Prabhas అభిమానులకు గుడ్ న్యూస్.. విడుదలకు ముందే రాధేశ్యామ్ స్పెషల్ షోలు.. ఎప్పుడంటే?
రెబల్ స్టార్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న రాధేశ్యామ్ సినిమా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. గోపి కృష్ణ బ్యానర్స్ యువి క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా పై అంచనాలు అయితే మామూలుగా లేవు. అసలైతే ఈ సినిమాను గత ఏడాదిలోనే విడుదల చేయాలని అనుకున్నారు. కానీ కరోనా పరిస్థితుల కారణంగా వాయిదా వేసుకున్న విషయం తెలిసిందే. మొత్తానికి మార్చి 11వ తేదీన సినిమా భారీ స్థాయిలో ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. అయితే ఈ సినిమా మొదటి రోజు మొదటి షో చూడడానికి ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక చిత్ర యూనిట్ కూడా కొన్ని ప్రత్యేకమైన స్పెషల్ షోలను ప్రదర్శించబోతున్నట్లు సమాచారం. ఆ వివరాల్లోకి వెళితే..

ఫ్యాన్స్ షోలు కూడా..
అయితే ఈ సినిమాను మొదటి రోజు మొదటి షో చూడాలి అని హార్డ్ కోర్ ఫాన్స్ చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు అనే చెప్పాలి. వారి కోసం చిత్ర నిర్మాణ సంస్థ తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేకంగా కొన్ని స్పెషల్ షోలను కూడా ప్రదర్శించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మార్చి 10వ తేదీన విడుదల ఒకరోజు ముందే సినిమాకు సంబంధించిన ప్రత్యేకమైన ఫ్యాన్స్ షోలను ప్రదర్శించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇక సినిమా టికెట్ల కోసం యూవీ ప్రొడక్షన్స్ సన్నిహితులకు అభిమానుల నుంచి ముందుగానే ఫోన్ కాల్స్ వస్తున్నట్లు తెలుస్తోంది. మార్చి 10 వ తేదీన అర్ధరాత్రి నుంచి ఫ్యాన్స్ షోలతో రాధేశ్యామ్ రచ్చ మొదలు కానున్నట్లు సోషల్ మీడియాలో కూడా ఒక టాక్ వైరల్ అవుతోంది.

బడ్జెట్ పై క్లారిటీ ఇచ్చిన ప్రభాస్
ఇక ఈ సినిమాకు సంబంధించిన బడ్జెట్ పై ఇటీవల ప్రభాస్ కూడా ఒక క్లారిటీ అయితే ఇచ్చాడు. ప్రస్తుతం ప్రభాస్ చిత్ర యూనిట్ సభ్యులతో కలిసి అన్ని భాషల్లోనూ ప్రమోషన్స్ లో పాల్గొంటున్నాడు. అయితే సినిమాలో ప్రేమ గెలిచిందా? విధి గెలిచిందా? అని విలేకరి ప్రశ్నించగా ఆ సమాధానం థియేటర్లో చూసి తెలుసుకోవాలి అని దాదాపు మూడు వందల కోట్ల బడ్జెట్ పెట్టి ఈ సినిమా నిర్మాతలు నిర్మించారు. కాబట్టి నేను ఆ విషయాన్ని ముందే చెబితే బాగుండదు అని చాలా సరదాగా సమాధానమిచ్చాడు. ఏదేమైనా కూడా సినిమా దాదాపు మూడు వందల కోట్లు చేసినట్లు ప్రభాస్ క్లారిటీ ఇచ్చేశాడు.

ఫస్ట్ డే 100కోట్లు..?
మార్చి 11వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతున్న ఈ సినిమాను ప్రభాస్ కెరీర్ మొత్తంలో అత్యధిక థియేటర్స్ లో విడుదల చేస్తున్నారు. తప్పకుండా సినిమా మొదటి రోజే ఈజీగా 100 కోట్ల బాక్సాఫీస్ కలెక్షన్స్ అందుకుంటుంది అని బాక్సాఫీస్ పండితులు అంచనా వేస్తున్నారు. చిత్ర యూనిట్ సభ్యులు కూడా సినిమాలు ఓవర్సీస్లో భారీ స్థాయిలో విడుదల చేయబోతున్నారు. ప్రీమియర్స్ తోనే ఈ సినిమా 1 మిలియన్ డాలర్లు అందుకునే అవకాశం ఉంది.

సరికొత్త రికార్డులు క్రియేట్ అవ్వడం పక్కా..
రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన రాధేశ్యామ్ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే. అంతేకాకుండా కృష్ణంరాజు కూడా ఈ సినిమాలో ఒక ప్రత్యేకమైన పాత్రలో కనిపించబోతున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్స్ సాంగ్స్ కు మంచి గుర్తింపు లభించింది. తప్పకుండా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తుందని చిత్ర యూనిట్ సభ్యులు అంటున్నారు.


Click it and Unblock the Notifications











