deepika Padukone | Prabhas
రాధే శ్యామ్ టీజర్ ఆరోజే వస్తుందంటున్నారే

రాధే శ్యామ్ టీజర్ ఆరోజే వస్తుందంటున్నారే

సినిమానే కాదు 'రాధే శ్యామ్' టీజర్ కూడా ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సి ఉంది. కానీ, దానికి కూడా వీఎఫ్ఎక్స్ వర్క్ ఆలస్యం అవడమే కారణం అని తెలుస్తోంది. అందుకే దీన్ని జనవరి నెలలోనే విడుదల చేయాల్సి ఉన్నా.. అది సాధ్యపడలేదు. దీంతో ప్రభాస్ సినిమా టీజర్‌ను ప్రేమికుల రోజు సందర్భంగా ఫిబ్రవరి 14న రిలీజ్ చేయబోతున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X